అయ్యలరాజు నారాయణామాత్యుడు

తెలుగు కవి

అయ్యలరాజు నారాయణామాత్యుడు తెలుగు కవి.[1]

జీవిత విశేషాలు మార్చు

అతను కౌండిన్యస గోత్రానికి చెందిన సూరనార్యుడు, కొండమాంబ దంపతులకు జన్మించాడు.

అతను హంసవింశతి అను పేరున ఇరువది కథలు గల ఐదు అశ్వాసముల పద్యకావ్యమును రచించెను. హంసవింశతి గ్రంథము యందు రెట్ట మతమును రచించిన కవుల గూర్చి పద్యములలొ పేర్కొన్నాడు. 1969 వ సంవత్సరంలో గల కవులను ఈ గ్రంథంలో నుదహరించినందున అతని కాలం ఆ కవుల తరువాత ఉండునని తెలియుచున్నది. చారిత్రిక ఆధారాల ప్రకారం ఈ కవి కాలము సుమారు 1700 వ సంవత్సర ప్రాంతం అయి ఉండవచ్చును. అతని పద్యములలో తెలియజేసిన యయ్యలరాజ వంశమునకు చెందిన కవులలో పర్వతరాజును గొండయ్య, దిమ్మయ్య లను చేసిన గ్రంథములేవీ తెలియరాలేదు.

ఇతని కవిత్వములో లక్షణ విరుద్ధములయిన ప్రయోగములు అనేకం కలవు కానీ మొత్తము మీద గవిత్వము ప్రౌఢమయి రసవంత మయినదిగా నున్నది. ఈపుస్తకమునం దన్యదేశ్యము లనేకములు వాడబడియున్నవి. ఈత డాయా జాతులవారిని వర్ణించవలసివచ్చినప్పుడు మిక్కిలి కష్టపడి వారి వారి కుచితములయిన యుపకరణాదుల నామములన్నిటిని సంగ్రహించి వివరించియున్నాడు.

మూలాలు మార్చు

  1. కందుకూరి వీరేశలింగం - మూడవ భాగము (1911). ఆంధ్ర కవుల చరిత్రము. రాజమండ్రి: హితకారిణీ సమాజము. Retrieved 9 August 2020.