అరవ శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోడూరు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

అరవ శ్రీధర్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కొరముట్ల శ్రీనివాసులు
నియోజకవర్గం కోడూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1997
ముక్కవారిపల్లె, ఓబులవారిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు అరవ వెంకటయ్య
నివాసం 4-106, అమృతవారిపల్లి, ముక్కవారిపల్లె, ఓబులవారిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

అరవ శ్రీధర్ రాజకీయాల పట్ల ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చి ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2024 ఏప్రిల్ 1న  జనసేన పార్టీలో చేరి, [2][3] 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోడూరు నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులుపై 11101 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. Eenadu (1 April 2024). "పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన అరవ శ్రీధర్". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  3. Hindustantimes Telugu (4 April 2024). "ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చిన పవన్ - సర్పంచ్ కు MLA టికెట్". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kodur". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.