అన్నమయ్య జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా

అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాయలసీమ ప్రాంతంలో గల జిల్లా. దీని ముఖ్యపట్టణం రాయచోటి. మదనపల్లె జిల్లాలో అతిపెద్ద నగరం. జిల్లాలోని తాళ్లపాకకు చెందిన ప్రముఖ సంకీర్తనకారుడైన అన్నమాచార్య పేరు జిల్లాకు పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో జిల్లాలోని సురభి గ్రామంలో మొదలయ్యింది. ఆంధ్రా ఊటీగా పేరొందిన హార్సిలీ హిల్స్ ఈ జిల్లాలోనిదే.

అన్నమయ్య జిల్లా
జిల్లా
ఎడమ, పై నుండి సవ్యదిశలో: రాజంపేట లో సౌమ్యనాథ దేవాలయం, మదనపల్లె లో ఎహ్సానుల్లాఖాన్ వార్సీ దర్గా, హార్సిలీ హిల్స్ లో వరిచేలు, పీలేరు లో సూర్యాస్తమయం.
Location of అన్నమయ్య జిల్లా
Coordinates: 14°03′N 78°45′E / 14.05°N 78.75°E / 14.05; 78.75
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
స్థాపన2022 ఏప్రిల్ 4
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Named forఅన్నమయ్య
జిల్లా కేంద్రంరాయచోటి
పరిపాలనా విభాగాలు
 • రెవిన్యూ విభాగాలు : 3
 • మండలాలు : 30
Government
 • జిల్లా కలెక్టరుపి.యస్. గిరీష
Area
 • మొత్తం7,954 km2 (3,071 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం16,97,300
 • Density210/km2 (550/sq mi)
భాషలు
 • ఆధికారతెలుగు
Time zoneUTC+05:30 (IST)

చరిత్ర సవరించు

పాత చిత్తూరు జిల్లా, పాత వైఎస్‌ఆర్ జిల్లాలో కొన్ని మండలాలతో ఈ జిల్లా 2022 ఏప్రిల్ 4న కొత్తగా ఏర్పడింది.[1][2][3]

భౌగోళిక స్వరూపం సవరించు

జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో ఉంది. ఇది 13° 43’N - 15° 14’N, 77° 55’E - 79° 29’E మధ్య వ్యాపించివుంది. ప్రాంతాల ఎత్తు సముద్రస్థాయిపై 269 - 3787 మీటర్ల మధ్య వుంటుంది. దీనికి ఉత్తరాన వైఎస్ఆర్, దక్షిణాన చిత్తూరు, పశ్చిమాన అనంతపురం, తూర్పున నెల్లూరు, చిత్తూరు జిల్లాలున్నాయి. [4]జిల్లా విస్తీర్ణం 7,954 కి.మీ.

నదులు సవరించు

చెయ్యేరు మూడు ఉపనదుల నీటితో బాలరాజుపల్లె లోయలో ప్రవహిస్తుంది. ఇది గుండ్లమడ దగ్గర పెన్నేరులో కలుస్తుంది.

వన్యప్రాణులు సవరించు

బోనెట్ కోతి (MacacaRadiata), మద్రాసు లంగూర్ ఈ జిల్లాలో కనబడతాయి. పులులు కొండలలోని అటవీప్రాంతంలో కనబడతాయి. చిరుతపులి రక్షిత అడవులలో కనబడుతుంది. ఇవేకాక, ముంగీస, నక్క, తోడేలు, అడవి కుక్కలు, ఎలుగుబంటి, మలబారు ఉడుత, ముళ్లపంది, లేడి, మచ్చల లేడి, అడవి పంది నెమలి మొదలైనవి కూడా ఉన్నాయి. కంజు, క్వెయిల్ పిట్టలు కూడా ప్రముఖమైన పిట్టలు. రాజంపేటలో శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉంది.

నేలలు సవరించు

నల్లనేలలు, ఎర్రనేలలున్నాయి.

ఖనిజాలు సవరించు

ఈ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది.[5] Map ఇది కాక సున్నపు రాయి, ఆస్బెస్టాస్ ఎక్కువగా లభిస్తాయి. ఇవేకాక నాప బండలు, భవనాలకు వాడే రాళ్లు, చలువరాయి, లాంటివి కూడా తక్కువగా లభ్యమవుతాయి.

వాతావరణం సవరించు

డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం. మార్చినుండి మే వరకు వేసవికాలం, దీని తరువాత నైరుతి రుతుపవనాల వర్షాకాలం జూన్ - సెప్టెంబరు వరకుంటుంది. ఆతరువాత ఈశాన్య రుతుపవనాలతో అక్టోబరు -డిసెంబరు మధ్యకాలంలో కొద్దిపాటి వర్షపాతం వుంటుంది.

వర్షపాతం సవరించు

జిల్లా సగటు వార్షిక వర్షపాతం 743.7 mm. నైరుతి ఋతుపవనాల ప్రారంభం కాలంలో వేరుశనగ, కంది నాటుతారు. [6]

జనగణన విషయాలు సవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం అన్నమయ్య జిల్లా జనాభా 16,97,308. [7]

జనాభా - మతాలు (2011)[8]
మతం శాతం
హిందూ
  
81.97%
ముస్లిం
  
17.25%
ఇతర, లేక వెల్లడిచేయని
  
0.78%
మతాల విస్తరణ

2011 జనాభా లెక్కల ప్రకారం తొలిభాషగా 81.91% తెలుగు, 16.40% ఉర్దూ, 1.04% లంబాడీ వాడుతారు.[9]

పరిపాలనా విభాగాలు సవరించు

జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి రాజంపేట, రాయచోటి, మదనపల్లె. రాయచోటి రెవెన్యూ డివిజన్ పాత చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్, రాజంపేట రెవెన్యూ డివిజన్ ల నుండి, పాత వైఎస్‌ఆర్ జిల్లాలో కొన్ని మండలాలతో కొత్తగా ఏర్పడింది.[1] ఈ రెవెన్యూ డివిజన్లను 30 మండలాలుగా విభజించారు.

మండలాలు సవరించు

రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో 9 మండలాలు, రాయచోటి రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలు, మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో 11 మండలాలు ఉన్నాయి .

రాజకీయ విభాగాలు సవరించు

అన్నమయ్య జిల్లాలో ఒక పార్లమెంటు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

లోకసభ నియోజకవర్గం సవరించు

అసెంబ్లీ నియోజకవర్గాలు సవరించు

 1. కోడూరు
 2. తంబళ్లపల్లె
 3. పీలేరు
 4. మదనపల్లె
 5. రాజంపేట
 6. రాయచోటి

నగరాలు, పట్టణాలు సవరించు

జనగణన పట్టణాలు సవరించు

వ్యవసాయం సవరించు

వరి, వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, ప్రత్తి, తమలపాకులు ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తులు. మామిడి, బొప్పాయి, అరటి, నిమ్మ, బత్తాయి ప్రముఖ ఉద్యానవన పంటలు. [6] అనంతరాజుపేటలో పండ్ల పరిశోధన కేంద్రం ఉంది.

నీటి పారుదలు సవరించు

పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీరు సరఫరా జరుగుతుంది.

విద్యాసౌకర్యాలు సవరించు

జిల్లాలో 82 వృత్తి విద్యాకళాశాలలున్నాయి.

పరిశ్రమలు సవరించు

8 భారీ, మధ్యస్థ స్థాయి పరిశ్రమలున్నాయి.

రవాణా సౌకర్యాలు సవరించు

జిల్లాలో 301.59 కి.మీ. జాతీయ రహదారులు, 330.46 కి.మీ. రాష్ట్ర రహదారులు, 831.91 కి.మీ జిల్లా రహదారులు, 4,131.43 పంచాయితీరాజి రహదారులున్నాయి.

జిల్లాలో 195.13 కి.మీ. బ్రాడ్ గేజి రైలుమార్గాలున్నాయి. 13 మండలాలలో 24 రైల్వే స్టేషన్లున్నాయి.

విద్యుత్తు సవరించు

525.2 మిలియన్ కిలో వాట్ సామర్ధ్యం గల భారీ సౌర విద్యుత కేంద్రం ఉంది.[10]

పర్యాటక ప్రదేశాలు సవరించు

 
అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య విగ్రహం, తాళ్లపాక
 • అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాక
 • పరశురామ ఆలయం అత్తిరాల: రాజంపేట పట్టణం దగ్గర ఆలయం.[11]
 • సౌమ్యనాథస్వామి ఆలయం, నందలూరు: చాలా శిలాశాసనాలు గల ఆలయం.[4]
 • రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము, రాయచోటి
 • శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం తంబళ్లపల్లె మల్లయ్య కొండ
 • హార్సిలీ హిల్స్: ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం మదనపల్లె పట్టణానికి సమీపమున వున్న హార్సిలీ హిల్స్. ఈ ప్రదేశము "ఆంధ్ర ఊటీ"గా పేరు పొందినది. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.[12]
 • రిషి వ్యాలీ పాఠశాల: హార్స్లీ హిల్స్ వద్ద జిడ్డు క్రిష్ణమూర్తి స్థాపించిన గురుకుల పాఠశాల రిషి వ్యాలీ ఉంది.
 • థియసోఫికల్ కళాశాల, మదనపల్లె: దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లెలో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాలగా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది.
 • ఆరోగ్యవరం: ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉంది.

మూలాలు సవరించు

 1. 1.0 1.1 1.2 1.3 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
 2. Apparasu, Srinivasa Rao (2022-04-05). "Andhra adds 13 new districts with aim to boost governance". Hindustan Times. Retrieved 2022-04-09.
 3. "ANDHRA PRADESH GAZETTE". G.O.Rt.No.60, Revenue (Lands-IV), 25 [ 1 ] th January, 2022: 119. 25 January 2022.
 4. 4.0 4.1 DES 2022, p. 9.
 5. "Industrial profile Kadapa District, Industries Dept 2001-02" (PDF). Archived from the original (PDF) on 2012-05-13. Retrieved 2012-05-25.
 6. 6.0 6.1 DES 2022, p. 4.
 7. DES 2022, p. 3.
 8. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
 9. "Table C-16 Population by Mother Tongue: Andhra Pradesh". Census of India. Registrar General and Census Commissioner of India.
 10. DES 2022, p. 6.
 11. DES 2022, p. 8.
 12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-10. Retrieved 2011-04-05.

ఆధార గ్రంథాలు సవరించు

DES (2022). Annamayya district handbook of statistics (draft).