అరాగ జ్ఞానేంద్ర
అరాగ జ్ఞానేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో హోం మంత్రిత్వ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
అరాగ జ్ఞానేంద్ర | |||
| |||
హోం శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఆగష్టు 2021 | |||
గవర్నరు | థావర్ చాంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
ముందు | బసవరాజు బొమ్మై | ||
కర్ణాటక హోసింగ్ బోర్డు కార్పొరేషన్, చైర్మన్
| |||
పదవీ కాలం 28 జులై 2020 – 28 జులై 2021 | |||
మైసూర్ పేపర్ మిల్స్, చైర్మన్[1]
| |||
పదవీ కాలం 4 జూన్ 2008 – జూన్ 2012 | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
ముందు | కిమ్మనే రత్నాకర్ | ||
నియోజకవర్గం | తీర్థహళ్లి | ||
పదవీ కాలం 1994 – 2008 | |||
ముందు | డి బి చంద్రేగౌడ | ||
తరువాత | కిమ్మనే రత్నాకర్ | ||
నియోజకవర్గం | తీర్థహళ్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అరాగ | 1953 మార్చి 15||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
జీవిత భాగస్వామి | ప్రఫుల్ల | ||
సంతానం | 2 | ||
నివాసం | గుడ్డేకొప్ప, తీర్థహళ్లి | ||
పూర్వ విద్యార్థి | కువెంపు యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకియ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅరాగ జ్ఞానేంద్ర బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1983, 1985, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అరాగ జ్ఞానేంద్ర 1999లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2009, 2013లో ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన తరువాత మైసూర్ పేపర్ మిల్స్ ఛైర్మన్‌గా, కర్ణాటక హోసింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేసి 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో హోం మంత్రిత్వ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ "About Us > Management Team". Mpm.co.in. Archived from the original on 16 జూలై 2019. Retrieved 23 July 2019.
- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ Eenadu (22 February 2022). "భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు.. హోంమంత్రి వెల్లడి". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.