అరిత్ర దత్తా

సింగపూర్ క్రికెటర్

అరిత్ర దత్తా (జననం 1991, ఆగస్టు 15) సింగపూర్ క్రికెటర్.[1] 2018 అక్టోబరులో, అతను ఒమన్‌లో జరిగే 2018 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీ టోర్నమెంట్‌లో సింగపూర్ జట్టులో ఎంపికయ్యాడు.[2] 2018, నవంబరు 10న ఒమన్‌తో జరిగిన టోర్నమెంట్ సింగపూర్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడాడు.[3] ఐదు మ్యాచ్‌ల్లో 204 పరుగులతో టోర్నమెంట్‌లో సింగపూర్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4]

అరిత్ర దత్తా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1991-08-15) 1991 ఆగస్టు 15 (వయసు 33)
చెన్నై, తమిళనాడు
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 16)2019 29 సెప్టెంబరు - Zimbabwe తో
చివరి T20I2024 11 ఫిబ్రవరి - Japan తో
మూలం: Cricinfo, 11 ఫిబ్రవరి 2024

2019 సెప్టెంబరులో, 2019-20 సింగపూర్ ట్రై-నేషన్ సిరీస్ కోసం సింగపూర్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[5] 2019 సెప్టెంబరు 29న సింగపూర్ ట్రై-నేషన్ సిరీస్‌లో జింబాబ్వేపై సింగపూర్ తరపున తన టీ20 అరంగేట్రం చేసాడు.[6] 2019 అక్టోబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ఐసిసి టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం సింగపూర్ జట్టులో ఎంపికయ్యాడు.[7]

2023 అక్టోబరులో, దత్తా 2023 ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు సింగపూర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Aritra Dutta". ESPN Cricinfo. Retrieved 9 November 2018.
  2. "Squads and match schedule announced for ICC World Cricket League Division 3". International Cricket Council. Retrieved 31 October 2018.
  3. "4th Match, ICC World Cricket League Division Three at Al Amarat, Nov 10 2018". ESPN Cricinfo. Retrieved 10 November 2018.
  4. "ICC World Cricket League Division Three, 2018/19 - Singapore: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 19 November 2018.
  5. "INSTAREM tri-series Singapore 2019-20 – Fixtures, Schedule, Venues, Squads, Match Timings and Live Streaming Details". CricTracker. Retrieved 26 September 2019.
  6. "3rd Match (N), Singapore Twenty20 Tri-Series at Singapore, Sep 29 2019". ESPN Cricinfo. Retrieved 29 September 2019.
  7. "ICC T20 World Cup Qualifier – UAE". Cricket Singapore. Retrieved 10 October 2019.

బాహ్య లింకులు

మార్చు