అరిపిరాల విశ్వం
ఆనందఘన అరిపిరాల విశ్వం రచయిత, ఆధ్యాత్మిక గురువు. అతను "ఆనందఘన"గా పేరొందింది. అతను హైదరాబాద్ న్యూసైన్సు కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చాలాకాలం పనిచేశాడు. దేవుడిని నమ్మే మార్క్సిస్టుగా తనను తాను వర్ణించుకున్నాడు.
అరిపిరాల విశ్వం | |
---|---|
జననం | అరిపిరాల విశ్వం నడకుదురు, చలపల్లి మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
వృత్తి | అధ్యాపకుడు, రచయత, గొప్ప ఆధ్యాత్మిక వేత్త , క్రీయా యోగి. |
ప్రసిద్ధి | ప్రముఖ రచయిత |
మతం | హిందూ |
Notes ఆనందఘన |
జీవిత విశేషాలు
మార్చుఅతను కృష్ణా జిల్లా నడకుదురు (చల్లపల్లి) గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతను తండ్రి లక్ష్మీనారాయణ శాస్త్రి. అతను పూర్వీకులు బెనారస్ నుండి వచ్చిన వైదిక గురువులుగా సుప్రసిద్ధులు. ఆ వంశవృక్షంలో అతనుకు పూర్వం 33 తరాలవరకు వైదిక ధర్మపరులైన పూర్వీకులుండేవారు. అనేక మంది పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, మైసూరు రాయల్టీ, శృంగేరీ పీఠం ఆస్థాన విద్వాంసులు సైతం విశ్వంగారి తండ్రిగారైన లక్ష్మీనారాయణ శాస్త్రిని కలసేవారు. అతనుకు సాధారణంగా అలిపిరాల విశ్వం జన్మించినప్పటికీ అతను పూర్వజన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక సంపద, పరమగురు మహావతార్ బాబాజీ అతనును ఒక యోగిగా గుర్తించినట్లు అవగతమైనది.
ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత పద్యం, ధారణ, కళలు, వాక్పటిమల పట్ల విశేష ప్రతిభ కనబరిచాడు. అతను న్యూయార్క్ లోని ప్రపంచ పొయిట్రిక్ సొసైటీ నుండి అవార్డును అందుకున్నారు. అతను చిన్నవయసులోనే యునైటెడ్ నేషన్స్ మైస్టిక్ గ్రూపులో ప్రసంగించి తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. అతను భూగ్రహంపై గల 2000 మంది ప్రతిభావంతులైన పౌరులలో ఒకనిగా గుర్తింపబడ్డాడు. అతను తన స్వంత రాష్ట్రంలో డాక్టరేట్ పొందడమే కాకుండా ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలనుండి తొమ్మిది డాక్టరేట్లతో సత్కరింపబడ్డాడు. అతను సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందారు. తన స్వంత రాష్ట్రమే కాకుండా 137 దేశాలలో సుపరిచిత వ్యక్తిగా నిలిచాడు. అతను మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో[1] పాల్గొనడమే కాకుండా వివిధ సంస్థలలో సభ్యునిగా, డైరక్టరుగా, చైర్మన్ గా అనేక సేవలనందించారు.విశ్వం గారు చేసిన ప్రసంగాలను 10000 ఆడియో సిడి ల యందు రికార్డ్ చేసారు. అతను రెండవ కుమారుడు అరిపిరాల రామకృష్ణ గారు వారి తండ్రిగారు చేసిన ప్రసంగాలను పుస్తకాలు రూపములో ప్రజలకు అందుబాటు లోకి తెస్తున్నారు. అరిపిరాల విశ్వం గారు కొంతకాలం తర్వాత ప్రజా జీవితం నుండి అదృశ్యమై (2010) లో తన గురువు అయిన మహావతార్ బాబాజీ గారి ఆజ్ఞ మేరకు ప్రజాజీవితంతో స్వీయ బహిష్కరణ విధించుకున్నారు. అతనుకు వారి గురువుగారైన మహావతార్ బాబాజీ ఆనందఘన అన్న నామాన్ని విశ్వం గారికి ఇచ్చారు. అతను రాసిన బుక్స్ అన్నీ కూడా ఆనందఘన అరిపిరాల విశ్వం అన్న పేరు మీద ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు (దాదాపు 100) శ్రీ లలిత పరమేశ్వరి, గురువు గారైన మహావతార్ బాబాజీ కృపతో రాశారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు ఇంత లోతైన జ్ఞానంతో రాయడం మామూలు మానవుడివల్ల వీలుకాదనియు ఇతను కారణజన్ముడని మనకు అర్ధమౌతున్ది. ఇతను గడిపిన జీవితం కూడా ఎంతో సామాన్యంగా గడిపారు. క్రియ యోగంలో ఆనందఘన (విశ్వం) గారు గొప్ప నిష్ణాతుడు. అయన దగ్గర ఎంతో మంది శిష్యులు క్రియ యోగ నేర్చుకున్నారు.ఇతను రాసిన బుక్స్ లోసాధన పంచతంత్రం, ఖడ్గమాలా దర్శనము (ఇంత వివరణ ఎవరూ రాసిన దాఖలా లేదు) చదివితే లలిత అమ్మవారి అనుగ్రహం ఇతను మీద ఎంత వున్నదో మనకు అవగతమౌతున్ది. అతను "పరంపర విశ్వంభర" అనే సంస్థను స్థాపించి అనేక ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధించడమే కాకుండా క్రియా యోగా సాధకులకు నేర్పించేవారు.అతను తోటి జీవుల యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి అంకితం ఒక ట్రస్ట్ ప్రారంభించారు.
రచనలు
మార్చు- విదురకన్నెలు
- కాలం గీస్తున్న గీతలు
- రేపటి స్వర్గం
- మైథిలీవల్లభ శతకం
- పృథ్వీశ్వర త్రిశతి
- మనస్[2]
- గుహేశ్వర మహాదేవ వచనములు
- ఖడ్గమాలా దర్శనము (ఆనందఘన వ్యాఖ్య)
- పరావిద్య
- సాధనా పంచతంత్రం (ఉపన్యాసాలు)[3]
- శ్రీగురు త్రయోపనిషత్
- శ్రీ విద్యాపంచదశి
- ఉపనిషత్తుల శ్రీ విద్యారహస్యాలు
- పరంపరా ఉపనిషత్ కథలు
- ప్రణవ సాహస్రి
- హళేబీడు
- ధ్యానదీపిక
- కల చెరిగిపోనీకు నేస్తం
- అశ్వఘోషుడు (నాటకం)
- శ్రీలలితా సహస్రనామ అంతర్గత రహస్యములు[4]
- మంత్రఘన[5]
- ఖడ్గమాలా దర్శనము
- Voice of OM silence
- Gospel of Silence
- K.Seshagiri Rao (monograph)
- Avadhuta Gita
- Guru Geeta
- Kriya yoga - The essence of Satha vidyas[6]
- Babaji Stories[7]
- Fistful of Memory
- Crisis of Self
- River My Guru
- Subrahmanya Swamy
- Sri Sutram
- Messaiah 2-volumes
- Jiddu Krishna Murti
- The spirit, God and Foreverness
రచనల నుండి మచ్చుతునకలు
మార్చు- పౌనఃపున్యజనుర్మృతీ కలిత సంప్రాప్తోగ్ర బాధామతిన్
- ఏనః పుంజము నెంత దాల్చితినొ పోయెన్ ఱేయిచీకట్లలో
- లీనంబై బ్రతుకంత నీకెదురు రాలేనోయి! నే నంధుడన్
- శ్రీ నిత్యోత్సవ చిద్విలాస పరమేష్టీ మైథిలీ వల్లభా!
- అస్మజ్జీవన గేహళీజ్వలిత దీపాంకూరముల్ దైన్య సం
- విస్మర్తవ్య కథాప్రపంచమును లేపెన్ నిద్రలోనుండి - మై
- భస్మోల్లేపన పాండు దీధితులు పర్వన్ నందిపై వచ్చు నీ
- శా! స్మృత్యంకములో సత్యమ్ము నిలుమయ్యా! మైథిలీ వల్లభా!
- (మైథిలీ వల్లభ శతకము నుండి)
- పూవుం దోటలు నీలి మబ్బులు మహాంభోరాశి నిర్ఘోషముల్
- తావుల్ చిమ్మెడి దక్షిణానిలము - చెంతన్ చెట్లపై పక్షులున్
- నీవున్నిల్తురు - యీ స్మశానభువిలో - నిర్ణిద్ర ప్రేతాకృతుల్
- ఏవో మంత్రములుచ్చరింపఁగ - విషాహిగ్రీవ! పృథ్వీశ్వరా!
- ఇవె పొన్నల్ ప్రభుపాద పూజకయి - ఎన్నేండ్లిట్లుగా నిల్చెనో
- ఇవె బిల్వద్రుమసంతనిల్ - చిగురుటాకే కన్నుగా బొల్చు ని
- య్యవి మల్లీ వకుళామ్ర భూజములు! పర్యాప్తాశ్రుమాలా - సుమా
- లివి లేమబ్బులు కుంభశీర్షములు - వ్రాలెన్ మ్రోల పృథ్వీశ్వరా!
- (పృథ్వీశ్వర త్రిశతి నుండి)
అతను ప్రేరణతో సేవలందిస్తున్న సంస్థలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "World Telugu Conference Galleries". www.worldteluguconference.com. Archived from the original on 2012-12-04. Retrieved 2019-08-04.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
- ↑ "Sadhanaa Panchatantram Telugu Book By Aripirala Viswam". Archived from the original on 2019-03-05. Retrieved 2019-08-04.
- ↑ "Sri Lalitaa Sahasranama Antargata Rahasyamulu Telugu Book By Aripirala Viswam". Archived from the original on 2019-08-04. Retrieved 2019-08-04.
- ↑ "Mantraghana Telugu Book By Dr. Aripirala Viswam". Archived from the original on 2019-06-29. Retrieved 2019-08-04.
- ↑ "Kriya Yoga The Essence of Satha vidyas". Archived from the original on 2019-08-04. Retrieved 2019-08-04.
- ↑ "Babaji Stories". Archived from the original on 2019-08-04. Retrieved 2019-08-04.