నడకుదురు(చల్లపల్లి)

భారతదేశంలోని గ్రామం

నడకుదురు, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 126. యస్.టీ.డీ కోడ్ = 08671.

నాడకుదురు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ పుట్టి వీరాస్వామి
జనాభా (2001)
 - మొత్తం 3,620
 - పురుషులు 1,874
 - స్త్రీలు 1,836
 - గృహాల సంఖ్య 1,058
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలంసవరించు

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరువెనుక చరిత్రసవరించు

శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడిగా ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి నాడు నరకాసురుడిని ఇక్కడే సంహరించాడని స్కంద పురాణం చెబుతున్నది. ఈ వూరి పురాతన నామాలు :- నరకోత్తారక క్షేత్రం, నరకొత్తూరు, నడకదూరు. [2]

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో పురిటిగడ్డ, నిమ్మగడ్డ, నాదెండ్లవారిపాలెం, రాముడుపాలెం, వెలివోలు, పాగోలు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

ఘంటసాల, మోపిదేవి, మొవ్వ, కొల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నడకుదురు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామంలో ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని నిర్మించారు. ఈ పథకానికి రోటరీ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వారు రు.3.7 లక్షల విలువగల యంత్రాలను, భవనం మరమ్మత్తులకు సహకారాన్నీ అందించారు. నడకుదురు పంచాయతీ తరపున భవన నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, నీటి సదుపాయం ఏర్పాటు చేసారు. [6]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంసవరించు

నడకుదురు గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న గ్రామ సచివాలయభవనం, 21.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న రైతు భరోసా కేంద్రం భవనాలకు,2020,సెప్టెంబరు-27న మంత్రి శ్రీ సింహాద్రి రమేష్‌బాబు శంఖుస్థానగావించినారు. [10]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

కె.యీ.బి.కెనాల్. (K.E.B.Canal)

గ్రామపంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పుట్టి వీరాస్వామి సర్పంచిగా, 8 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ పృధ్వీశ్వరస్వామివారి ఆలయంసవరించు

  1. కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్తంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
  2. ఈ అలయంలో, 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చాడు. [4]
  3. ఈ ఆలయానికి రాముడుపాలెం గ్రామంలో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉంది. []

శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంసవరించు

పాటలీవనంలో కొలువైయున్న ఈ ఆలయంలో భక్తులు, 2014,అక్టోబరు-27, నాగులచవితి మరియూ కార్తీకసోమవారం సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి తమ మొక్కుబడులు తీర్చాలంటూ పాటలీవృక్షాలకు తమ మొక్కుబడులు కట్టినారు. [5]

శ్రీ రామాలయంసవరించు

పాతనడకుదురు గ్రామంలో రు. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ రజక రామాలయంలో, 2o15-మార్చ్-28వ తేదీ,శనివారం, శ్రీరామనవమి రోజున విగ్రహ ప్రతిష్ఠా మహొత్సవం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఐదుగురు దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం చేయించారు. భక్తులకు పానకం, వడపప్పు అందించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి ప్రదాన పంట

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

అరిపిరాల విశ్వం వీరు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన"గా సుప్రసిద్ధులు.

కీ.శే.కళ్ళేపల్లి శ్రీమన్నారాయణ:- పాతనడకుదురు గ్రామంలో, క్రీ.శ. 1922 లో జన్మించిన వీరు, బాలనటుడిగా రంగస్థల ప్రవేశం చేసి, 18 వ సంవత్సరాల వయసు నుండి, రంగస్థల నటుడిగా ఖ్యాతి గడించడమేగాక, ఎంతోమందిని కళాకారులుగా తీర్చిద్దినారు. వీరు 94 సంవత్సరాల వయసులో, 2017,జనవరి-5న తన స్వగృహంలో, వయో భారంతో కన్నుమూసినారు. [9]

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3710.[3] ఇందులో పురుషుల సంఖ్య 1874, స్త్రీల సంఖ్య 1836, గ్రామంలో నివాస గృహాలు 1058 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1439 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Nadakuduru". Retrieved 25 June 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు ఆదివారం అనుబంధం; 2011,అక్టోబరు-23; 5వపేజీ [3] ఈనాడు కృష్ణా; 2013,ఆగస్టు-1; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-26; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-28; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబరు-1; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-29; 1వపేజీ [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జులై-10; 3వపేజీ. [9] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జనవరి-6; 3వపేజీ.