అరూప్ కుమార్ గోస్వామి

అరూప్ కుమార్ గోస్వామి (జననం 1961 మార్చి 11) భారతీయ న్యాయమూర్తి. 2021 జనవరి 6 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. [1][2] దీనికి ముందు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. [3]

అరూప్ కుమార్ గోస్వామి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 జనవరి 2021
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు జితేంద్ర కుమార్ మహేశ్వరి

పదవీ కాలం
15 అక్టోబరు 2019 – 5 జనవరి 2021
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు Meenakshi Madan Rai (acting)
తరువాత జితేంద్ర కుమార్ మహేశ్వరి

పదవీ కాలం
24 జనవరి 2011 – 14 అక్టోబరు 2019
సూచించిన వారు S. H. Kapadia
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-11) 1961 మార్చి 11 (వయసు 63)
జోర్హట్, అస్సాం

వృత్తి జీవితం మార్చు

1981 లో గౌహతి విశ్వవిద్యాలయం పరిధిలోని కాటన్ కాలేజీ నుండి ఎకనామిక్స్ (ఆనర్స్) లో పట్టభద్రుడయ్యాడు. 1985 లో గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి ఎల్ఎల్‌బి డిగ్రీ పొందాడు. 16.8.1985 న అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరాడు. ప్రధానంగా సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, ఉద్యోగసేవల విషయాలపై న్యాయవాదిగా పనిచేశాడు.

24.01.2011 న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 07.11.2012 నాటికి శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు.

తాత్కాలిక గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండు సార్లు - 06.09.2018 నుండి 29.10.2018 వరకు, 24.05.2019 నుండి 06.10.2019 వరకు పనిచేశాడు

2019 అక్టోబరు 15 న సిక్కిం హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

2020 డిసెంబరు 31 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు. 2021 జనవరి 6 న ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

మూలాలు మార్చు

  1. "Justice Goswami takes over as new chief justice of Andhra Pradesh". Hindustan Times (in ఇంగ్లీష్). 6 January 2021. Retrieved 7 January 2021.
  2. Reporter, Staff (6 January 2021). "Arup Kumar Goswami sworn in as Chief Justice of Andhra Pradesh High Court". The Hindu (in Indian English). Retrieved 7 January 2021.
  3. "Justice Arup Kumar Goswami sworn in as new Chief Justice of High Court of Sikkim". www.sikkim.gov.in. Retrieved 7 January 2021.
  4. "ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి". 2021-01-06. Archived from the original on 2021-01-28. Retrieved 2021-01-28.