అర్థపంచకము నారాయణ పరివ్రాట్కృత మగు గ్రంథము, పంచవిషయపద్ధతిని దెలుపును.[1]

పంచప్రధాన విషయము లేవన: 1. జీవము, 2. ఈశ్వరుడు, 3. ఉపాయము, 4. ఫలము లేక పురుషార్థము, 5, విరోధము. మరల నివి యొక్కొక్కటి యైదు తెరగులు.

  1. నిత్య, ముక్త, కేవల, ముముక్షు, బద్ధము లనునవి జీవము లోని యైదు తెరగులు.
  2. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చలు ఈశ్వరుని యందలి పంచప్రకారములు.
  3. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ప్రపత్తియోగ, ఆచార్యాభిమానయోగములు పంచోపాయములు.
  4. ధర్మ, అర్థ, కామ, కైవల్య, మోక్షములు పంచవిధ పురుషార్థములు.
  5. స్వస్వరూపవిరోధము, పరస్వరూపవిరోధ, ఉపాయవిరోధ, పురుషార్థవిరోధ, ప్రాప్తివిరోధములు.

మూలాలుసవరించు