జీవం

పకృతి నుండి శక్తిని స్వీకరించి పునరుత్పత్తి చేసే పదార్థం

దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి. ఈ సృస్టిలో రెండు పదార్ధాలు ఉన్నాయి. అవి జీవులు, నిర్జీవులు. వాటిని వేరు చేసేది కేవలం వాటిలో ఉండే ప్రాణం.

ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో కనబడిన ఎడినో వైరస్ జీవులు

భౌతిక శాస్త్రం గానీ, రసాయన శాస్త్రం గాని ఈ జీవం యొక్క నిర్వచనం చెప్పలేదు.

జీవ శాస్త్రం లేదా జీవ రసాయన శాస్త్రం మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే జీవక్రియలు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.

జీవక్రియలు

మార్చు

జీవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొన వచ్చును. ఈ చర్యలు జీవం మనుగడకు అత్యావశ్యకమైనవి. వీటి వలన జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ధి, నిర్మాణము, పరిసరానుగుణ్యత మొదలగు అంశాలు చోటుచేసుకుంటాయి.

అబ్రకం పొరల్లోజీవం పుట్టుక

మార్చు

భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ జీవానికి అంకురార్పణ జరుగలేదు. దానికి కారణం జీవం పుట్టుకకు కావలసిన వాతావరణం లేకపోవడమే.అబ్రకం ఫలకాల్లో జీవం ఆవిర్భవించిందని, పుస్తకంలోని పేజీల తరహాలో ఉండే ఈ ఖనిజం పొరల్లో మొదటి జీవి వూపిరి పోసుకుందని, ఈ పొరల మధ్య కంపార్ట్‌మెంట్లు ఉండేవని, వీటిలో కొన్ని పరమాణువులు కణాలుగా మారడానికి అవసరమైన భౌతిక, రసాయన వాతావరణాన్ని అబ్రకం కల్పించిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

అసలు అప్పుడేం జరిగింది???

మార్చు

సుమారు 13.7 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం బిగ్ బ్యాంగ్ (బ్రహ్మాండ విస్పోటనం) జరిగి ఇప్పుడున్న విశ్వం తయారయినది.భూమి కూడా అలా విశ్వంలోనికి విసిరివేయబడ్డ ఓ ముక్క మాత్రమే.అప్పుడు ఈ భూమి ఓ మండుతున్న అగ్నిగోళం.అలా కొన్ని కోట్ల సంత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడింది.అది కూడా ఊపరితలంపై మాత్రమే.ఓ నగ్నసత్యం ఏమిటంటే ఇప్పటికి ఈ భూమి అట్టడుగు పొరలు ఇంకా చల్లారలేదు.భూమి అడుగు భాగాన శిలలు సైతం కరిగిపోయే వేడిమి ఉంది.అంటే మనం ఇంకా ఓ అగ్నిగోళంపై ఉన్నామన్నమాట.

సరే ఇక జీవం పుట్టుక విషయానికి వస్తే...కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైపొర చల్లారిన తర్వాత నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్,, ఇతర వాయువులు ఏర్పడినాయి.కొంత కాలం తర్వాత నీరు, కర్బన పదార్దాలు ఏర్పడ్డాయి.వాటిలోనే నిరంతర రసాయన చర్యల మూలంగా కొత్త రసాయన పదార్దాలు తయారయ్యాయి.వాటిలో అమైనో ఆసిడ్లు కీలకమైనవి.ఎందుకంటే జీవం పుట్టుకకు అవే కారణం మరి.

మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు సముద్రం అని చెప్పవచ్చు.నీటి సమక్షంలోనే అమినో ఆసిడ్ లు, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే ఏక కణ జీవి ఉద్బవించింది.

ప్రకృతే దైవం పచ్చదనమే ప్రాణం భూమిపై జీవ జాతులను సృష్టించి తానే సర్వమై నడిపించి గతించాక తనలో కలుపుకుంటుంది. అందుకే ప్రకృతి ఒకటే ఇలపై దైవం. నేడు మనం పూజిస్తున్న దేవుళ్ళందరికి కూడా ప్రకృతి తన ఒడిలో జన్మనిచ్చి తానై నడిపించి గతించాక తనలో కలుపుకుంది. ఇలలో ప్రకృతి ఒక్కటే దైవం.

"https://te.wikipedia.org/w/index.php?title=జీవం&oldid=3278149" నుండి వెలికితీశారు