అర్దెషీర్ ఇరానీ

భారతీయ చలనచిత్ర దర్శకులు

అర్దెషీర్ ఇరానీ (డిసెంబరు 5, 1886 - అక్టోబరు 14, 1969) భారతీయ సినిమా మొదటి మూకీ, టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. ఇతడు హిందీ ఇంగ్లీషు, జర్మన్, ఇండోనేషియన్, పర్షియన్, ఉర్దూ, తమిళ చిత్రాలను నిర్మించాడు.

జీవితం , రంగం మార్చు

 
ఆలం అరా చిత్రానికి రికార్డింగు చేస్తున్న అర్దేషిర్ ఇరానీ

అర్దెషీర్ ఇరానీ పర్షియన్-జొరాష్ట్రియన్ కుటుంబాని చెందినవాడు. ఇతని పేరు ఖాన్ బహాదుర్ అర్దెషీర్ ఇరానీ, పూణెలో జన్మించాడు. భారతీయ సినిమా రంగంలో మొదటి టాకీ చిత్రమైన ఆలం ఆరాను ఇతనే నిర్మించాడు.

ఇవీ చూడండి మార్చు