పూణే
మహారాష్ట్ర లో ఒక నగరం.
(పూణె నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పూణే పశ్చిమ భారతదేశం లోని మహారాష్ట్ర అనే రాష్టంలో ఉంది. ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారతదేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా, మహారాష్ట్రలో రెండవ అతి పెద్ద నగరంగా ఉంది. ముంబాయి మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్ధిగాంచింది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు. జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ ఇక్కడ ఉంది.
?పూణే మహారాష్ట్ర • భారతదేశం | |
మారుపేరు: డక్కన్ రాణి | |
అక్షాంశరేఖాంశాలు: 18°32′N 73°51′E / 18.53°N 73.85°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
1,359 కి.మీ² (525 sq mi) • 560 మీ (1,837 అడుగులు) |
జిల్లా (లు) | పూణే జిల్లా |
తాలూకాలు | హవేలీ తాలూక |
జనాభా • జనసాంద్రత • Metro |
50,64,700 (2008 నాటికి) • 7,214/కి.మీ² (18,684/చ.మై) • 56,95,000 (8వది) (2008) |
మేయర్ | రాజ్‌లక్ష్మి భొసాలే |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 411 0xx • +91(20) • MH 12 (పుణె), MH 14 (పింప్రి-చించ్‌వడ్) |
వెబ్‌సైటు: www.pune.gov.in |
ప్రముఖులు
మార్చుపూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
- ఆనందీబాయి జోషి - పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు.
- కమల్ రణదివె - భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
- కునాల్ గాంజావాలా - సినిమా నేపథ్య గాయకుడు.
- ప్రభా ఆత్రే - కిరాణా ఘరానాకు చెందిన హిందుస్తానీ గాయని.
- బాల గంధర్వ - ఈ పేరుతో ప్రసిద్ధుడైన నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ మరాఠీ గాయకుడు, నాటక కళాకారుడు.
- బాల్ థాకరే - శివసేన పార్టీ వ్యవస్థాపకుడు.
- మణీందర్ సింగ్ - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- రాధిక ఆప్టే - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
- రేణూ దేశాయ్ - తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్. తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.
- రోహిణీ హట్టంగడి - హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది.
- వసంత్ గోవారికర్ - భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత.
- వినోద్ ఖోస్లా - ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకడు.
- వినోద్ ధామ్ - ఇంటెల్ పెంటియమ్ చిప్ యొక్క రూపకర్త.
- వై.వి. చంద్రచూడ్ - 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి.
- సులోచన/రూబీమేయర్స్ - తొలి తరం హిందీ సినిమా నటి. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఆంగ్లో ఇండియన్.
- స్మితా పాటిల్ - భారతీయ సినిమా, టెలివిజన్ నటి.
- హంసా నందిని - నటిగా, మోడల్‌గా రాణిస్తున్న వ్యక్తి. పలు తెలుగు సినిమాలలో నటించింది.
- క్షమా సావంత్ - అమెరికా దేశానికి చెందిన రాజకీయవేత్త, ఆర్థికవేత్త.
ఇవికూడా చూడండి
మార్చువెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Puneకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.