అల్లావుద్దీన్ ఖిల్జీ
అల్లావుద్దిన్ ఖిల్జీ (పరిపాలన కాలం 1296-1316) ఢిల్లీ ని రాజధానిగా చేసుకుని భారత ఉపఖండాన్ని పరిపాలించాడు.అల్లావుద్దిన్ ఖిల్జీ రెండవ అలెగ్జాండర్ గా తన నాణేల మీద ముద్రించుకున్నాడు. అల్లావుద్దిన్ ఖిల్జీ తన మామ ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దిన్ ఖిల్జీ ని చంపి సింహాసనానికి వచ్చాడు .అల్లావుద్దిన్ ఖిల్జీ 1290 లో తన మామ కుమార్తె మల్లిక ను వివాహం చేసుకున్నాడు. 1291 లో కార ప్రాంత గవర్నర్ గా జలాలుద్దిన్ ఖిల్జీ చేత నియమించబడ్డాడు. ఖిల్జీల వంశంలో అల్లావుద్దిన్ ఘనుడు. అల్లావుద్దిన్ ఖిల్జీ రాజ్యానికి రాగానే అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. జలాలి ప్రభువుల తిరుగుబాటూ, మంగోలుల దాడులు, రాజపుత్రుల సమస్యలు ఎదుర్కొవలసి వచ్చింది. అల్లావుద్దిన్ సమస్యలను తన సైనిక బలంతో ఎదుర్కొని వీశాల రాజ్యాన్ని స్థాపించాడు.
అల్లాఉద్దీన్ ఖల్జీ | |||||
---|---|---|---|---|---|
సుల్తాన్ సికిందర్ - ఇ - సని | |||||
ఢిల్లీ సుల్తాను | |||||
పరిపాలన | 19 జూలై 1296–4 జనవరి 1316 | ||||
Coronation | 21 అక్టోబరు 1296 | ||||
పూర్వాధికారి | జలాలుద్దీన్ ఫిరుజ్ ఖల్జీ | ||||
ఉత్తరాధికారి | శిహాబుద్దీన్ ఒమర్ | ||||
అవధ్ గవర్నర్ | |||||
Tenure | సుమారు 1296–19 జూలై 1296 | ||||
Governor of Kara | |||||
Tenure | సుమారు 1291–1296 | ||||
Predecessor | మాలిక్ చజ్జు | ||||
Successor | ʿఆలాʾ ఉల్-ముల్క్ | ||||
అమీర్-ఇ-తజుక్ (equivalent to Master of ceremonies) | |||||
Tenure | సుమారు 1290–1291 | ||||
జననం | ఆలీ గుర్షాప్ సుమారు1266 | ||||
మరణం | 1316 జనవరి 4 Delhi, India | (వయసు 49–50)||||
Burial | |||||
Spouse |
| ||||
వంశము |
| ||||
| |||||
House | ఖిల్జీ వంశం | ||||
తండ్రి | షిహబుదీన్ మాస్ ఉద్ | ||||
మతం | ఇస్లాం |
ఆరంభకాల జీవితం
మార్చుసమకాలీన చరిత్రకారులు అలావుద్దీను బాల్యం గురించి పెద్దగా రాయలేదు. 16 వ / 17 వ శతాబ్దపు చరిత్రకారుడు హాజీ-ఉద్-దా-బీరు అభిప్రాయం ఆధారంగా రణతంబోరు (1300-1301) కు తన దండయాత్ర ప్రారంభించినప్పుడు అలావుద్దీను వయసు 34 సంవత్సరాలు. ఇది సరైనదని ఊహిస్తే అలావుద్దీను జననం 1266–1267 నాటిది.[2] ఆయన అసలు పేరు అలీ గుర్షాస్పు. ఆయన ఖిల్జీ రాజవంశం వ్యవస్థాపకుడు సుల్తాను జలాలుద్దీను అన్నయ్య అయిన షిహాబుద్దీను మసూదు పెద్ద కుమారుడు. అతనికి ముగ్గురు సోదరులు ఉన్నారు: అల్మాసు బేగు (తరువాత ఉలుగు ఖాను), కుట్లగు టిగిను, ముహమ్మదు.[3]
షిహాబుద్దీను మరణం తరువాత అలవుద్దీను పోషణ బాధ్యతను జలాలుద్దీను తీసుకున్నాడు.[4] అలావుద్దీను, ఆయన తమ్ముడు అల్మాసు బేగు ఇద్దరూ జలాలుద్దీను కుమార్తెలను వివాహం చేసుకున్నారు. జలాలుద్దీను ఢిల్లీ సుల్తాను అయిన తరువాత అలావుద్దీను అమీరు-ఇ-తుజుకు (ఉత్సవ నిర్వాహకుడు) గా నియమించబడ్డాడు. అల్మాసు బేగు కు అఖురు-బిగు (అశ్వదళాధిపతి) పదవి ఇవ్వబడింది.[5]
జలాలుద్దీను కుమార్తెతో వివాహం
మార్చు1290 నాటి ఖల్జీ విప్లవానికి చాలా కాలం ముందు అలవుద్దీను జలాలుద్దీను కుమార్తె మాలికా-ఇ-జహానును వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ ఈ వివాహం సంతోషకరమైనది కాదు. జలాలుద్దీను చక్రవర్తిగా ఎదిగి అకస్మాత్తుగా యువరాణి అయిన తరువాత, ఆమె చాలా అహంకారంతో, అలావుద్దీను మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించింది. హాజీ-ఉదు-దాబీరు అభిప్రాయం ఆధారంగా అలవుద్దీను మాలికు సంజారు అలియాపు ఆల్పు ఖాను సోదరి అయిన మహ్రూ అనే రెండవ మహిళను వివాహం చేసుకున్నాడు.[6] తన భర్త రెండవ భార్యను వివాహం చేసుకున్నందుకు మాలికా-ఇ-జహాను చాలా ఆగ్రహించింది. దాబీరు అభిప్రాయం ఆధారంగా అలావుద్దీను, ఆయన మొదటి భార్య మధ్య అపార్థానికి ఇది ప్రధాన కారణం అని భావించవచ్చు.[6] ఒకసారి అలావుద్దీను, మహ్రూ కలిసి ఒక తోటలో ఉండగా జలాలుద్దీను కుమార్తె అసూయతో మహ్రూ మీద దాడి చేసింది. ప్రతిస్పందనగా అలావుద్దీను ఆమె మీద దాడి చేశాడు. ఈ సంఘటన జలాలుద్దీనుకు నివేదించబడింది. కాని సుల్తాను అలావుద్దీను మీద ఎటువంటి చర్య తీసుకోలేదు.[5] అలావుద్దీనుకు తన అత్తగారితో మంచి సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆయన సుల్తాను మీద గొప్ప ప్రభావాన్ని చూపించాడు. 16 వ శతాబ్దపు చరిత్రకారుడు ఫిరిష్టా అభిప్రాయం ఆధారంగా దేశంలోని మారుమూల ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అలావుద్దీను యోచిస్తున్నట్లు ఆమె జలాలుద్దీనును హెచ్చరించింది. ఆమె అలావుద్దీనును నిశితంగా గమనించి తన కుమార్తె అలావుద్దిను పట్ల అహంకారంగా ప్రవర్తించడాన్ని ప్రోత్సహించింది. [7]
కారా రాజప్రతినిధి
మార్చు1291 లో కారా మాలికు చజ్జు రాజప్రతినిధి చేసిన తిరుగుబాటును అణిచివేసేందుకు అలావుద్దీను ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. పర్యవసానంగా జలాలుద్దీను ఆయనను 1291 లో కారా కొత్త రాజప్రతినిధిగా నియమించారు.[5] కారా వద్ద ఉన్న మాలికు చజ్జు మాజీ అమీర్సు(సామంత ప్రభువులు) జలాలుద్దీనును బలహీనమైన, పనికిరాని పాలకుడిగా భావించి ఢిల్లీ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అలావుద్దీనును ప్రేరేపించారు.[6]ఈ ప్రేరణకు ఆయన సంతోషరహితమైన గృహ జీవితప్రేరణ తోడుకావడంతో అలవుద్దీను జలాలుద్దీనును బహిష్కరించాలని నిశ్చయించుకున్నాడు. [4]
జలాలుద్దీనుకు వ్యతిరేకంగా కుట్ర
మార్చుజలాలుద్దీనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి అలావుద్దీనును ప్రేరేపిస్తూ, మాలికు చజ్జు మద్దతుదారులు పెద్ద సైన్యాన్ని అభివృద్ధిచేసి విజయవంతమైన తిరుగుబాటు చేయడానికి ఆయనకు చాలా డబ్బు అవసరమని నొక్కిచెప్పారు: వనరుల కొరత కారణంగా మాలికు చజ్జు తిరుగుబాటు విఫలమైంది.[6] జలాలుద్దీనును బహిష్కరించాలనే తన ప్రణాళికకు ఆర్థిక సహాయం చేయడానికి అలావుద్దీను పొరుగున ఉన్న హిందూ రాజ్యాల మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. 1293 లో ఆయన పరమారా రాజ్యంలోని మాల్వాలోని ఒక సంపన్న పట్టణం అయిన భిల్సా మీద దాడి చేశాడు. ఇది బహుళ దండయాత్రల ద్వారా బలహీనపడింది.[4] దక్కను ప్రాంతంలోని దక్షిణ యాదవ రాజ్యం అపారమైన సంపద గురించి అలాగే వారి రాజధాని దేవగిరికి వెళ్ళే మార్గాల గురించి భిల్సా వద్ద తెలుసుకున్నాడు. అందువలన యాదవ రాజ్యం మీద ముట్టడి చేసి రవాణాను నిలిపివేస్తూ, సుల్తాను విశ్వాసాన్ని పొందటానికి ఆయన భిల్సా నుండి దోపిడీ చేసిన సంపదను జలాలుద్దీనుకు అప్పగించాడు. [8] సంతోషించిన జలాలుద్దీను ఆయనకు అరిజు-ఐ మమాలికు (యుద్ధ మంత్రి) పదవిని ఇచ్చి ఆయనను అవధు గవర్నరుగా కూడా చేసాడు.[9] అదనంగా అదనపు దళాలను నియమించడానికి ఆదాయ మిగులును ఉపయోగించడానికి అల్లావుద్దీను చేసిన అభ్యర్థనను సుల్తాను మంజూరు చేశాడు.[10]
అనేక సంవత్సరాల ప్రణాళిక తరువాత, అలావుద్దీను 1296 లో దేవగిరి మీద విజయవంతంగా దాడి చేశాడు. ఆయన విలువైన లోహాలు, ఆభరణాలు, పట్టు ఉత్పత్తులు, ఏనుగులు, గుర్రాలు, బానిసలతో సహా భారీ మొత్తంలో సంపదతో దేవగిరిని విడిచిపెట్టాడు. [11] అలావుద్దీను విజయవార్త జలాలుద్దీనుకు చేరుకున్న తరువాత అలావుద్దీను అక్కడ దోపిడీని తనకు అందిస్తాడన్న ఆశతో సుల్తాను గ్వాలియరుకు వచ్చాడు. అయితే అలావుద్దీను మొత్తం సంపదతో నేరుగా కారాకు వెళ్ళాడు. అహ్మదు చాపు వంటి జలాలుద్దీను సలహాదారులు చందేరి వద్ద అలావుద్దీనును అడ్డగించాలని సిఫారసు చేసారు. కాని జలాలుద్దీను తన మేనల్లుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడు. అలౌద్దీను సంపదను కారా నుండి ఢిల్లీకి తీసుకువెళతారని నమ్ముతూ ఢిల్లీకి తిరిగి వచ్చాడు. కారాకు చేరుకున్న తరువాత అలావుద్దీను సుల్తానుకు క్షమాపణ లేఖ పంపాడు. తాను లేనప్పుడు తన శత్రువులు తనమీద సుల్తానుకు దుర్భోదచేసి మనస్సును విషపూరితం చేసి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సుల్తాను సంతకం చేసిన క్షమాపణ లేఖను అభ్యర్థించాడు. సుల్తాను వెంటనే దూతల ద్వారా పంపించాడు. కారా వద్ద జలాలుద్దీను దూతలు అలావుద్దీను సైనిక బలం సుల్తానును బహిష్కరించే ప్రణాళికల గురించి తెలుసుకున్నారు. అయినప్పటికీ అలావుద్దీను వారిని అదుపులోకి తీసుకున్నాడు. సుల్తానుతో కమ్యూనికేటు చేయకుండా నిరోధించాడు.[12]
ఇంతలో జలాలుద్దీను కుమార్తెతో వివాహం చేసుకున్న అలావుద్దీను తమ్ముడు అల్మాసు బేగు (తరువాత ఉలుగు ఖాను), అల్లావుద్దీను విధేయత గురించి సుల్తానుకు హామీ ఇచ్చాడు. సుల్తాను వ్యక్తిగతంగా క్షమించకపోతే అలావుద్దీను అపరాధభావంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని చెప్పి కరాను సందర్శించి అలావుద్దీననును కలవమని జలాలుద్దీనును ఒప్పించాడు. ఒక జలాలుద్దీను తన సైన్యంతో కారాకు బయలుదేరాడు. కారాకు చేరుకున్న తరువాత ఆయన తన ప్రధాన సైన్యాన్ని కారాకు భూమార్గం ద్వారా తీసుకెళ్లమని అహ్మదు చాపును ఆదేశించాడు. అదే సమయంలో ఆయన 1,000 మంది సైనికులతో కూడిన సైనికబృందంతో గంగా నదిని దాటాలని నిర్ణయించుకున్నాడు. 1296 జూలై 20 న అల్లాద్దీను సుల్తానును పలకరించినట్లు నటించి జలాలుద్దీనును చంపి తనను తాను కొత్త రాజుగా ప్రకటించుకున్నాడు. జలాలుద్దీను సహచరులు కూడా చంపబడ్డారు. అహ్మదు చాపు సైన్యం ఢిల్లీకి తిరిగి వెళ్ళింది.[13]
ఢిల్లీకి విజయయాత్ర
మార్చు1296 జూలైలో ఆరోహణ వరకు అలీ గుర్షాస్పు అని పిలువబడే అలావుద్దీను కారా వద్ద అలౌదున్యా వాడ్ దిను ముహమ్మదు షా-ఉసు సుల్తాను బిరుదుతో కొత్త రాజుగా అధికారికంగా ప్రకటించారు. ఇంతలో జలాలుద్దీను తలను అవధుకు పంపే ముందు తన శిబిరంలో ఈటె మీద నిలబెట్టి ప్రదర్శించాడు.[3] తరువాతి రెండు రోజులలో అలావుద్దీను కారా వద్ద తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఇప్పటికే ఉన్న అమీర్లకు మాలిక్సు హోదా మంజూరు చేసాడు. తన సన్నిహితులను కొత్త అమీర్లుగా నియమించాడు.[14]
ఆ సమయంలో భారీ వర్షాలు కురిశాయి. గంగా, యమునా నదులు నిండిపోయాయి. కానీ అలావుద్దీను ఢిల్లీకి విజయయాత్ర చేయడానికి సన్నాహాలు చేసాడు. ఫిట్నెసు పరీక్షలు లేదా నేపథ్య తనిఖీలు లేకుండా వీలైనంత ఎక్కువ మంది సైనికులను నియమించాలని తన అధికారులను ఆదేశించాడు.[14] తరువాత అల్లవుద్దీను తనకు భారీ ప్రజా మద్దతు ఉన్న వ్యక్తిగా చిత్రీకరించడం లక్ష్యంగా చేసుకుని కృషిచేసి సాధారణ రాజకీయ అభిప్రాయంలో మార్పు కలిగించడం కొరకు ప్రయత్నించాడు.[15] తనను ఉదారమైన రాజుగా చిత్రీకరించడానికి కారాలోని ఒక గుంపు వద్ద ఒక మంజానికు (కాటాపుల్టు) నుండి 5 మన్సు బంగారు ముక్కలను తయారుచేయమని ఆదేశించాడు.[14]
తన సైన్యంలో కొంతభాగానికి స్వయంగా నాయకత్వం వహిస్తూ నుస్రతు ఖానుతో కలిసి అల్లవుద్దీను సైన్యంలోని ఒక విభాగం బడాను, బరాను (ఆధునిక బులాందుషహరు) ద్వారా ఢిల్లీకి వెళ్ళాడు. జాఫరు ఖాను నేతృత్వంలోని ఇతర విభాగం కోయిలు (ఆధునిక అలీగఢ్) ద్వారా ఢిల్లీకి వెళ్ళింది.[14] అలావుద్దీను ఢిల్లీకి వెళుతుండగా, బంగారం పంపిణీ చేయడానికి సైనికులను నియమించుకుంటున్నట్లు పట్టణాలు, గ్రామాల్లో వార్తలు వ్యాపించాయి. సైనిక, సైనికేతర నేపథ్యాల నుండి చాలా మంది ఆయనతో చేరారు. ఆయన బడాను చేరుకునే సమయానికి ఆయనకు 56,000 మంది అశ్వికదళం, 60,000 మంది పదాతిదళం ఉన్నాయి. [14] బరాను వద్ద, అలావుద్దీనును ఇంతకుముందు వ్యతిరేకించిన ఏడుగురు శక్తివంతమైన జలాలుద్దీను ప్రభువులు చేరారు. ఈ ప్రభువులు తాజులు ముల్కు కుచి, మాలికు అబాజీ అఖురు-బెకు, మాలికు అమీరు అలీ దివానా, మాలికు ఉస్మాను అమీరు-అఖూరు, మాలికు అమీరు ఖాను, మాలికు ఉమరు సుర్ఖా, మాలికు హిరాన్మారు. అలావుద్దీను ప్రతి ఒక్కరికి 30 నుండి 50 మన్సు బంగారం వారి సైనికులకు ఒక్కొక్కరికి 300 వెండి ట్యాంకులు (నాణేలు) ఇచ్చారు. [15]
యమునా నది వరదలు రావడంతో అలావుద్దీను ఢిల్లీకి వెళ్ళాడు. ఇంతలో ఢిల్లీలో జలాలుద్దీను భార్య మల్కా-ఇ-జహాను ప్రభువులను సంప్రదించకుండా తన చిన్న కుమారుడు ఖాదరు ఖానును కొత్త రాజుగా రుక్నుద్దీను ఇబ్రహీం అనే బిరుదుతో నియమించింది. ఇది ఆమె పెద్ద కుమారుడు ముల్తాను రాజప్రతినిధి అర్కాలి ఖానుకు ఆగ్రహం తెప్పించింది. జలాలుద్దీను ప్రభువులు అలావుద్దీనుతో చేరారని మాలికా-ఇ-జహాను విని ఆమె అర్కాలికి క్షమాపణ చెప్పి ఆయనకు సింహాసనాన్ని ఇచ్చి ముల్తాను నుండి ఢిల్లీకి వెళ్ళమని కోరింది. అయినప్పటికీ అర్కాలి ఆమెకు సహకరించడానికి నిరాకరించింది.[15]
1296 అక్టోబరు రెండవ వారంలో యమునా నది తగ్గినప్పుడు అలావుద్దీన్ ఢిల్లీకి తన పాదయాత్రను తిరిగి ప్రారంభించాడు. ఆయన సిరికి చేరుకున్నప్పుడు, రుక్నుద్దీను ఆయన మీద సైన్యాన్ని నడిపించాడు. ఏదేమైనా రుక్నుద్దీను సైన్యంలోని ఒక విభాగం అర్ధరాత్రి అలావుద్దీనుతో చేరింది.[15] నిరాశకు గురైన రుక్నుద్దీను తన తల్లి, నమ్మకమైన ప్రభువులతో ముల్తానుకు పారిపోయాడు. అలావుద్దీను నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ అనేక మంది ప్రభువులు, అధికారులు ఆయన అధికారాన్ని అంగీకరించారు. 1296 అక్టోబరు 21 న అలావుద్దీను అధికారికంగా ఢిల్లీలో సుల్తానుగా ప్రకటించబడింది.[16]
పశ్చిమ భారతదేశ దండయాత్ర
మార్చుఅల్లావుద్దిన్ ఖిల్జీ గుజరాత్ మీద 1299 లో, 1304 లో దాడి చేసి దోచుకున్నాడు, రణథంబోర్ ను 1301లో, చిత్తూరు ను 1304లో, మల్వాను 1305 లో, శివాన ను 1308 లో, జలోర్ ను 1311 లో ఆక్రమించాడు.
దక్షిణ భారతదేశ దండయాత్ర
మార్చుఅల్లావుద్దిన్ దక్షిణ భారతదేశ దండయాత్ర ను మొదటగా యాదవుల మీద 1308లో మొదలుపెట్టి. వరంగల్లు మీద 1310 లో, ద్వారసముద్రం మీద 1311 లో, దాడి చేసి వారిని తన సామంతులుగా చేసుకుని వారి వద్ద నుండి కప్పాన్ని వసులు చేసాడు.
పరిపాలన
మార్చుఅల్లావుద్దిన్ ఖిల్జీ ఖాలీఫా ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. ఏ ముస్లిం అయిన సుల్తాన్ కావచ్చు. అతడే సర్వాధికారి. వీరి రాజ్యం సైనికబలం మీద ఆధారపడి వుండేది. అల్లావుద్దిన్ ఖిల్జీ జాగీర్దారి వ్యవస్త ను రద్దు చేసి, సిద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసాడు. అలాగే సైనికులకు జీతాలను ఇచ్చు పద్దతిని, పదవిని సూచించు పేర్లను పెట్టు పద్దతిని ప్రవేశపెట్టాడు.
ఆర్థిక వ్యవస్థ
మార్చుఅల్లావుద్దిన్ఖిల్జీ ధరలను అదుపులో వుంచి ప్రజల, సైనికుల ఇబ్బందులను తొలగించాడు. వర్తకులందరు తమ పేర్లను నమోదు చేసే పద్దతిని ప్రవేశపెట్టాడు. తూకాలను కూడా అదుపులో వుంచాడు.
ఇవి కూడ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Lafont, Jean-Marie & Rehana (2010). The French & Delhi : Agra, Aligarh, and Sardhana (1st ed.). New Delhi: India Research Press. p. 8. ISBN 9788183860918.
- ↑ Kishori Saran Lal 1950, pp. 40–41.
- ↑ 3.0 3.1 Banarsi Prasad Saksena 1992, p. 326.
- ↑ 4.0 4.1 4.2 Banarsi Prasad Saksena 1992, p. 321.
- ↑ 5.0 5.1 5.2 Kishori Saran Lal 1950, p. 41.
- ↑ 6.0 6.1 6.2 6.3 Kishori Saran Lal 1950, p. 42.
- ↑ Kishori Saran Lal 1950, p. 43.
- ↑ A. B. M. Habibullah 1992, p. 322.
- ↑ Kishori Saran Lal 1950, p. 45.
- ↑ Banarsi Prasad Saksena 1992, p. 322.
- ↑ Banarsi Prasad Saksena 1992, pp. 322–323.
- ↑ Banarsi Prasad Saksena 1992, p. 323.
- ↑ Banarsi Prasad Saksena 1992, p. 324.
- ↑ 14.0 14.1 14.2 14.3 14.4 Banarsi Prasad Saksena 1992, p. 327.
- ↑ 15.0 15.1 15.2 15.3 Banarsi Prasad Saksena 1992, p. 328.
- ↑ Banarsi Prasad Saksena 1992, p. 329.