అలెగ్జాండర్
క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.

అలెగ్జాండర్ (గ్రీకు Αλέξανδρος ο Μέγας, మెగాస్ అలెగ్జాండ్రోస్, జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323) గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు.

భారతదేశంపై దాడిసవరించు

 
గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు

క్రీ.పూ 326 వ సంవత్సరంలో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది. అతను సింధు నదీ పరీవాహక ప్రాంతాలని దాటి అక్కడ న్ని రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. అక్కడే ఉన్న తక్షశిల రాజైన అంభితో యుద్ధ సంధిని కుదుర్చుకుంటాడు. అయితే అంతకు నదు పర్షియన్లని, ఇతర గ్రీకు సామ్రాజయాలని అలవోకగా జయించిన అలెగ్జాండర్ సైన్యం భారత దేశంలో చాలా కస్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ఇక్కడి వాతావరణమే అతి పెద్ద శత్రువులా కనిపిస్తుంది. పైగా ఒక ఆదివాసి రాజ్యంపైన జరిపిన దాడిలో అలెగ్జాండర్ గాయపడతాడు. జీలం, చీనాబ్లి నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు పురుషోత్తముడితో యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం మరణిస్తుంది. తన తొలి దండయాత్ర నుండి అలెగ్జాండర్ ఆ గుర్రం పైనే ప్రయాణించాడు. పైగా ఆ యుద్ధంలో అతని సైన్యం చాల భాగం దెబ్బ తింటుంది. దాని తరువాత మిగిలిన ప్రాంతం అంతా అతి బలమైన నంద రాజ్యం ఆధీనంలో ఉండేది. నదుల సైనిక బలం గురించి విన్న అలెగ్జాండర్ సైన్యం భయంతో వణికి పోతుంది. ఆనాడు నందుల సైన్యంలో 2,00,000 పాద చారులు, 80,000 అశ్వ దళం, 6,000 గజ దళం, 8,000 రథాలు ఉండేవి. ఆ బలం గురించి విన్నాక అలెక్షన్దెర్ని సైన్యం యుద్ధాన్ని కొనసాగిన్చడానికి ససేమిరా అనడంతో అలెగ్జాండర్ అయిష్టంగానే భారత దేశం నుండి వెనుతిరుగుతాడు.

అనేక కథనాలుసవరించు

 
తిరిగి వెళ్ళిపోదామని అలెగ్జాండర్ ను అడుగుతున్న సైనికులు

లెజెండ్సవరించు

అలెగ్జాండర్ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి, చరిత్రకారుడైన కాలిస్థెనిస్ తన రచన సిలీషియాలో ఒక సముద్రం గురించి, అలెగ్జాండర్ గురించి వ్రాసాడు. (Plutarch, Alexander the great' 46.2)

బైబిలులో ప్రస్తావనసవరించు

డేనియల్ 8:5–8 మరీయు 21–22 లలో ఒక రాజు గురించి ప్రస్తావింపబడింది. ఈ రాజు మిడిస్, పర్షియాలను జయిస్తాడని, తరువాత అతడి సామ్రాజ్యం నాలుగు భాగాలుగా విభజింపబడుతుందని వ్యాఖ్యానింపబడింది. ప్రస్తావింపబడిన రాజు అలెగ్జాండరేనని కొందరు భావిస్తున్నారు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ పురుషోత్తముడిపై దండెత్తి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అలెగ్జాండర్. అయితే మరికొన్నాళ్ళ తర్వాత పురుషోత్తముడు మరణిస్తాడు. అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చేయాలని భావించి తిరిగి తన సైన్యాన్ని విరమించుకుని పురుషోత్తముని రాజ్యాన్ని అతని సోదరునికి అప్పగించి తిరిగి పయనిస్తాడు.

ఖురాన్ లో ప్రస్తావనసవరించు

ఖురాన్లో ఒక సత్ప్రవర్తన గల పాలకుడి దుల్-ఖర్నైన్ లేదా జుల్-ఖర్నైన్ గురించి ప్రస్తావింపబడింది. అరబ్, పర్షియన్ ప్రపంచంలో ఈ దుల్-ఖర్నైన్, అలెగ్జాండరేనని భావిస్తున్నారు. కానీ కొందరు ధార్మిక చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో విభేదించి, దుల్-ఖర్నైన్ రాజు పర్షియాకు చెందిన సైరస్ రాజు అని భావిస్తున్నాడు.

"షాహ్ నామా" లోసవరించు

ఫిరదౌసి రచించిన ప్రబంధకావ్యం, షాహ్‌నామా పర్షియన్ భాషా సాహిత్యం లోని ప్రాచీన గ్రంథాలలో ఒకటి.

ఇవీ చూడండిసవరించు

Alexander died in babilonia in 323 B.C. alexander was the great emperer

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

  [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
  [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
  [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
  [[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
  [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
  [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

ప్రాథమిక వనరులు