అలిక్ పదంసీ (5 మార్చి 1928[1] – 17 నవంబరు 2018)[2] పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త. 1982లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ‘గాంధీ’లో మహ్మదాలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలను అందుకున్నాడు. భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అగ్రశ్రేణి అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థగా తీర్చిదిద్దాడు.[3][4][5] తన అరవై ఏళ్ల కెరీర్‌లో 70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించిన నాటకాల్లో ఎవిటా, జీసస్‌ క్రైస్ట్‌ సూపర్‌స్టార్‌, తుగ్లక్‌ ఎంతో ప్రాచుర్యం పొందాయి.

అలిక్ పదంసీ
2012 లో పద్మశ్రీ
జననం(1928-03-05)1928 మార్చి 5
మరణం2018 నవంబరు 17(2018-11-17) (వయసు 90)
వృత్తిథియేటర్ ఆర్టిస్ట్ ,
యాడ్-ఫిల్మ్- రూపకర్త
జీవిత భాగస్వామిపెరల్ పదంసీ (విడాకులు) [ఆధారం చూపాలి]
డాలీ థాకూర్ (విడాకులు) [ఆధారం చూపాలి]
షారోన్ ఫ్రభాకర్ (విడిపోయారు) [ఆధారం చూపాలి]
పిల్లలురైల్ పదంసీ
ఖాసిర్ థాకూర్ పదంసీ
షాజహాన్ పదంసీ
బంధువులుఅక్బర్ పదంసీ (సోదరుడు)
రైసా పదంసీ

బాల్య జీవితం-విద్య

మార్చు

అలిక్ పదమ్‌సీ 1928లో గుజరాత్‌లోని సంపన్న, సాంప్రదాయక కుటుంబమైన ఖోజా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.[6] అతని వాస్తవ కుటుంబ నామం "చరన్యాస్". వారి పూర్వీకులు సంస్థానాలలో కవులుగా ఉండేవారు.[6][7] అతని తండ్రి జాఫెర్‌సేథ్ పదంసీ 10 స్వంత భవనాలు గల, గాజు, ఫర్నిచర్ వ్యాపారవేత్త. ఆమె తల్లి కుల్సుంబాయి పదంసీ గృహిణి. అతనికి ఏడుగురు సహోదరులున్నారు. వారిలో అక్బర్ పదంసీ చిత్రకారుడు. వారు సంపన్న కుటుంబానికి చెందినవారైనప్పటికీ విద్యావంతులు కాలేకపోయారు. అతను, అతని సోదరులు పాఠశాలలో మొదట చేరి ఆంగ్లం అభ్యసించారు.[8] అతను ముంబై లోని సెయింట్ జేవియర్ కళాశాలలో విద్యను అభ్యసించాడు. [9][10]

వ్యక్తిగత జీవితం

మార్చు

అతని మొదటి భార్య పెరల్ పదంసీ. వారికి రెల్ల్ పదంసీ అనే కుమార్తె కలిగింది. [11] పదంసీకి డాలీ ఠాకూర్ తో సంబంధం ఉండేది. ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు "ఖాసర్ థాకూర్ పదంసీ" కలిగాడు. తరువాత అతను షారోన్ ప్రభాకర్ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె "షాజహాన్ పదంసీ" ఉంది.

వ్యాపార రంగం

మార్చు

భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అగ్రశ్రేణి అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థగా తీర్చిదిద్దాడు. దాదాపు 100కు పైగా ప్రధాన ఉత్పత్తులు, బ్రాండ్లకు ఆయన వాణిజ్య ప్రకటనలు రూపొందించాడు. ఇదే సమయంలో అతను లింటాస్‌ దక్షిణాసియా ప్రాంతీయ కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ప్రపంచ అడ్వర్‌టైజింగ్‌ రంగంలో ఆస్కార్‌గా పరిగణించే ఇంటర్నేషనల్‌ క్లియో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు పదమ్‌సీ కావటం విశేషం. భారత అడ్వర్‌టైజ్‌మెంట్‌ పితామహుడిగా గుర్తింపు పొందిన ఈయన సాధారణ ఉత్పత్తుల నుంచి లగ్జరీ ఉత్పత్తుల వరకు అన్నీ వర్గాల వారి మదిని చూరగొనే విధంగా అద్భుతమైన, గుర్తుంచుకోదగిన వాక్యాలతో ప్రకటనలను రూపొందించాడు.[12]

అతని నేతృత్వంలోని లింటాస్‌ అడ్వర్‌టైజ్‌మెంట్‌ రూపొందించిన డిటర్జెంట్‌ ఉత్పత్తి అయిన సర్ఫ్‌ కోసం లలితాజీ, ఆటో దిగ్గజం బజాజ్‌ కోసం హమారా బజాజ్‌, చెర్రీ బ్లాసమ్‌ షూ పాలిష్‌ కోసం చెర్రీ చార్లీ, టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ కోసం మజిల్‌ మ్యాన్‌, జలపాతంలో లిరిల్‌ గర్ల్‌, ఫెయిర్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌, బోల్డ్‌ కామసూత్ర కపుల్‌ వంటి ప్రకటనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1994లో లింటాస్‌ ఇండియా నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఏపీ అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించి పలు వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు. బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ స్కూటర్‌ కోసం పదమ్‌సీ రూపొందించిన వాణిజ్య ప్రకటన హమారా బజాజ్‌. చాలా ఏళ్ల పాటు ప్రజల నోళ్లలో పలికింది. ఇప్పటికీ పాత తరం వారు ఆ ప్రకటనను ఇప్పటికీ మరిచిపోలేరు. అంతేకాకుండా బజాజ్‌ ఆటోను అగ్రస్థానానికి చేర్చటంలో ఆ ప్రకటన కీలక పాత్ర పోషించింది.

పురస్కారాలు

మార్చు
  • 2002 లో పద్మశ్రీ పురస్కారం. [13]
  • ముంబై అడ్వర్‌టైజ్‌మెంట్‌ క్లబ్‌..అడ్వర్‌టైజింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సెంచరీతో గౌరవించింది.
  • 2012లో సంగీత నాటక్‌ అకాడమీ నుంచి 2012లో ఠాగూర్‌ రత్న అవార్డు.

మూలాలు

మార్చు
  1. [1]
  2. "Alyque Padamsee - ad guru, theatre personality, actor and philanthropist, passes away at 90". Times Now News. 17 November 2018. Retrieved 17 November 2018.
  3. Singh, Sangeetha (9 November 2002). "The Alyque Padamsee brand of life". Times of India. Retrieved 9 February 2010.
  4. Roy Mitra, Indrani (4 October 2006). "'A great ad is an ad that generates great sales'". Rediff. Archived from the original on 22 January 2010. Retrieved 9 February 2010.
  5. SenGupta, Anuradha (3 August 2008). "Being Alyque Padamsee: India's dream merchant". CNN-IBN. Archived from the original on 4 డిసెంబరు 2008. Retrieved 19 నవంబరు 2018.
  6. 6.0 6.1 "Akbar Padamsee Biography". www.akbarpadamsee.net. Retrieved 1 July 2016.
  7. "The last great moderns: Akbar Padamsee". Mint. 13 January 2012.
  8. "The Alyque Padamsee brand of life". The Times of India. Retrieved 23 January 2015. I was born into riches: Ours was a Kutchi business family. My father, Jafferseth, owned 10 buildings and also ran a glassware and furniture business. My mother, Kulsumbai Padamsee, was a housewife. Anything I wanted was there for the asking. We were eight children in all but I, being born after three daughters, was pampered most. Among Gujarati families, it was only the Padamsees and the royal house of Rajpipla. At school, I learnt to speak in English. Later, our parents learnt the language from us. All that I am today is because of what I learnt at school. Miss Murphy, who ran the school, was an inspirational figure for me.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-25. Retrieved 2018-11-19.
  10. https://www.youtube.com/watch?v=GkdpIMfEZS0&feature=youtu.be&t=42m58s
  11. "Pathbreakers: Rael Padamsee". Hindustan Times. 8 March 2006. Archived from the original on 19 ఆగస్టు 2007. Retrieved 19 నవంబరు 2018.
  12. "భారత అడ్వర్‌టైజ్‌మెంట్‌ పితామహుడికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం".[permanent dead link]
  13. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 19 నవంబరు 2018.

ఇతర లంకెలు

మార్చు