అలీజే అగ్నిహోత్రి
అలీజే అగ్నిహోత్రి (జననం 2000 సెప్టెంబరు 21) హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఖాన్ కుటుంబంలో జన్మించిన ఆమె నటుడు అతుల్ అగ్నిహోత్రి, నిర్మాత అల్విరా ఖాన్ అగ్నిహోత్రి దంపతుల కుమార్తె. ఆమె తన తండ్రి దర్శకత్వం వహించిన హలో (2008) చిత్రంలో చిన్నతనంలోనే నటించింది.[1] ఆ తరువాత, ఆమె 2023 చిత్రం ఫర్రే లో ప్రధాన పాత్ర పోషించింది, దీనికి ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది.[2]
అలీజే అగ్నిహోత్రి | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 2000 సెప్టెంబరు 21
వృత్తి | నటి |
తల్లిదండ్రులు |
|
ప్రారంభ జీవితం
మార్చుఅలీజే అగ్నిహోత్రి 2000 సెప్టెంబరు 21న ముంబైలో నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన అతుల్ అగ్నిహోత్రి, అల్విరా ఖాన్ లకు జన్మించింది.[1] ఆమె వీరికి చిన్న సంతానం. కాగా ఆమెకు అయాన్ అగ్నిహోత్రి అనే అన్నయ్య ఉన్నాడు.[3]
కెరీర్
మార్చుతన తండ్రి అతుల్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన హలో చిత్రంలో చిన్నతనంలోనే నటించడం ప్రారంభించింది. 2023లో, ఆమె ఫర్రే చిత్రంతో ప్రదాన పాత్రలో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఇది 2023 నవంబరు 24న థియేటర్లలో విడుదలైంది.[4][5] ఈ చిత్రంలో ఆమె నటనకు గాను, ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిల్మ్ఫేర్ అవార్డు సహా వివిధ ప్రశంసలు అందుకుంది.
మీడియా
మార్చు2024లో, అలీజేను జిక్యూ "35 అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల" జాబితాలో చేర్చారు.[6] 2024లో, ఆమె హలో! తో సహా వివిధ మ్యాగజైన్ కవర్లలో కనిపించింది.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమా
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
2008 | హలో | బాలనటి | [7] | |
2023 | ఫర్రే | నియతి సింగ్ | [8] |
పురస్కారాలు
మార్చుసంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|
2024 | 69వ ఫిల్మ్ఫేర్ అవార్డులు | ఉత్తమ మహిళా తొలి ప్రదర్శన | ఫర్రే | విజేత | [9] |
జీ సినీ అవార్డ్స్ | ఉత్తమ మహిళా తొలి ప్రదర్శన | విజేత | [10] | ||
పింక్విల్ల స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ | ఉత్తమ మహిళా తొలి ప్రదర్శన | విజేత | [11] | ||
న్యూస్ 18 రీల్ అవార్డ్స్ | ఉత్తమ అరంగేట్రం - నటి | విజేత | [12] | ||
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | [13] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Alizeh Agnihotri Biography: Know Everything About The Farrey Star and Salman Khan's Niece, Family, and More". jagrantv (in ఇంగ్లీష్). 23 November 2023. Retrieved 5 February 2024.
- ↑ "Top 10 69th Filmfare Awards 2024 Winners". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 5 February 2024.
- ↑ "Meet Alizeh Agnihotri: Know everything about her lifestyle, relationship with Salman Khan, family, Bollywood debut, and more". Financialexpress (in ఇంగ్లీష్). 5 December 2023. Retrieved 5 February 2024.
- ↑ Sahani, Alaka (24 November 2023). "Farrey movie review: Alizeh Agnihotri leads a near-perfect cast in this teenage drama that scores high". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2023. Retrieved 24 November 2023.
- ↑ Pathak, Prannay (24 November 2023). "Farrey review: Alizeh Agnihotri's debut is an exam hall heist that scores a distinction". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2023. Retrieved 24 November 2023.
- ↑ "Meet GQ's Most Influential Young Indians of 2024". GQ India. 25 April 2024. Retrieved 27 April 2024.
- ↑ "Exclusive: It's a very exciting time as an actor, says Alizeh". filmfare.com (in ఇంగ్లీష్). Filmfare. Retrieved 5 February 2024.
- ↑ "'Farrey' Actress Alizeh Agnihotri Says, 'I Want To Do A Film That I Enjoy'". news.abplive.com (in ఇంగ్లీష్). ABP Live. 12 December 2023. Retrieved 5 February 2024.
- ↑ "69th Filmfare Awards 2024 Winners - Complete List Out!". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 5 February 2024.
- ↑ "2024 – Zee Cine Awards" (in ఇంగ్లీష్). Retrieved 16 July 2024.
- ↑ "Pinkvilla Screen & Style Icons Awards: Complete list of winners ft. Kiara Advani, Akshay Kumar, Karan Johar and more". Pinkvilla. 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ Sharma, Dishya (10 March 2024). "News18 Showsha Reel Awards 2024 Winners: Animal Wins Best Film; Varun Dhawan, Shraddha Kapoor Best Actors". CNN-News18. Retrieved 10 March 2024.
- ↑ "'Laapataa Ladies', 'Rocky Aur Rani Kii Prem Kahaani' lead in nominations for IFFM 2024". CNBC TV18. 10 July 2024. Retrieved 10 July 2024.
{{cite news}}
: CS1 maint: url-status (link)