అలెగ్జాండర్ పార్క్స్

అలెగ్జాండ పార్క్స్ (29 డిసెంబరు 1813 – 1890 జూన్ 29) రసాయనశాస్త్రవేత్త. ఆయన పార్కెసిన్ అనే మొదటి ప్లాస్టిక్ ను సృష్టించాడు. ప్లాస్టిక్ యొక్క ఆవిష్కరణతో మన నిత్య జీవితంలో గణనీయమైన మార్పును తెచ్చిన ఘనత ఆధునిక విజ్ఞానశాస్త్రానికే చెందుతుంది. ఈ కృత్రిమ పదార్థాన్ని మొదటి సారిగా 1962 లో లండన్ లో ఆయన ఉత్పత్తి చేసాడు.

అలెగ్జాండర్ పార్క్స్
అలెగ్జాండర్ పార్క్స్
జననం29 డిసెంబరు 1813
సఫోల్క్ వీధి, బిర్మిఘాం, ఇంగ్లాండు
మరణం29 జూన్, 1890
జాతీయతఇంగ్లీషు
Engineering career
Significant projectsపార్కెసిన్

జీవిత విశేషాలు మార్చు

ఆయన తండ్రి ఇత్తడి తాళాలు తయారు చేసేవారు. ఆయన ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియకు పేటెంటు హక్కు పొందిన జార్జి, ఎల్కింగ్ టన్ వద్ద పనిచేసారు. అంతకు ముందు ఆయన బిర్మిన్‌గ్రాంలో "మెసెంజర్ అండ్ సన్స్, బ్రాస్ వ్యవస్థాపకులు" అనే సంస్థ వద్ద శిక్షణ పొందారు.[1] ఆయన లోహాలను పోత పోసే విభాగంలో సహాయకారిగా నియమిపబడ్డాడు. అక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టాడు. ఆయన కళారూపాలపై ఎలక్ట్రోప్లేటింగ్ విధానం ద్వారా వివిధ లోహాలను పూత పూసే విధానం గూర్చి 1841లో మొదటి పేటెంటు హక్కును పొందాడు. ఆయన పువ్వుల వంటి చక్కని, సున్నితమైన వస్తువులపై ఎలెక్ట్రోప్లేటింగ్ విధానం ఉపయోగించుటకు 1943లో పేటెంటు హక్కును పొందాడు. ఆ పేటెంటు హక్కు వివిధ వస్తువులను పాస్పరస్ (భాస్వరం) తో కూడిన కార్బన్ యొక్క బైసల్ఫైడ్ ద్రావణంలో ముందుగా ముంచి తరువాత సిల్వర్ నైట్రేట్ లో వస్తువును ముంచాలనే విధానానికి యివ్వబడింది. ఆయన చేసిన సాలెగూడు పై వెండి పూతను పూసే విధానం 1944లో ప్రిన్స్ ఆల్బర్ట్ ఇంగ్లాండు లోని ఎల్కిన్‌టన్ సందర్శించినపుడు ఆయన వద్ద ప్రదర్శింపబడింది. మొత్తంమీద ఆయన ఎలక్ట్రోప్లేటింగ్ విధానం, ప్లాస్టిక్ అభివృద్ధి లకు సంబంధించి 66 పేటెంటులు పొందడం జరిగింది.

  • 1846లో రబ్బరు వల్కలీకరణంలో శీతలీకరణ ప్రక్రియ గూర్చి పేటెంటును పొందారు. దానిని థామస్ హాన్‌కాక్ అంటారు. ఇది ఆ సమయంలో అతి విలువైన గొప్పదైన ఆవిష్కరణ.[2]
  • ఆయన లోహాలు, మిశ్రమ లోహాలలో అతి కొద్ది పరిమాణంలో భాస్వరాన్ని కలుపుటలో గుర్తింపు పొందాడు. అది "ఫాస్పర్-బ్రాంజ్ " అనే పదార్థ అభివృద్ధికి దోహదపడింది.[3]
  • 1850లో ఆయన పార్క్స్ విధానం అభివృద్ధి చేసాడు. ఈ విధానంలో పారిశ్రామికంగా లెడ్ (సీసం) పై వెండి తొలగించు ప్రక్రియను అభివృద్ధి చేసాడు. ఆయన ఈ శుద్ధి ప్రక్రియకు కూడా 1851, 1852 లలో పేటెంటు హక్కులు పొందాడు.[4]
  • 1856లో పార్కెసిన్ అనే మొట్టమొదటి కృత్రిక ప్లాస్టిక్ ను సృష్టించాడు. ఇది మొదటి ధర్మో ప్లాస్టిక్ - దీనికోసం ఆయన సల్ఫ్యూరికామ్లంలో నానబెట్టిన దూదిని నత్రికామ్లంతో వేడిచేసాడు. ఆ దూదికి కృదుత్వాన్ని, స్థితిస్థాపకతను కలిగించడానికి నూనెను, కర్పూరాన్ని ఉపయోగించాడు. చివరి ఉత్పత్తిగా ఏనుగు దంతాల రంగుతో పదార్థం ఏర్పడినది. ఈ పదార్థాన్ని వేడిచేస్తే దాని ఆకారం మారుతుంది. ఆ పదార్థాన్ని పార్కెసిన్ అని పేరు పెట్టాడు.[5] ఈ పదార్థం 1862 లో లండన్ అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రదర్శించబడింది. ఈ ఆవిష్కరణ ద్వరా ఆధునిక వస్తువులన్నింటికీ ప్లాస్టిక్ మూలాధారమైనది.
  • 1866లో లండన్ లోని హాకెనీ విక్ వద్ద అతి తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ ఉత్పత్తి చేయుటకు పార్కెసిన్ కంపెనీ స్థాపించాడు. కానీ వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయాడు. ఆ వ్యాపారం 1868 లో ముగిసింది.

వ్యక్తిగత వివరాలు మార్చు

అలెగ్కాండర్ పార్క్స్ బిర్మిన్‌ఘాం లోని సఫోక్ వీధిలో జేమ్స్ పార్క్స్, కెరెన్ హపుచ్ చైల్డ్స్ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మిచాడు. పార్క్స్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం జానే హెన్షల్ మూరెతో జరిగింది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు "హోవార్డ్ పార్క్స్" అతని మునిమనుమడు. తరువాత ఆయన రెండవ వివాహం అన్న్ రోడెరిక్ తో జరిగింది. వారికి నలుగురు కుమారులు, ఎనిమిదిమందికుమార్తెలూ కలిగారు.

గుర్తింపు మార్చు

 
Blue[permanent dead link] plaque on the old Birmingham Science Museum.

పార్క్స్ కు అనేక గౌరవాలు లభించాయి. డల్‌విచ్ లోని ఆయన ఇంటిపై 2002లో ప్లాస్టిక్ హిస్టోరికల్ సొసైటీ "నీలం ప్లాస్టిక్ ఫలకం"ను ఉంచింది. 2004 లో బిర్మిన్‌గాం సివిక్ సొసైటీ వారు నీలం ఫలకాన్ని జ్ఞాపకార్థం బిర్మిన్‌గాం లోని న్యూషాల్ వీధిలో గల ఎల్కింగ్‌టన్ సిల్వర్ ప్లేటింగ్ వర్క్స్ వద్ద ఉందింది.[6] పార్కెసిన్ వర్క్స్ యొక్క గోదపై ఆయన జ్ఞాపకార్థం ఫలకాన్ని ఉంచారు.[7] 2005 సెప్టెంబరులో అమెరికన్ ప్లాస్టిక్స్ అకాడమీస్ హాల్ ఆఫ్ పేంలో మరణానంతరం చేర్చారు.[8] ఆయనను లండన్ లోని వెస్ట్ నార్వుడ్ సెమటెరీ వద్ద ఖననం చేసారు. 1970లలో ఆయన స్మారకాన్ని తొలగించారు.

మూలాలు మార్చు

  1. Anon, A Short Memoir of Alexander Parkes (1813-90), Chemist and Inventor, Printed for Private Circulation, n.d. about 1890; John Naish Goldsmith, Alexander Parkes, Parkesine, Xylonite and Celluloid, 1934; M. Kaufman, The First Century of Plastics, 1963.
  2. M.Kaufman, Op. Cit., p. 17
  3. Obituary in Iron, pp. 73-4, 25 July 1890.
  4. "Parkes process (chemistry)". Britannica Online Encyclopedia. Britannica Online Encyclopedia. Retrieved 2009-08-20.
  5. UK Patent office (1857). Patents for inventions. UK Patent office. p. 255.
  6. "Blue Plaques". UK: The Birmingham Civic Society. Archived from the original on 29 సెప్టెంబరు 2011. Retrieved 17 జనవరి 2018.
  7. "First plastic in the world". UK: London Borough of Hackney. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 28 April 2014.
  8. "Alexander Parkes". USA: Plastics Hall of Fame. Archived from the original on 29 ఏప్రిల్ 2014. Retrieved 17 జనవరి 2018.

ఇతర లింకులు మార్చు