అల్లం పెసరట్టు
ముఖ్హ్యంగా ఆంధ్ర ప్రాంతంలొ అల్లం పెసరట్టు చాలా ఇష్టమైన అల్పాహారం. దీనిని పెసలు లెదా పొట్టు పెసర పప్పుతొ తయారు ఛేస్తారు.
పెసరట్లలో రకాలు
మార్చుపెసరట్లలో ప్లెయిన్ (సాదా) పెసరట్టు, ఉప్మా పెసరట్టు, ఉల్లి పెసరట్టు, అల్లం పెసరట్టు, క్యారెట్ పెసరట్టు ముఖ్యమైనవి.
ప్లెయిన్ (సాదా) పెసరట్టు
మార్చుపెసరప్పు సుమారు ఒక గంటసేపు నానబెట్టి, ఆ తర్వాత చక్కగా రుబ్బురోలు - లేదా - మిక్సీ - లేదా - గ్రైండరులో రుబ్బుకుని పెనం మీద పల్చని అట్టుగా వేస్తే అది సాదా (ప్లెయిన్) పెసరట్టు.
ఉప్మా పెసరట్టు
మార్చుసాదా (ప్లెయిన్) పెసరట్టుపై అంతకు ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న ఉప్మాను తగినంత మొత్తంగా వేసుకుంటే అది ఉప్మా పెసరట్టు.
ఉల్లి పెసరట్టు
మార్చుసాదా (ప్లెయిన్) పెసరట్టు పెనంపై కాలుతున్న సమయంలోనే ఆ పెసరట్టుపై అంతకు ముందుగానే తరిగి సిద్ధంగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తగినంత మొత్తంగా వేసుకుంటే అది ఉల్లి పెసరట్టు.
అల్లం పెసరట్టు
మార్చుసాదా (ప్లెయిన్) పెసరట్టు పెనంపై కాలుతున్న సమయంలోనే ఆ పెసరట్టుపై అంతకు ముందుగానే తరిగి సిద్ధంగా ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి ముక్కల్ని తగినంత మొత్తంగా వేసుకుంటే అది అల్లం పెసరట్టు.
క్యారెట్ పెసరట్టు
మార్చుసాదా (ప్లెయిన్) పెసరట్టుపై ఉప్మా, ఉల్లి, అల్లం పచ్చిమిర్చిలకు బదులుగా క్యారెట్ తురిమిని తగినంత మొత్తంగా వేసుకుంటే అది క్యారెట్ పెసరట్టు.
కావలసిన వస్తువులు
మార్చు- పెసర పప్పు - పావు కెజి
- పచ్చి మిరప కాయలు - 10
- అల్లం - తగినంత
- జీలకర్ర - తగినంత
- నూనె - తగినంత
తయారు చేసే విధానం
మార్చు- ముందుగా పెసరపప్పు, పచ్చి మిరప కాయలు మిక్సీలో వేసి మెత్తగా తయారు చేసుకోవాలి.
- ఆ తరువాత పిండిలో అల్లం ముక్కలు, జీలకర్ర వేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఆ తరువాత పొయ్యి వెలిగించుకుని, దానిపై పెనంపెట్టి వేడి చేయవలెను.
- ఆ పెనం మీద కొద్దిగా నూనె రాసి, సిద్ధంగా ఉంచుకున్న పెసర పిండిని గరిటతో పలుచని అట్టుగా వేయవలెను.
- అట్టు దోరగా వేగిన తరువాత మీకు నచ్చిన చెట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.