ఉప్మా
ఉప్మా తక్కువ సమయంలో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారము[1]. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో, అటుకులతో, సేమ్యాతో లేదా గోధుమ నూకతో చేసుకోవచ్చును. ఉప్పు, మావు ( రవ్వ) అను రెండు తమిళ పదాల నుంచి దీని పేరు ఉప్మావు అని వచ్చింది. దీనిని తెలుగులో ఉప్మా అని ఉప్పిండి అని కూడా పిలుస్తారు[2].
![]() ఉప్మా | |
ఇతర పేర్లు | ఉప్పుమ, ఉప్పిట్టు, ఉప్పుమావు, ఉప్పిండి, ఖరబాత్, ఉపీట్, రులనావ్ |
---|---|
Course | అల్పాహారం |
మూల స్థానం | భారతదేశం |
ప్రధాన అనుఘటకాలు | గోధుమ రవ్వ |
కావలసిన పదార్ధాలు
మార్చుపుట్టు పూర్వోత్తరాలు
మార్చుఇంతకు పూర్వం మనవాళ్ళు ఉప్పిండి అనేమాట వాడేవాళ్ళు. ఉప్పుపిండి అన్నమాట. చక్కెర పిండిని ఉక్కెర అంటారు. బెల్లపు పిండిని ఆవిరికి ఉడకపెడితే దాన్ని పిట్టు అంటాము. పిండివంటి సన్నటి నూక (రవ్వ) తో తిరుగుబోతసామాను వగైరావేసి ఉడకబెట్టి చేసినదే ఉప్పిపిండి. ఇందులో తీపు ప్రధానం గాక ఉప్పు ప్రధానం. ఉప్పు పొంగలి, చక్కెర పొంగలి వేరే వెరేగా ఉన్నవి గదా! అట్లనే. అరవంలో ఉర్పు, ఉప్పు రెండు రూపాలలో వాడుకలో ఉన్నాయి. పిండిని వాళ్ళు మావు అంటారు. ఉప్పుపిండి వాడుక తప్పి కాల క్రమాన ఉప్పుమావు వాడుకలోకి పడింది. అదే ఉప్మావు. పల్లెటూరి వాళ్ళు ఉప్మావు అని మొదట్లో వాడేవారు. అదే ఇప్పుడు ఫ్యాషన్ గా ఇంగ్లీషు స్టయిలు సంతరించుకొని ఉప్మా అయి కూర్చొంది.
తయారుచేయు విధానం
మార్చు- బూరెల మూకుడు పొయ్యి మీద పెట్టి, నెయ్యివేసి, జీడిపప్పు దోరగా వేయించి తీసివేయాలి. ఆ నెయ్యిలోనే గోధుమనూక ఒక కప్పువేసి, వేయించిన తరువాత దానిని వేరు పళ్ళెంలోకి తీసుకోవాలి.
- బూరెల మూకుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి, పోపుకి తగిన నెయ్యివేసి మరిగాక ఆవాలు, మినప పప్పు వేసి, ఆవాలు చిటపటలాడాక జీలకర్రవేసి ఆ పైన తరిగి ఉంచుకున్న అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి - పోపు కమ్మని వాసన వచ్చిన తరువాత రెండు కప్పుల నీరుపోసి, తగినంత ఉప్పువేయలి.
- నీరు మరిగిన తరువాత వేయించిన గోధుమ నూకవేసి కలియబెట్టాలి. మూతపెట్టి అయిదు నిమిషాలు ఉంచాలి.
- రవ్వ మెత్తబడిన తర్వాత కిందకి దించి, వేయించిన జీడిపప్పు ఒక చెక్క నిమ్మకాయ రసం పిండి బాగా కలియబెట్టి వేరే పళ్ళెం లోకి దిమ్మరించుకోవాలి.
ఉప్మాలో రకాలు
మార్చు- టొమాటో ఉప్మా:
- సేమ్యా ఉప్మా:
- అటుకుల ఉప్మా:
- మజ్జిగ ఉప్మా:
- బొరుగుల ఉప్మా:
- సగ్గుబియ్యము ఉప్మా:
- పులుసు ఉప్మా:
- పెసరపప్పు ఉప్మా:
చిట్కాలు
మార్చు- ఉప్మాలో నెయ్యి ఎక్కువ వెయ్యకపోతే ముద్దలాగా అంటుకుంటుంది.
- ఉప్మా ఉండలు ఉండలుగా తయారుకాకుండా, నూకను నీటిలో వేసేముందు వేపుకోవాలి.
- ఉప్మాలో ఎవరికి ఇష్టమైన మసాలా దినుసులు వేపుకొని ఉడుకుతున్న నీటిలో వేసుకోవచ్చును
చిత్రమాలిక
మార్చు-
గోధుమరవ్వ ఉప్మా
-
బొంబాయి రవ్వ ఉప్మా
-
గోధుమ రవ్వ ఉప్మా
-
టమాట బాత్
-
టమాట బాత్
మూలాలు
మార్చు- ↑ "Poha or upma? Shabana Azmi and Twitter divided over breakfast dish". Hindustan Times. 9 October 2017. Archived from the original on 27 January 2018. Retrieved 27 January 2018.
- ↑ Pandya, M. (1985). Indian Vegetarian Cooking. Inner Traditions/Bear. p. 164. ISBN 978-0-89281-342-1. Archived from the original on 15 August 2023. Retrieved 26 January 2018.