అవంతిక దాసాని (జననం 1995 జనవరి 24) భారతీయ నటి. జూన్ 2023లో వచ్చిన నేను స్టూడెంట్ సర్ చిత్రంతో తెలుగులో ఆమె అరంగేట్రం చేసింది.[1] ఆమె సీనియర్ నటి భాగ్యశ్రీ కుమార్తె. అలాగే హిందీ సినిమా నటుడు అభిమన్యు దాసానికి సోదరి.

అవంతిక దాసాని
జననం (1995-01-24) 1995 జనవరి 24 (వయసు 29)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతఇండియన్
విద్యాసంస్థకాస్ బిజినెస్ స్కూల్, లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
తల్లిదండ్రులు
బంధువులుఅభిమన్యు దాసాని (సోదరుడు)

కెరీర్

మార్చు

మిథ్య అనే జీ5 హిందీ-భాష, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ తో ఆమె కెరీర్ మొదలుపెట్టింది.[2] దీనిని రోహన్ సిప్పీ దర్శకత్వం వహించగా అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రోజ్ ఆడియో విజువల్ ప్రొడక్షన్ నిర్మించారు.[3]

ఇక తెలుగులో బెల్లంకొండ గణేశ్ సరసన యాక్షన్‌ థ్రిల్లర్‌ నేను స్టూడెంట్ సర్ (2023) చిత్రంలో నటించింది. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సతీష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్‌ సర్‌ | nenu student sir movie review in telugu". web.archive.org. 2023-06-06. Archived from the original on 2023-06-06. Retrieved 2023-06-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Dixit, Saumya (2022-02-01). "Huma Qureshi calls herself 'muhfat' as she talks about her character in Mithya". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2022-02-21.
  3. "'Mithya' trailer out: Avantika Dassani-Huma Qureshi promise chilling dark drama". Dnaindia.com. 2 Feb 2022. Retrieved 11 Feb 2022.
  4. Namasthe Telangana (13 November 2022). "ఐఫోన్‌ ఎవరు దొంగిలించారు?". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.