అవధాన సరస్వతీ పీఠం

అవధాన సరస్వతి పీఠం 1996 లో డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ స్థాపించిన సామాజిక సంస్థ. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న ఈ పీఠం, సనాతన ధర్మ విలువలకు సంప్రదాయాలకూ సాంస్కృతిక కేంద్రం. అతడు అందించే ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రత్యేకమైన సంరక్షణనూ అనుభవించడానికి ప్రజలు సంవత్సరమంతా పీఠాన్ని సందర్శిస్తూంటారు.[1]

మాడుగుల నాగఫణిశర్మ

ప్రత్యేకత మార్చు

ప్రధానంగా అవధాన కళను, భారతీయ సంస్కృతిపై పరిజ్ఞానాన్ని, వేద సంప్రదాయాలు, జ్ఞాపకశక్తినీ సమాజంలోని బలహీన వర్గాలకు అందచేయాలనే ఉద్దేశంతో ఈ పీఠాన్ని స్థాపించారు. ఈ పీఠం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులకు ఆధ్యాత్మిక గమ్యం.[2]

సరస్వతీ ఆలయం మార్చు

పీఠం ఆవరణలో సరస్వతీ దేవత ఆలయం ఉంది. తెలంగాణలో దేవతకు ఉన్న ప్రత్యేక దేవాలయాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం, పెద్ద సంఖ్యలో భక్తులు నవరాత్రి సమయంలో మూలా నక్షత్రం, గురు పంచం బీజక్షర లేఖనం కోసంశ్రీ పంచమి సందర్భంగా పీఠం సందర్శిస్తారు, దేవత ఆశీర్వాదం కోరుకుంటారు.

పీఠం ఆవరణలో ఉన్న సౌకర్యాలు, జరిగే కార్యక్రమాలు మార్చు

గోశాల మార్చు

ఆరోగ్య సంరక్షణ, సేంద్రీయ వ్యవసాయ ప్రయత్నాల కోసం, ఆవు ఉత్పత్తులపై (గోమూత్రం, గోక్షీరం, ఆయుర్వేద మందులు మొదలైనవి) శాస్త్రీయ పరిశోధనల కోసమూ పీఠం, 70 ఆవులకు ఆశ్రయం కల్పిస్తోంది.

సభా ప్రాంగణం మార్చు

కార్యక్రమాలు, అవధానాలు, ప్రవచనాలు, ఇతర వేడుకలకు 3,000+ అతిథులు కూర్చునే ఒక రకమైన విస్తారమైన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉంది.

శ్రీ పంచమి మహోత్సవం మార్చు

మాఘమాసంలో వచ్చే పవిత్ర శ్రీ పంచమి సందర్భంగా, నాగఫణి శర్మ స్వయంగా అక్షరాభ్యాసాలు, బీజాక్షర లేఖనాలూ నిర్వహిస్తాడు.

నవరాత్రి ఉత్సవాలు మార్చు

నవరాత్రుల సందర్భంగా 10 రోజుల పండుగ వేడుకలు ప్రపంచం నలుమూలల నుండి రోజువారీ భక్తులకు రోజూ వారి అలంకారం, ప్రవచనాలు ఆకర్షిస్తున్నాయి

మూలా నక్షత్రం మార్చు

పీఠం వద్ద నవరాత్రి సందర్భంగా శుభ మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక వేడుకలు అక్షరభ్యాసాలతో, నాగఫణిశర్మ స్వయంగా బీజాక్షర లేఖనం చేయిస్తాడు.

మూలాలు మార్చు

  1. "అవధాన సరస్వతీ పీఠం హోంపేజి". అవధాన సరస్వతీ పీఠం. Archived from the original on 2021-05-07.
  2. "మాడుగుల నాగఫణి శర్మ". Tewiki.{{cite web}}: CS1 maint: url-status (link)