ఒకప్పుడు చాలా పెద్ద రాజ్యం విడిపోవడం వలన గాని, ఆక్రమణ, విలీనం, వలసముగింపు మొదలైన వాటి వలన గానీ, తిరుగుబాటు లేదా విప్లవం వలన దాని భూభాగంలో కొంత కోల్పోవడం వలన గానీ, కొంత రాజ్య భాగాన్ని కోల్పోగా మొగిలిన భూభాగాన్ని అవశిష్ట రాజ్యం అంటారు. దీన్ని ఇంగ్లీషులో అవశిష్ట రాజ్యం అంటారు. తరువాతి సందర్భంలో, ప్రభుత్వం తన పూర్వ భూభాగంలో కొంత భాగాన్ని నియంత్రిస్తుంది కాబట్టి ప్రవాసానికి వెళ్లడం మానేస్తుంది.

కింగ్డమ్ ఆఫ్ సోయిసన్స్, రోమన్ అవశిష్ట రాజ్యం.

ఉదాహరణలు

మార్చు

పురాతన చరిత్ర

మార్చు
  • సెల్యూసిడ్ సామ్రాజ్యం: తన రాజ్యంలో చాలా భాగాన్ని పార్థియన్ సామ్రాజ్యం ఆక్రమించుకున్న తరువాత. [1]
  • గాల్‌లో పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనం తరువాత, సోయిసన్స్ రాజ్యం అవశిష్ట రాజ్యంగా మారిపోయింది [2]

క్లాసికల నంతర చరిత్ర

మార్చు
  • రమ్ సుల్తానేట్, గ్రేట్ సెల్జుక్ సామ్రాజ్యానికి అవశిష్ట రాజ్యం. [3]
  • జిన్ రాజవంశం ఉత్తర చైనాపై నియంత్రణలోకి వచ్చిన తరువాత, దక్షిణ సాంగ్ రాజ్యం ఉత్తర సాంగ్ రాజ్యానికి అవశిష్ట రాజ్యంగా ఉనికిలో ఉంది. [4]
  • 1204 తరువాత ది సాక్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, మూడు కొత్త రాజ్యాలుగా ఉద్భవించాయి: నికే సామ్రాజ్యం, ఎంపైర్ ఆఫ్ నికే, ఎపిరస్ నియంతృత్వ రాజ్యం.
  • పాండ్య నాడులో అధికభాగాన్ని మధురై సుల్తానేట్ తన నియంత్రణలోకి తెచ్చుకున్నాక, ఆ తరువాత దాన్ని విజయనగర సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న తరువాత, దక్షిణ పాండ్యులు 1330 నుండి 1422 వరకు ఆధునిక తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలతో పాటు పశ్చిమ కనుమలలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వారు మరింత భూభాగాన్ని కోల్పోయి, తెంకాసి పాండ్యులుగా అవశిష్ట రాజ్యాన్ని ఏర్పరచుకుని తెంకాసి ప్రాంతాన్ని 1623 వరకు పరిపాలించారు [5]
  • మింగ్ రాజవంశం చైనాపై సరైన నియంత్రణను ఏర్పరచుకున్న తరువాత, యువాన్ రాజవంశం మంగోలియన్ పీఠభూమికి వెనక్కి వెళ్లి , ఉత్తర యువాన్ అనే అవశిష్ట రాజ్యంగా మనుగడ సాగించింది. [6]
  • 1532 లో ఇన్కా సామ్రాజ్యాన్ని స్పానిష్ వారు స్వాధీనం చేసుకున్న తరువాత, విల్కాబాంబలో ఉన్న నియో-ఇన్కా రాష్ట్రం 1572 వరకు అవశిష్ట రాజ్యంగా నిలిచింది. [7]
  • క్వింగ్ రాజవంశం చైనాలో అధికభాగంపై నియంత్రణ సాధించిన తరువాత, మింగ్ రాజవంశం దక్షిణ మింగ్ అనే అవశిష్ట రాజ్యంగా మనుగడ సాగించింది. [5]

ఆధునిక చరిత్ర

మార్చు
  •  1772 లో రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా లు పోలాండ్‌ను మొదటిసారి విభజించి పంచుకున్నాక పోలిష్ -లిథువేనియన్ కామన్వెల్త్ ఒక అవశిష్ట రాజ్యంగా మిగిలిపోయింది.[8] ఈ అవశిష్ట రాజ్యం 1793 లో మళ్లీ విభజనకు గురైంది. 1807 లో నాల్గవ కూటమిపై విజయం సాధించిన తరువాత నెపోలియన్, వార్సా సంస్థానం (డచ్చీ ఆఫ్ వార్సా) అనే కొత్త పోలిష్ అవశిష్ట రాజ్యాన్ని సృష్టించాడు.[9] నెపోలియన్ ఓటమి తరువాత, వియన్నా కాంగ్రెస్ 1815 లో కాంగ్రెస్ పోలాండ్ అనే రాష్ట్రాన్ని సృష్టించింది; దీనిని అవశిష్ట రాజ్యంగా గుర్తించాల లేక కీలుబొమ్మ రాజ్యంగా చూడాలా అనేది అస్పష్టంగా ఉంది.[10]
  •  కమ్యూనిస్టులు హంగరీని తమ ఆధీనంలోకి తీసుకున్నపుడు, మొదటి హంగేరియన్ రిపబ్లిక్ ప్రభుత్వం రాజీనామా చేసిన తరువాత, 1919 మార్చిలో హంగేరియన్ సోవియట్ రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.[11]
  •  జర్మనీ-ఆస్ట్రియా రిపబ్లిక్, 1918 లో ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యంలో ప్రధానంగా జర్మన్ మాట్లాడే జనాభా ఉన్న ప్రాంతాలను కలిపి ఒక అవశిష్ట రాజ్యంగా సృష్టించబడింది.[12]
  •  బెనిటో ముస్సోలిని నేతృత్వంలోని రంప్ రిపబ్లిక్ ఆఫ్ సాలీ (రిపబ్లికా సోసియాలి ఇటాలియానా, 1943-1945), ఇటలీ రాజ్యానికి చట్టబద్ధమైన వారసుడిగా పేర్కొన్నారు; నిజానికి ఇది నాజీ జర్మనీకి చెందిన ఒక కీలుబొమ్మ రాజ్యం. [13][14][15]
  •  1949 లో చైనా అంతర్యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, రిపబ్లిక్ ఆఫ్ చైనా (ROC), తైవాన్ ద్వీప భూభాగానికి (ఆధునిక దేశమైన తైవాన్ స్థాపించారు) పారిపోయింది. ఇంతలో, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) చైనా ప్రధాన భూభాగంపై నియంత్రణ సాధించి, 1949 లో చైనా కమ్యూనిస్ట్ విప్లవం తరువాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) ను స్థాపించింది. 1949 కి ముందు తైవాన్ రాజకీయ స్థితి అప్పటికే సంక్లిష్టంగా ఉంది; ఖచ్చితంగా చెప్పాలంటే, చైనా ఆక్రమణలో ఉన్నప్పటికీ ఇది చైనాలో భాగం కాదు (రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, 1945 లో, చైనా ఏకపక్షంగా తైవాన్‌నుజపాన్ సామ్రాజ్యం నుండి లాక్కుని విలీనం చేసుకుంది). 1949 నుండి, కొన్ని వర్గాలు, తైవాన్ చైనాలో భాగం అనే భావన ఆధారంగా తైవాన్‌ లోని చైనాను ఒక అవశిష్ట రాజ్యంగా పరిగణిస్తున్నాయి.[16] మరికొన్ని వర్గాలు, తైవాన్ చైనాలో భాగం కాదనే ఆవరణ ఆధారంగా. తైవాన్‌ లోని చైనాను ప్రవాస ప్రభుత్వం అని భావించాయి,
  •  ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా - అంటే 1992 నుండి 2003 వరకు స్టేట్ యూనియన్ ఆఫ్ సెర్బియా అండ్ మోంటెనెగ్రో కు వాడిన పేరు - ను సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా (1945-1992) విడిపోయినప్పుడు, మిగిలిపోయిన అవశిష్ట రాజ్యంగా పరిగణించారు.[17] దాని వ్యవస్థాపకులు మాత్రమే కాకుండా,[18] వారికి వ్యతిరేకులైన అనేకమంది వ్యక్తులకు కూడా ఇదే అభిప్రాయం ఉంది.
  •  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్: 2021 లో కాబూల్ పతనమైన తరువాత, తాలిబాన్ దళాలు ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించి, పంజ్‌షీర్ లోయకు పారద్రోలింది. దాఅంతో పంజ్‌షీర్ వివాదం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో దీని నియంత్రణలో ఉన్న భూభాగం 1% కంటే తక్కువే అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంగా దీనికే అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది.[19]

మూలాలు

మార్చు

 

  1. Fattah, Hala Mundhir; Caso, Frank (2009). A Brief History of Iraq. p. 277.
  2. Dodd, Leslie (25 November 2016). "Kinship Conflict and Unity among Roman Elites in Post-Roman Gaul". Official Power and Local Elites in the Roman Provinces. Routledge. p. 170. ISBN 9781317086147.
  3. Richard Todd (2014), The Sufi Doctrine of Man: Ṣadr al-Dīn al-Qūnawī's Metaphysical Anthropology, p. 6
  4. Des Forges, Roger V. (2003). Cultural centrality and political change in Chinese history : northeast Henan in the fall of the Ming. Stanford University Press. p. 6. ISBN 9780804740449.
  5. 5.0 5.1 Struve, Lynn A. (1998). "The Ming-Qing Conflict, 1619-1683: A Historiography and Source Guide": 110–111. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  6. Seth, Michael J. (2010). A History of Korea: From Antiquity to the Present. Rowman & Littlefield Publishers. p. 115.
  7. Bauer, Brian S.; Fonseca Santa Cruz, Javier; Araoz Silva, Miriam (2015). Vilcabamba and the Archaeology of Inca Resistance. Los Angeles. pp. 1–2. ISBN 9781938770623.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  8. Fazal, Tanisha M. (2011). State Death: The Politics and Geography of Conquest, Occupation, and Annexation. Princeton University Press. p. 110. ISBN 9781400841448.
  9. Lerski, George J. (1996). Historical dictionary of Poland, 966-1945. Greenwood Press. p. 121. ISBN 9780313260070.
  10. Marcus, Joseph (2011). Social and political history of the Jews in Poland, 1919-1939. Mouton Publishers. p. 73. ISBN 9783110838688.
  11. John C. Swanson (2017). Tangible Belonging: Negotiating Germanness in Twentieth-Century Hungary. University of Pittsburgh Press. p. 80. ISBN 9780822981992.
  12. Magocsi, Paul Robert (2018). Historical atlas of Central Europe: Third Revised and Expanded Edition. University of Toronto Press. p. 128. ISBN 9781487523312.
  13. James Hartfield, Unpatriotic History of the Second World War, ISBN 178099379X, 2012, p. 424
  14. Eric Morris, Circles of Hell: The War in Italy 1943-1945, ISBN 0091744741, 1993, p. 140
  15. Neville, Peter (2014). Mussolini (2nd ed.). Routledge. p. 199. ISBN 9781317613046.
  16. "TIMELINE: Milestones in China-Taiwan relations since 1949". Reuters. Retrieved March 4, 2015. 1949: Chiang Kai-shek's Nationalists lose civil war to Mao Zedong's Communist forces, sets up government-in-exile on Taiwan.
  17. Sudetic, Chuck (1991-10-24), "Top Serb Leaders Back Proposal To Form Separate Yugoslav State", New York Times, retrieved 2018-03-07.
  18. Sudetic, Chuck (1991-10-24), "Top Serb Leaders Back Proposal To Form Separate Yugoslav State", New York Times, retrieved 2018-03-07.
  19. "The War in Afghanistan Isn't Quite Over Yet". The National Interest. 23 August 2021.