ప్రధాన మెనూను తెరువు

విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావని మొత్తం తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.

విజయనగర సామ్రాజ్యము
సామ్రాజ్యము
Blank.png
 
Blank.png
 
Blank.png
1336 – 1646
Location of విజయనగర సామ్రాజ్యము
విజయనగర సామ్రాజ్యం, 1446, 1520 CE
రాజధాని విజయనగరం
భాష(లు) కన్నడ, తెలుగు
మతము హిందూ మతం
Government రాచరికం
రాజు
 - 1336–1356 మొదటి హరిహరరాయలు
 - 1642–1646 మూడవ శ్రీరంగరాయలు
చరిత్ర
 - ఆవిర్భావం 1336
 - Earliest records 1343
 - పతనం 1646
Preceded by
Succeeded by
Blank.png హొయసల సామ్రాజ్యం
Blank.png కాకతీయులు
Blank.png పాండ్య రాజ్యం
మైసూరు రాజ్యం Flag of Mysore.svg
కేళడి నాయకులు Blank.png
తంజావూరు నాయకులు Blank.png
మదురై నాయకులు Blank.png
చిత్రదుర్గ నాయకులు Blank.png
విజయనగర సామ్రాజ్యం
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవ రాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢ రాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహ దేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ రాయలు 1572-1586
వెంకట II 1586-1614
శ్రీ రంగ రాయలు 2 1614-1614
రామదేవ 1617-1632
వెంకట III 1632-1642
శ్రీరంగ III 1642-1646

ఆనెగొందిసవరించు

విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు. ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని తళ్ళికోట యుద్ధంలో దారుణంగా ఓడించింది. సుల్తానుల సైన్యం రాజధానిని ఆరునెలల పాటు కొల్లగొట్టి, నేలమట్టం చేసింది. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్టి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు.

రాయలవారి రెండో రాజధాని పెనుగొండ. ప్రస్తుతం గంగావతి, ఆనెగొందిలో రాయల వంశానికి చెందిన 17వ తరం వారున్నారు. ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే తాళిబొట్టు వెళుతుంది. ముస్లింలు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లి వారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది.

శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపా సరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి వివాహం నిశ్చయమైనా మొదట హంపిలోనే పూజలు చేస్తారు.

స్థాపనసవరించు

విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశము లోని రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ ఓరుగల్లును ఆక్రమించి మలబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను సోదరులు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. సోదరులిద్దరిని ఢిల్లీకి తరలించి ఇస్లాము మతానికి మార్చారు. హోయసల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి విజయనగర రాజ్యము స్థాపించారు[1].

హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు. అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్త. దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయల తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.

తారస్థాయిసవరించు

 
విజయ్ నగర ప్రజలు ధరించే దుస్తులు - డచ్ పెయింటర్ అయిన కార్నెలియస్ హజర్ చిత్రం

తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొని ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.

విజయనగర రాజులకు సమంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచి, ఆ తరువాత స్వతంత్రులుగా ఒక్కొక్కరు రెండు శతాబ్దాల వరకు పరిపాలించారు.

1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న గోవాను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి.

శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో అళియ రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్ధంనుండి సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుకొండకు పారిపోయాడు.

విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.

పతన దశసవరించు

తళ్ళికోట యుద్ధానంతర దశను విజయనగర సామ్రాజ్య పతనదశగా చెప్పుకోవచ్చు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓటమిచెందిన తర్వాత తిరుమల దేవరాయలు నామమాత్ర పరిపాలకుడైన సదాశివరాయలను తీసుకుని విజయనగర ఖజానాను ఎత్తుకుని పెనుకొండకు పారిపోయారు. విజయనగరాన్ని పాదుషాలు నేలమట్టం చేసి వదిలిపోయాకా తిరుమల దేవరాయలు ఆ రాజధానిని బాగుచేసుకుని పరిపాలించేందుకు మూడేళ్ళపాటు ప్రయత్నించారు. శ్మశానంలా తయారైన ఈ రాజధానిని తిరిగి ఏలుకోలేక పెనుకొండకు తిరిగివచ్చారు. అంతటితో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా విద్యానగరం ముగిసిపోయింది. ఆపైన కొన్నేళ్ళు పెనుకొండ, మిగిలిన సంవత్సరాలు చంద్రగిరిలను రాజధానులుగా చేసుకుని పాలించారు.

తళ్ళికోట ఓటమి తర్వాత రాజ్యభాగాలు తగ్గిపోనారంభించాయి. తిరుమలదేవరాయలు తన ముగ్గురు కుమారులను మూడు ప్రాంతాలకు ప్రతినిధులుగా పరిపాలింపజేశారు. పెద్దకుమారుడైన రామరాయలు కన్నడప్రాంతాలను శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలించారు. రెండో కుమారుడు శ్రీరంగ దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. మూడో కుమారుడు వేంకటపతి దేవరాయలు మొదట చంద్రగిరిని రాజధానిగా చేసుకుని తమిళ ప్రాంతాలు పాలించేవారు. విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీరంగదేవరాయలు తెలుగు ప్రాంతాల విషయంలో చాలా ప్రయత్నాలు చేసి, వైభవాన్ని పునరుద్ధరించేందుకు విఫలయత్నాలు చేశారు. బీజాపూరు సుల్తానులతో కొన్ని యుద్ధాల్లో గెలిచి, కొన్ని ఓడిపోయారు. ఆయనకు పుత్రసంతానం లేకపోవడంతో చిన్నతమ్ముడు చంద్రగిరి పాలకుడు అయిన వేంకటపతి దేవరాయలకు రాజ్యాన్నిచ్చారు. ఆయన పాలనకాలంలోనే బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు చేశారు. కొంతకాలం పాటు పెనుకొండను రాజధానిగా చేసుకుని అన్నగారు ఇచ్చిన సామ్రాజ్యాన్ని పాలించినా ఆపైన మాత్రం రాజధానిని తన పట్టణమైన చంద్రగిరికే మార్చుకున్నారు. ఆయన విజయనగర సామ్రాజ్యపు ఆఖరి గొప్ప చక్రవర్తిగా పేరొందారు. ఆయన కాలంలో శ్రీరంగపట్నాన్ని ఒడయారు రాజులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోకపోయినా కొందరు రాజులు స్వతంత్రించే వ్యవహరించేవారు.[2]

వంశ పరంపరసవరించు

కింది జాబితా రాబర్ట్ సెవెల్ రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి.

సంగమ వంశము

 • హరిహర I (దేవ రాయ) 1336-1343
 • బుక్క I 1343-1379
 • హరిహర II 1379-1399
 • రెండవ బుక్క రాయలు 1399-1406
 • మొదటి దేవ రాయలు 1406-1412
 • వీర విజయ 1412-1419
 • రెండవ దేవ రాయలు 1419-1444
 • (తెలియదు) 1444-1449
 • మల్లికార్జున రాయలు 1452-1465 (తేదీలు సందేహాస్పదం)
 • రాజశేఖర రాయలు 1468-1469 (తేదీలు సందేహాస్పదం)
 • మొదటి విరూపాక్ష రాయలు 1470-1471 (తేదీలు సందేహాస్పదం)
 • ప్రౌఢదేవ రాయలు 1476-? (తేదీలు సందేహాస్పదం)
 • రాజశేఖర 1479-1480 (తేదీలు సందేహాస్పదం)
 • రెండవ విరూపాక్ష రాయలు 1483-1484 (తేదీలు సందేహాస్పదం)
 • రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం)

సాళువ వంశము

 • నరసింహ 1490-?

తుళువ వంశము

 • నరస (వీర నరసింహ) ?-1509
 • శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530
 • అచ్యుత దేవరాయలు 1530-1542
 • సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567
 • రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565
 • తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567
 • తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575
 • రెండవ రంగరాయలు 1575-1586
 • మొదటి వెంకటాపతి రాయలు 1586-1614

ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు

 • రంగ దేవరాయ II 1614-1615
 • రామ దేవరాయ 1615-1633
 • వెంకట దేవరాయ III 1633-1646
 • రంగ దేవరాయ III 1614-1615

చూడండిసవరించు

సంబంధిత లింకులుసవరించు

మూలాలుసవరించు

 1. Robert Sewell, A Forgotten Empire (Vijayanagar): A contribution to the history of India, Chapter 2; http://www.gutenberg.org/dirs/etext02/fevch10.txt
 2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 సంపాదకులు.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.


విజయనగర రాజులు  
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము