అవసరాల సూర్యారావు

(అవసరాల సూర్యరావు (రచయిత) నుండి దారిమార్పు చెందింది)

అవసరాల సూర్యారావు తెలుగు రచయిత. అతను మహాకవి డైరీలు,[1] లేఖలు, మాటా - మంతీ మొదలగు వాటికి సంపాదకత్వం వహించి ప్రచురించాడు. ' సంస్కర్త హృదయం ' అనే గురజాడ కథను ఆంగ్లం లోనికి అనువదించాడు.

అవసరాల సూర్యారావు
జననం(1923-12-14)1923 డిసెంబరు 14
మరణం1963 మార్చి 24(1963-03-24) (వయసు 39)
వృత్తిరచయిత

గురజాడ రచనల పరిశోధన మార్చు

గురజాడను తెలుగువారికి బాగా పరిచయం చేసిన వ్యక్తిగా చెప్పుకోవలసింది శ్రీశ్రీ అయితే అతని రచనలను అందించిన వారిలో ప్రథముడు అవసరాల సూర్యారావు. అత్ను గురజాడ రాతప్రతులను అర్థం చేసుకుని, అనువదించిన వ్యక్తి. చాలా ఏళ్లపాటు అవన్నీ గురజాడ రాసినవే అనుకున్నారు కానీ అనువాదమన్న మాట మరచిపోయారు. ఆరోజులలో అవసరాల ఒక చేయి పనిచేయక, చాలా పేదరికంలో ఉంటూ కూడా అంకిత భావంతో ఈ యజ్ఞం నెరవేర్చాడు. గురజాడ ఏ పదం ఎలా వాడతాడో అవసరాలకు తెలిసినట్టు మరెవరికీ తెలియదని ఆరుద్ర అంతటి పరిశోధకుడే మెచ్చుకున్నాడు. ఇప్పుడు సంపుటాలకొద్దీ ముద్రించేందుకు ఆర్థిక వనరులు, సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి కానీ, ఆరోజుల్లో స్కానర్ల సహాయంతో ఇమేజి పెంచి చూసుకొనే సదుపాయాలు లేవు. కంప్యూటర్లు లేవు. అప్పట్లోనే అన్ని సంపుటాలు క్రమబద్ధంగా పూర్తిచేయడంలో సూర్యారావు నిబద్ధత తెలుస్తుంది.

దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో కొన్ని చోట్ల అనువాదాల తప్పులు దొర్లడం నిజమే కానీ భావానికి హాని కలిగించేవిగా లేవు.[2]

రచనలు మార్చు

ప్రధానంగా నాటక కర్త అయిన అతను నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశాడు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది. ముల్క్ రాజ్ ఆనంద్ నవల కూలీని ఆంధ్రీకరించారు. ఆకాశ దీపాలు[3] అవసరాల కథలు అతని రచనలు.

  • అవసరల కథలు
  • ఆకాశ దీపాలు
  • కూలీ (ముల్కరాజ్ ఆనంద్ నవల అనువాదం)
  • నెహ్రూ లేఖలు (అనువాదం) [4]
  • గురజాడ అప్పారావు (ఆంగ్లంలోకి అనువాదం)

మూలాలు మార్చు

  1. "పుట:Mahaakavi dairiilu.pdf/7 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-14.
  2. సాహిత్య ప్రస్థానం నవంబర్-డిసెంబర్ 2015 గురజాడ శతవర్థంతి ప్రత్యేక సంచిక
  3. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-14.
  4. అవసరాల సూర్యారావు(అను.) (1960). నెహ్రూ లేఖలు (ప్రపంచ ప్రముఖులు నెహ్రూకి రాసినవి:నెహ్రూ రాసినవి) సంపుటి 4.