అవాజ్ బిన్ సయీద్ పూర్తి పేరు బిన్ అవాజ్ బిన్ జాబిర్ బిన్ అబ్దుల్లా (3 మార్చి 1934 - 2 జూలై 1995) కలం పేరు చాంద్.ఆధునిక కథా రచయిత, కవి,నాటక రచయిత.

అవాజ్ సయీద్
అవాజ్ సయీద్

అవాజ్ సయీద్


వ్యక్తిగత వివరాలు

జననం (1934-03-03)1934 మార్చి 3
హైదరాబాదు, తెలంగాణ,భరతదేశం
మరణం 1995 జూలై 2(1995-07-02) (వయసు 61)
చికాగో
జీవిత భాగస్వామి కనీజ్ ఫాతిమాను
వృత్తి ఉర్దూ రచయిత

వ్యక్తిగత జీవితం

మార్చు

అవాజ్ సయీద్ 3 మార్చి 1934న సయీద్ బిన్ ఆవాజ్ బిన్ జాబిర్ బిన్ అబ్దుల్లా (తండ్రి) నూరున్నిస్సా బేగం అల్ ఖులాకీ (తల్లి)లకు జన్మించాడు.సయీద్ తన ప్రారంభ విద్యను అన్వర్-ఉల్-ఉలూమ్ హైస్కూల్లో పూర్తి చేశాడు.ఆ తర్వాత,అతను ఏప్రిల్ 1948లో సిటీ కాలేజ్ నుండి మెట్రిక్యులేషన్,ఏప్రిల్ 1952లో చాదర్‌ఘాట్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాడు.బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) అభ్యసించడానికి అన్వర్-ఉల్-ఉలూమ్ కాలేజీలో చేరాడు కానీ మొదటి సంవత్సరం మాత్రమే పూర్తి చేశాడు. అతను 1954లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందడం వల్లన ఆవాజ్ సయీద్ 1960లో కనీజ్ ఫాతిమాను వివాహం చేసుకున్నాడు.[1][2]

రచనలు

మార్చు

అవాజ్ సయీద్ ఏడు పుస్తకాలు రాశాడు.

  • సైకా సఫర్ (1969)
  • తీస్రా ముజసమ్మ (1973)
  • రాత్ వాలా అజ్నబీ (1977)
  • కోహె-నిదా (1977)
  • బెనామ్ మౌసమోన్ కా నౌహా (1987)
  • కువాన్ ఆద్మీ ఔర్ సమందర్ (1993)
  • ఖకే (1985)

ఖాకే పుస్తకం రెండవ పునర్ముద్రణను 2006 లో అతని కుమారుడు ఔసఫ్ సయీద్ ప్రచురణ చేయించాడు.ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రి అర్జున్ సింగ్ జెడ్డాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు.

సయీద్ 2 జూలై 1995న చికాగో, అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు గుండె పోటు వల్ల మరణించాడు. అంత్యక్రియలు చికాగోలోని పీటర్సన్‌లోని రోజ్‌హిల్ స్మశానవాటికలో చేశారు.

మూలాలు

మార్చు
  1. "How old is Awaz Sayeed". HowOld.co (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.[permanent dead link]
  2. "Home". Awaz Sayeed (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-08.