అవిజిత్ దాస్

అవిజిత్ దాస్ భారతీయ కూచిపూడి ప్రదర్శనకారుడు

అవిజిత్ దాస్ భారతీయ కూచిపూడి ప్రదర్శనకారుడు, ఉపాధ్యాయుడు, నృత్యకళాకారుడు, గాయకుడు. ఇతను 2021 సంవత్సరంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకున్నాడు.[1] [2]

అవిజిత్ దాస్
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకుంటున్న దృశ్యం
బాల్య నామంఅవిజిత్ దాస్
జననం (1986-02-28) 1986 ఫిబ్రవరి 28 (వయసు 38)
నల్హతి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఉద్యమంకూచిపూడి
అవార్డులుఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం
వెబ్‌సైటుURL|https://kimaham.com/

కెరీర్

మార్చు

ఇతను తన తొమ్మిదేళ్ల వయసులో తొలి ప్రదర్శనను ఇచ్చాడు, ప్రస్తుతం భారతదేశంలో, విదేశాలలో కూడా విస్తృతంగా ప్రదర్శనలు ఇస్తున్నాడు.[3] ఇతను ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్,[4] [5] భ్రమర ఫెస్టివల్ ఆఫ్ డ్యాన్స్,[6] ఇండియన్ హాబిటాట్ సెంటర్ [7], నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్‌తో సహా పలు జాతీయ నృత్యోత్సవాలలో ప్రదర్శన ఇచ్చాడు.[8] ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఎరేసింగ్ బోర్డర్స్ డ్యాన్స్ ఫెస్టివల్, డ్రైవ్ ఈస్ట్ డ్యాన్స్ ఫెస్టివల్‌తో సహా అంతర్జాతీయ నృత్య ఉత్సవాల్లో అవిజిత్ ప్రదర్శన ఇచ్చాడు.[9]

కిమ్ అహమ్

మార్చు

దాస్, బెంగళూరులో కిమ్ అహమ్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్‌ ఇన్స్టిట్యూట్ ని స్థాపించాడు, ఇది యునెస్కో గుర్తింపు పొందిన సంస్థ. ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం నృత్యకారులకు శిక్షణ ఇస్తారు. దాస్, స్పిక్ మాకే[10] అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో అనేక వర్క్‌షాప్‌లు, వివిధ దేశాలలో మాస్టర్ క్లాస్‌లను నిర్వహించాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కిమ్ అహమ్ నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. [11]

నృత్యోత్సవాలు

మార్చు
  • శరణాగతి: కళాకారులు, పండితులను ఒకచోట చేర్చి కిమ్ అహమ్ నిర్వహించే వార్షిక నృత్యోత్సవం.[12] [13] [14] [15] [16] [17]
  • కవిప్రాణం: ఇది పూర్వపు గొప్ప కవుల వారసత్వాన్ని స్మరించుకోవడానికి, వారి కవితా, సంగీత రచనలను జరుపుకోవడానికి కిమ్ అహమ్ నిర్వహించే వార్షిక నృత్య ఉత్సవం, ఈ రంగంలోని పండితులచే నృత్యాలు, సెమినార్ల ద్వారా నివాళులు అర్పించడం. [18] [19] [20]

అవార్డులు, విజయాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Announcement (PDF).
  2. "Announcement of the awards - news".
  3. "An Inspiring Journey in Dance - Tapati Chowdurie". The Statesman.
  4. "Khajuraho dance festival - IndiaOnlinePages".
  5. "Khajuraho dance festival - Outlookindia".
  6. "Bhramara Festival of Dance at the Royal Opera House, Mumbai".
  7. "Moving like a master - by Ranee Kumar".
  8. "Narthaka Dance Festival -by Natyanjali Trust".
  9. "Traditional Indian Dance, With Room for New Blood". New York Times.
  10. "Ujjain: Kuchipudi artiste conducts workshop in three institutes". Free Press Journal.
  11. "Kuchipudi dancer Avijit Das unites 19 artistes for a thoughtful COVID-19 fund-raiser". The Hindu.
  12. "Saranagathi - Narthaki review 2022".
  13. "Saranagathi - Narthaki review 2023".
  14. "SarNaagathi - Classical claps".
  15. "Stay happening - Saranagathi dance festival".
  16. "Music Unplugged - Saranagathi review".
  17. "Sanranagathi - Different interpretations: Sruthi Review".
  18. "Kavipranam - Narthaki 2022".
  19. "Kavipranam: When Performing Arts Meets Literature - Bharat Times".
  20. "Kavipranam - The Hindu review".
  21. "Announcement of the awards - news".

బాహ్య లింకులు

మార్చు

కిమ్ అహమ్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్