1959, మే 9కొలంబోలో జన్మించిన అశాంత డి మెల్ (Ashantha De Mel) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు శ్రీలంక క్రికెట్ జట్టు తరఫున 17 టెస్టులు, 57 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలుసవరించు

అశాంత డి మెల్ 17 టెస్ట్ మ్యాచ్‌లలో 14.17 సగటుతో 326 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 34 పరుగులు. 36.94 సగటుతో 59 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 3 సార్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 109 పరుగులకు 6 వికెట్లు.

వన్డే క్రికెట్ గణాంకాలుసవరించు

డి మెల్ 57 వన్డేలలో 37.91 సగటుతో 59 వికెట్లు పడగొట్టినాడు. ఒకే వన్డేలో 5 వికెట్లను రెండూ సార్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 32 పరుగులకు 5 వికెట్లు. బ్యాటింగ్‌లో 14.56 సగటుతో 466 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 36 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్సవరించు

డి మెల్ 1983, 1987 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో శ్రీలంక జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఒకే వన్డేలో అతడు సాధించిన 5 వికెట్ల ఘనత రెండు సార్లు కూడా 1983 ప్రపంచ కప్‌లో సాధించినదే.

బయటి లింకులుసవరించు