అశోక్ తాపిరామ్ పాటిల్

అశోక్ తాపిరామ్ పాటిల్ (జననం 9 సెప్టెంబర్ 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

అశోక్ తాపిరామ్ పాటిల్

పదవీ కాలం
16 మే 2009 – 23 మే 2019
ముందు వసంతరావు జీవన్‌రావ్ మోర్
తరువాత ఉన్మేష్ భయ్యాసాహెబ్ పాటిల్
నియోజకవర్గం జలగావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-09-09) 1961 సెప్టెంబరు 9 (వయసు 63)
పరోలా, జల్గావ్, మహారాష్ట్ర
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
జీవిత భాగస్వామి హేమలత
సంతానం 3
నివాసం రోహిత్ హౌస్, ప్లాట్ నెం. 4, న్యూ హౌసింగ్ సొసైటీ, పరోలా, జిల్లా. జల్గావ్, మహారాష్ట్ర పిన్-425111

రాజకీయ జీవితం

మార్చు
  • 1990 - 1995 & 1995 - 1997: పరోలా నగరపాలిక కార్పొరేటర్ (రెండు సార్లు)
  • 1998-2000: పరోలా నగరపాలిక ప్రెసిడెంట్
  • 2001-06:పరోలా నగరపాలిక ప్రెసిడెంట్
  • 2002-05: చైర్మన్ APMC పరోలా, జిల్లా. జలగావ్
  • 2009: తొలిసారి జలగావ్ నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.
  • 31 ఆగస్టు 2009: రక్షణ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, సలహా కమిటీ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ & పర్యాటక మంత్రిత్వ శాఖ సభ్యుడు
  • 16 మే 2014: 16వ లోక్‌సభకు జలగావ్ నుండి తిరిగి ఎన్నికయ్యాడు(2వసారి)
  • 1 సెప్టెంబర్ 2014 నుండి ప్రభుత్వ హామీలపై కమిటీ సభ్యుడు
  • రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • పెట్రోలియం & సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • జలవనరులు, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. The Times of India (2024). "A.T. NANA PATIL". The Times of India. Retrieved 21 October 2024.