అశ్వని కుమార్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ మంత్రివర్గంలో అక్టోబర్ 2012 నుండి మే 2013 వరకు న్యాయశాఖ మంత్రిగా పని చేశాడు.

అశ్వని కుమార్
అశ్వని కుమార్


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2002 – 2004
పదవీ కాలం
2004 – 2010
పదవీ కాలం
2010 – 2016
నియోజకవర్గం పంజాబ్

న్యాయశాఖ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 10 మే 2013
ప్రధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్
ముందు సల్మాన్ ఖుర్షిద్
తరువాత కపిల్ సిబల్

అడిషనల్ సొలిసిటర్ జనరల్ అఫ్ ఇండియా
పదవీ కాలం
1991 – 1991

వ్యక్తిగత వివరాలు

జననం (1952-10-26) 1952 అక్టోబరు 26 (వయసు 72)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
(15 ఫిబ్రవరి 2022 వరకు)
జీవిత భాగస్వామి మధు కుమార్ (1975–2012)
సంతానం 2
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి న్యాయవాది, రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు Official website

రాజకీయ జీవితం

మార్చు

అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2002 నుండి 2004, 2004 నుండి 2010, 2010 నుండి 2016 వరకు పంజాబ్ నుండి వరుసగా మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశాడు. ఆయన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ హయంలో 2011 జనవరి నుంచి జూలై వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, అక్టోబర్ 2012 నుండి మే 2013 వరకు న్యాయశాఖ మంత్రిగా, జనవరి 2011 నుంచి మే 2013 వరకు ప్రణాళిక మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా పని చేశాడు. అశ్వని కుమార్‌ 2022 ఫిబ్రవరి 15న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[1][2][3][4]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (15 February 2022). "కాంగ్రెస్‌కు కేంద్ర మాజీ మంత్రి అశ్వనికుమార్ రాజీనామా". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  2. Sakshi (15 February 2022). "అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌." Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  3. Prabha News (15 February 2022). "కాంగ్రెస్ కి రాజీనామా చేసిన కేంద్ర మాజీ న్యాయ‌శాఖ మంత్రి అశ్విని కుమార్". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  4. Namasthe Telangana (15 February 2022). "అస‌లు రాజ‌కీయాల్లోనే ఉండ‌ను : అశ్వ‌నీ కుమార్‌". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.