అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. తన ఇష్టదేవత యొక్క నూట ఎనిమిది పేర్లను ఛంధోబద్దంగా కూర్ఛి కీర్తంచడం కారణంగా అష్టోత్తర శత నామ స్తోత్రాలు వెలువడినాయి.

నిజానికి ముఖ్య మైనటువంటి అన్ని దేవతల మీద అష్టోత్తరాలూ (అనగా అష్టోత్తర శతనామాలూ), సహస్ర నామాలూ ఉన్నాయి. అత్యధికంగా, దేవతా స్తోత్రాలన్నీ సంసకృతభాషలో ఉన్నాయి. సామాన్య ప్రజలకు ఈ సంస్కృత నామాల యొక్క అర్ధం అవగతం చేయించాలనే సదుద్దేశంతో పండితులు కొందరు ఈ స్తోత్రాలకు వివరణలు వ్రాశారు.

కొన్ని అష్టోత్తర శత నామ స్తోత్రాలు

మార్చు
 
శ్రీ మహా లక్ష్మీ

శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీ రామ అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీ శివ అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీ శని అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం