ఎగ్జిస్టెన్షియలిజం

(అస్తిత్వవాదం నుండి దారిమార్పు చెందింది)

అస్తిత్వవాదం. (Existentialism)పందొమ్మి దవ శతాబ్ది పూర్వార్థంలో సెరెన్‌ కీర్కెగార్డ్‌ (1813-55) అనే డేనిష్‌ తత్త్వవేత్త రచనల ఆధారంగా ప్రారంభమైన ఒక తాత్త్విక దృక్పథం/ సిద్ధాంతం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీలోనూ, మరి కొంత కాలానికి ఫ్రాన్స్‌, ఇటలీ దేశాలలోనూ నాస్తికవాద ఛాయలతో ఈ దృక్పథం పెంపొందింది. జర్మన్‌ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!) (Friedrich Nietscze), 1964లో నోబెల్‌ బహుమతిని తిరస్కరించిన ఫ్రెంచి నవలా కారుడు, తత్త్వవేత్త జఁపాల్‌ సార్‌ట్రె (Jean Paul Sartre) రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ వాదాన్ని ఫ్రాన్స్‌లో విస్తరింప జేశాడు. వ్యక్తి మనుగడ (అస్తిత్వం) లో మానవాతీత శక్తుల ప్రమేయం లేదనీ, అతడికి స్వీయ నిర్ణయ స్వేచ్ఛ ఉన్నదనీ, ఎవరికి వారు తమ జీవన శైలిని, మూర్తిమత్వాన్ని (personality) నిర్మించుకొనడమే గాని, అది తలరాతను బట్టి జరిగేది కాదనీ, ఎవరు చేసే పనులకు వారే బాధ్యులనీ ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. అంటే ఎవరు చేసే పనులకు వారే కర్తలు- మంచికైనా, చెడుకైనా. స్వీయ కర్తృత్వమే గానీ మరెవరికో, అలౌకికమైన మరే శక్తికో ఇందులో ప్రమేయం లేదని సారాంశం. ‘ఐడియలిజం’ సిద్ధాంతాలను ఇది ఆక్షేపిస్తుంది. జర్మన్‌ పదం Existenz-philosophie నుంచి వచ్చిన పదం ఎగ్జిస్టెన్షియలిజం. వ్యక్తి కర్తృత్వానికే విలువ ఇచ్చే సిద్ధాంతం కనుక స్వీయ కర్తృత్వ వాదమని తెలుగులో పేరు పెట్టుకోవచ్చు. ‘అస్తిత్వవాదం’ అనే పదం ఇప్పటికే వాడుకలో ఉంది.

From left to right, top to bottom: Kierkegaard, Dostoyevsky, Nietzsche, Sartre

ప్రముఖ అస్తిత్వవాదులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ఎపిక్యూరియనిజం

మూలాలు

మార్చు
  • పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010.