అస్సీ ఘాట్
అస్సీ ఘాట్ వారణాసిలో దక్షిణ కొసన ఉన్న ఘాట్.[1] ఇది విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.[2] ఈ ఘాట్‌లో ఉదయం పూట సుబా-ఎ-బనారస్ పేరుతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది.[3]
పర్యాటకం
మార్చుఅస్సీ ఘాట్ వారణాసిలో దక్షిణ కొసన ఉన్న ఘాట్. ఇది వారణాసిలోని అతిపెద్ద ఘాట్‌లలో ఒకటి.[4] అస్సీ నది అస్సీ ఘాట్ వద్దనే గంగా నదిలో సంగమిస్తుంది.[5] ఇది విదేశీ విద్యార్థులు, పరిశోధకులు పర్యాటకులు నివసించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. వినోదం, పండుగల సమయాల్లో ప్రజలు తరచుగా సందర్శించే ఘాట్లలో అస్సీ ఘాట్ ఒకటి. సాధారణ రోజుల్లో ఎక్కువగా సమీపంలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఘాట్‌ను సందర్శిస్తూంటారు. ఈ ఘాట్‌లో దాదాపు 22,500 మందికి వసతి ఉంది. [6] దేవ దీపావళి పండుగ సందర్భంగా, 6,00,000 పైచిలుకు పర్యాటకులు ఘాట్‌ను సందర్శిస్తారు.
అస్సీ ఘాట్ వద్ద తులసీదాస్ తనువు చాలించాడని హిందువులు నమ్ముతారు.
2010 వారణాసి బాంబు దాడి తరువాత, పర్యాటకులు ఎదుర్కొనే సమస్యలను మరింత త్వరగా పరిష్కరించడానికి అస్సి ఘాట్ పరిసరాల్లో అదనపు పోలీసులను నియమించారు.[7]
సుబా-ఎ-బనారస్
మార్చుతెల్లవారుజాముకు (సూర్యోదయం) ముందు, సుబా-ఎ-బనారస్ అనే ఉదయ కార్యక్రమాన్ని 2014 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రారంభించారు. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం సుబా-ఎ-బనారస్ ను ప్రచారం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఉదయ వేళలో భగవంతుడు, ప్రకృతిల గొప్పతనాన్ని అనుభూతి చెందడానికి అన్ని వర్గాల ప్రజలు చేతులు కలిపారు.[8] ఇది 2 గంటల పాటు జరుగుతుంది.[9]
కార్యకలాపాలు
మార్చుజనాదరణ పొందిన సంస్కృతిలో
మార్చు- కాశీనాథ్ సింగ్ హిందీ నవల కాశీ కా అస్సీ, ఘాట్ సమీపంలోని మొహల్లాలో సెట్ చేయబడింది. ఈ నవలనే సన్నీ డియోల్ తో 2018 లో చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో మొహల్లా అస్సీ అనే పేరుతో బాలీవుడ్ సినిమాగా వచ్చింది.[2][11]
- వారణాసి ఆధారిత కథ అయిన 2013 చిత్రం రాంఝనాలో కూడా "అస్సీ ఘాట్" సన్నివేశాలు ఉన్నాయి.
- నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన 2015 సినిమా మసాన్, అస్సీ ఘాట్ లోని వాటికా కేఫ్ సన్నివేశాలున్నాయి.
మూలాలు
మార్చు- ↑ Piers Moore Ede (26 February 2015). Kaleidoscope City: A Year in Varanasi. Bloomsbury Publishing. pp. 6–. ISBN 978-1-4088-3542-5.
- ↑ 2.0 2.1 "In the new world". Indian Express. 11 February 2011. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "ex" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Subah-e-Banaras a hit as Assi ghat gets a makeover". The Hindu. 2015-03-22. Retrieved 2024-06-01.
- ↑ "Assi Ghat | Varanasi, Uttar Pradesh | Attractions". Lonely Planet. Retrieved 2024-06-02.
- ↑ DK Eyewitness Travel Guide India (in ఇంగ్లీష్). Penguin. 2017-10-17. p. 206. ISBN 978-1-4654-7253-3.
- ↑ John McKim Malville and Rana P. B. Singh. "Time and the Ganga River at Asi Ghat, Pilgrimage and Ritual Landscape" (PDF). Archived from the original (PDF) on 24 January 2011. Retrieved 20 December 2010.
- ↑ "New measures to perk up vigil in city". The Times of India. The Times Group. 11 Dec 2010. Archived from the original on 4 November 2012. Retrieved 20 December 2010.
- ↑ "Subah-e-Banaras". SubaheBanaras. Retrieved 30 August 2020.
- ↑ "Subah-e-Banaras". Optima Travels. Retrieved 30 August 2020.
- ↑ "Vedic Recitations at Assi Ghat, Varanasi (Subah-e-Banaras): the Paper of Natalia Korneeva (video)". iocs.hse.ru (in ఇంగ్లీష్). Retrieved 2022-01-19.
- ↑ "Sunny Deol to play a pandit in Mohalla Assi". NDTV Movies. Archived from the original on 12 February 2011. Retrieved 2011-02-11.