హిందీ సినిమా

హిందీ భాషా చిత్ర పరిశ్రమ
భారతీయ సినిమా

హిందీ సినిమా లేదా బాలీవుడ్ ప్రధానంగా ముంబై నగరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాలు భారతదేశం, పాకిస్తాన్లతో బాటు మధ్య ప్రాచ్య దేశాలు, ఐరోపా దేశాలలో కూడా ఆదరించబడతాయి. హాలీవుడ్ చుట్టుప్రక్కల విస్తరించిన అమెరికా దేశపు ఆంగ్ల సినిమా పరిశ్రమను కూడా "హాలీవుడ్" అన్నట్లే "బొంబాయి"లో విస్తరించిన హిందీ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అనడం జరిగింది. ఇది అధికారిక నామం కాదు. ఒకోమారు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమను కూడ "బాలీవుడ్" అనడం కొన్ని (ప్రధానంగా విదేశ) పత్రికలలో జరుగుతుంటుంది కాని అది సరి కాదు[1]. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే "హాలీవుడ్" అనే ప్రదేశం అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. కాని బాలీ వుడ్ అనే స్థలం ఏదీ లేదు. కనుక ఆంగ్ల సినిమా సంప్రదాయాన్ని అనుకరిస్తూ "బాలీవుడ్" అనే పదాన్ని వాడడం అనుచితమని కొందరి అభిప్రాయం. కాని ఈ పదం విరివిగా ఉపయోగింపబడుతున్నది. ఆక్సఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో కూడా ఈ పదం చేర్చబడింది. ప్రపంచంలో అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రాలలో బాలీవుడ్ ఒకటి. [2][3][4]

భారతదేశంలోని ఇతర భాషల సినిమాల వలె హిందీ సినిమాలలో కూడా సంగీత భరిత గీతాలు ఉంటాయి. ఈ చిత్రాలలో హిందీ హిందుస్తానీ పోకడ ఉంటుంది. హిందీ, ఉర్దూ (ఖడీబోలీ) లతో బాటు అవధి, బొంబాయి హిందీ, భోజ్ పురి, రాజస్థానీ యాసలని కుడా సంభాషణలలో, గీతాలలో ఉపయోగిస్తారు. ప్రేమ, దేశభక్తి, సంసారం, నేరం, భయం వంటి విషయాలపై సినిమాలు నిర్మింపబడతాయి. అధిక గీతాలు ఉర్దూ కవితలపై అధార పడి ఉంటాయి.

చరిత్ర

మార్చు

హిందీలో మొట్టమొదటి చిత్రం 1913 లో దాదా సాహెబ్ ఫాల్కే నిర్మించిన రాజా హరిశ్చంద్ర. అతి వేగంగా జనాదరణ పొందటంతో 1930లో సంవత్సరానికి 200 చిత్రాలు రూపొందించబడేవి. అర్దేశీ ఇరానీ నిర్మించిన ఆలం ఆరా మొదటి టాకీ సినిమా. ఈ చిత్రం కూడా బాగా ఆదరించబడటంతో తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు టాకీలు గానే రూపొందించ బడ్డాయి.

తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య సంగ్రామం, దేశ విభజన లాంటి చారిత్రక ఘట్టాలు జరిగాయి. అప్పటి సినిమాలలో వీటి ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది. 1950 నుండి హిందీ సినిమాలు నలుపు-తెలుపు నుండి రంగులను అద్దుకొంది. సినిమాలలో ముఖ్య కథ ప్రేమ కాగా, సంగీతానికి ఈ చిత్రాలలో పెద్ద పీట వేసారు. 1960-70 ల చిత్రాలలో హింస ప్రభావం ఎక్కువగా కనపడినది. 1980 - 90 లలో మరల ప్రేమకథలు జనాదరణ చూరగొన్నాయి. 1990 - 2000 లో రూపొందించిన చిత్రాలు ఇతర దేశాలలో కూడా ఆదరణ పొందాయి. ప్రవాస భారతీయుల పెరుగుదల కూడా దీనికి ఒక ప్రముఖ కారణం. ప్రవాస భారతీయుల కథలు లోక ప్రియమయ్యాయి.

ముఖ్యమైన కొన్ని హిందీ సినిమాలు

మార్చు

కసమ్ (1988 చిత్రం) మొదలగునవి.

ప్రముఖ నటులు

మార్చు

ప్రముఖ నటీమణులు

మార్చు

మీనా కుమారి - మధుబాల - మౌసమీ ఛటర్జీ - మాధురీ దీక్షిత్ - మల్లికా శరావత్ - మహిమా చౌదరి - మనీషా కోయిరాల - మీనాక్షీ శేషాద్రి - మమతా కులకర్ణి - నూతన్ - ఆశా పరేఖ్ - అమృతా అరోరా - అమృతా సింగ్ - అమీషా పటేల్ - సాధన - సైరా బాను - శిల్పా శెట్టి - శిల్పా శిరోద్కర్ - స్మితా పాటిల్ - సోనాలీ బేంద్రే - వైజయంతి మాల - జయా బచ్చన్ - జూహీ చావ్లా - రేఖ - రవీనా టాండన్ - రాణీ ముఖర్జీ - పూజా భట్ - కరిష్మా కపూర్ - కరీనా కపూర్ - కాజోల్ - ఊర్మిళా మోటోండ్కర్ - డింపుల్ కపాడియా - దియా మిర్జా - భూమికా చావ్లా - గ్రేసీ సింగ్ - శ్రీదేవి - ప్రీతీ జింటా - ప్రియాంకా చోప్రా - ఐశ్వ్ర్తర్యా రాయ్ - హేమా మాలిని - ఇషా డియోల్ - బిపాసా బసు - దీపికా పాదుకొనె - సోనం కపూర్ - తను శ్రీ దత్తా - కత్రీనా కైఫ్

దర్శకులు

మార్చు

రచయితలు

మార్చు

ఇవి కూడ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Time magazine, 1996". Archived from the original on 2013-05-23. Retrieved 2008-10-16.
  2. Pippa de Bruyn; Niloufer Venkatraman; Keith Bain (2006). Frommer's India. Frommer's. p. 579. ISBN 0-471-79434-1.
  3. Wasko, Janet (2003). How Hollywood works. SAGE. pp. 185. ISBN 0-7619-6814-8.
  4. Subhaash K. Jha (2005). The Essential Guide to Bollywood. Roli Books. p. 1970. ISBN 81-7436-378-5.