అహ్మదాబాద్ - శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా ఎక్స్‌ప్రెస్
అహ్మదాబాద్ - శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది అహ్మదాబాద్ రైల్వే స్టేషను , శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలును 2015 జనవరి 25 న ప్రారంభించారు.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 25 జనవరి, 2015 |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | అహ్మదాబాద్ రైల్వే స్టేషను |
ఆగే స్టేషనులు | 22 |
గమ్యం | శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా రైల్వే స్టేషను |
ప్రయాణ దూరం | 1,735 కి.మీ. (1,078 మై.) |
సగటు ప్రయాణ సమయం | 35 గం. 50 ని.లు |
రైలు నడిచే విధం | ఆదివారం (19415), మంగళవారం (19416) |
రైలు సంఖ్య(లు) | 19415 / 19416 |
సదుపాయాలు | |
శ్రేణులు | ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది |
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్ |
వేగం | 48 కి.మీ./గం. |
జోను , డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 19415. ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.
బయలుదేరుట , చేరుకొనుట
మార్చు19415 అహ్మదాబాద్ కత్రా ఎక్స్‌ప్రెస్ 19:00 గంటల వద్ద అహ్మదాబాద్ లో ప్రతి ఆదివారం బయలుదేరి , ప్రతి మంగళవారం 06:50 గంటలకు కత్రా వద్దకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 19416 కత్రా అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ 10:35 గంటల వద్ద కత్రా నుండి ప్రతి మంగళవారం బయలుదేరి ప్రతి గురువారం 23:55 గంటలకు అహ్మదాబాద్ వద్దకు చేరుకుంటుంది. ఈ రైలు ఫిరోజ్పూర్, అబూ రోడ్, పాలన్పూర్, మెహసానా , జమ్ము తావి రైల్వే స్టేషను ద్వారా (వయా) నడుస్తుంది.
కోచ్ కంపోజిషన్
మార్చుఈ రైలునకు, 1 రెండంచెల (టూ టైర్) ఎసి కోచ్, 2 మూడు (త్రీ) టైర్ ఎసి కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లు, 6 సాధారణ రిజర్వేషను లేని కోచ్‌లు , 2 గార్డు కోచ్‌లు ఉంటాయి.
నిలుపుదల స్తేషన్లు
మార్చుఈ రైలు సబర్మతి జంక్షన్, మహేసన, పాలన్పూర్ అబూ రోడ్, ఫల్నా, రాణి, మార్వార్, బీవార్, అజ్మీర్, కిషన్ఘర్, ఫూలేరా, జైపూర్, గాంధీనగర్ జైపూర్, దౌసా, బందికుయి, ఆళ్వార్, ఖైర్థల్, రేవారి, భివానీ, హిస్సార్, సిర్సా, భటిండా ఫిరోజ్పూర్, జలంధర్ సిటీ, బీస్, అమృత్సర్, పఠాన్ కోట్, జమ్ము తావి , ఉధంపూర్ స్టేషన్లు వద్ద రెండు దిశల్లో ఆగుతూ గమ్యస్థానము చేరుతుంది.