భారతీయ రైల్వేలు
రకం | ప్రభుత్వ పరమైన |
---|---|
పరిశ్రమ | రైల్వేలు , లోకోమోటివ్స్ |
స్థాపించబడింది | ఏప్రిల్ 16, 1853, జాతీయం 1951 [1] |
ప్రధాన కార్యాలయం | కొత్తఢిల్లీ , |
పనిచేసే ప్రాంతాలు | భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | రైల్వేశాఖ మంత్రి: అశ్విని వైష్ణవ్ |
ఉత్పత్తులు | రైలు రవాణా, సరుకుల రవాణా, సర్వీసులు |
ఆదాయం | INR 1,63,450 కోట్లు (25 బిలియన్లుడాలర్లు)(2014–15)[2] |
ఉద్యోగుల సంఖ్య | 13,34,000 (2014) [3] |
మాతృసంస్థ | రైల్వేమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం |
విభాగాలు | 16 రైల్వే విభాగాలు (కొంకణ్ రైల్వే గాక) |
జాలస్థలి | www.indianrailways.gov.in www indianrailways |
భారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు, నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.[3][4]
రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది, 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.[3] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో ఉంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు, మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ, పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 18 జోన్లుగా విభజించారు.
చరిత్రసవరించు
భారతదేశంలో రైలు మార్గాల కొరకు మొదటిసారిగా 1832లో ప్రణాళిక ప్రవేశపెట్టబడినప్పటికీ, ఆ తరువాత మరో దశాబ్దం వరకూ ఇందులో ఎటువంటి పురోగతి సాధించలేదు. 1837 లో రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు నడిచింది. దీనిని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు, విల్లియం అవేరీచే తయారు చేయబడిన రోటరీ స్టీమ్ లోకోమోటివ్ని ఉపయోగించారు. ఈ రైల్వే సర్ ఆర్థర్ కాటన్ చే నిర్మించబడింది, ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్ళను రవాణా చేయడానికి ఉపయోగించబడింది. 1844 లో, అప్పటి గవర్నరు జనరలు, లార్డు హార్డింజ్ రైల్వే వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. రెండు కొత్త రైల్వే కంపెనీలను స్థాపించి, వాటికి సహాయపడవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీని అదేశించారు. ఇంగ్లండు లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తరువాతి కొద్ది సంవత్సరాలలో రైల్వే వ్యవస్థ త్వరితగతిన ఏర్పడింది. 1845 లో గోదావరిలో ఒక డ్యామ్ నిర్మాణం కోసం రాళ్ళు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో దోల్స్లేవమ్ వద్ద గోదావరి డాం కనస్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు. 1851 లో సోలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు, దీనిని ఒక బ్రిటీష్ అధికారి పేరు మీద ఉన్న "థామస్సన్" అని పిలిచే ఆవిరి లోకోమోటివ్లచే నడపబడుతుంది. సోలానీ నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది.1853 ఏప్రిల్ 16లో మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, బొంబాయి, థాణేల మధ్య నడుపబడింది. ఈ ప్రయాణం మొత్తం దూరం 34 కి.మీ కాగా, సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే ఇంజిన్లను వినియోగించారు. ఒక విధంగా ఈ సంఘటన భారత రైల్వేలకు అంకురార్పణ చేసిందని చెప్పుకోవచ్చు.
పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నూతన పధకాలను ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం, పెట్టుబడిదారులకు మొదటి కొద్ది సంవత్సరాలకు కనీసం ఐదు శాతం లాభాలకు హామీ లభిస్తుంది. సంస్థ ప్రారంభమైన తరువాత అది బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనమౌతుంది, కానీ సంస్థ మీద అజమాయిషీ మాత్రం పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. దీంతో 1880కి, మొత్తం రైలు మార్గాల దూరం 14,500 కి.మీ (9000 మైళ్ళు) వరకు విస్తరించింది. ఇందులో అధికశాతం పెద్ద రేవు పట్టణాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలను చేరుకునేందుకు నిర్మించబడ్డాయి. 1895 నాటికి భారతదేశంలో ఇంజిన్ల తయారీ మొదలయ్యింది. 1896లో భారత ఇంజినీర్లు ఉగాండా రైల్వేను నిర్మించడంలో సాయపడ్డారు.
ఆ తరువాత కొద్దికాలంలోనే దేశంలోని వివిధ రాజ సంస్థానాలు తమ సొంత రైలు మార్గాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విధంగా రైలు మార్గాలు వేర్వేరు ప్రాంతాలు (ఇప్పటి రాష్ట్రాలు) అస్సాం, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ లకు విస్తరించాయి. 1901లో రైల్వే బోర్డు స్థాపించబడినప్పటికీ విధాన నిర్ణయాధికారం మాత్రం బ్రిటిష్ వైస్రాయ్ జెనరెల్ (లార్డ్ కర్జన్) వద్దనే వుండేది. రైల్వే బోర్డు ఆర్థిక, పరిశ్రమల శాఖ కింద పని చేసేది. ఈ బోర్డును నిర్వహించేందుకు ప్రభుత్వ రైల్వే అధికారి అధ్యక్షుడు గానూ, ఇంగ్లాండు నుండి ఒక రైల్వే నిర్వహణాధికారి, రైల్వే సంస్థ ప్రతినిధి ఒకరు ఉండేవారు. రైల్వే బోర్డు చరిత్రలో మొదటిసారిగా లాభాలను ఆర్జించడం మొదలైన తరువాత 1907 లో రైల్వే సంస్థలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఆ తరువాతి సం.లో మొదటి సారిగా విద్యుత్ ఇంజిన్లను ప్రవేశపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన తరువాత రైల్వేలు బ్రిటీష్ వారి అవసరాల కోసం దేశం వెలుపల కూడా వినియోగించడం జరిగింది. ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సరికి రైల్వేలు బాగా దెబ్బ తిని మూల పడ్డాయి, దాంతో 1920లో ప్రభుత్వం వాటి నిర్వహణను తన ఆధీనంలోకి తీసుకొని రైల్వేల ఆర్థిక వ్యవహారాలను ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నుండి వేరు చేసింది. ఈ విధానం ఇప్పటికీ ప్రత్యేక రైల్వే బడ్జెట్ రూపంలో అమలులో ఉంది.
ఆ తరువాతి కాలంలో సంభవించిన రెండవ ప్రపంచ యుద్ధంలో ట్రైన్లను మధ్య ప్రాచ్యంలోకి తరలించడంతో రైల్వేలు మరింత దెబ్బ తిన్నాయి. రైల్వే కర్మాగారాలు ఆయుధ కర్మాగారాలుగా మారిపోయాయి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అధిక శాతం రైలు మార్గాలు కొత్తగా అవతరించిన పాకిస్థాన్ లో ఉండి పోయాయి. దాంతో మిగిలిన నలభై రెండు వేర్వేరు రైలు మార్గాలను (రాజ సంస్థానాల ఆధీనంలో ఉన్న ముప్పై రెండు మార్గాలతో సహా) కలుపుకొని ఏకైక సంస్థ "భారతీయ రైల్వే" అవతరించింది. 1951లో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వేలను మార్చి, మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో అన్ని రైల్వే కర్మాగారాలు పూర్తిగా దేశీయ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగంలోకి తెచ్చాయి. సం.1985 నాటికి అప్పటి వరకూ వినియోగంలో ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీసెల్, విద్యుత్ యంత్రాలు ప్రవేశించాయి. 1995 నాటికి దేశంలోని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది. ప్రపంచలో చైనా మిలిటరీ తరువాత అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థగా భారత రైల్వేలు రికార్డును సృష్టించాయి.
రైల్వే గణాంకాలుసవరించు
రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ .[5] ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది, 7500 స్టేషన్లు వున్నాయి [5] 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.[5] భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ మూడు కోట్ల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో 28 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది.[6] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పద్నాలుగు లక్షలు) కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది ద్వితీయ స్థానము.[3][7]
రైల్వే విభాగాలుసవరించు
పాలనా సదుపాయం కోసం భారతీయ రైల్వేలను 18 జోనులుగా విడగొట్టారు.
ప్రతి ప్రాంతీయ విభాగం నిర్వహణలో వున్న ప్రాంతాన్ని కొన్ని డివిజన్లుగా విభజించారు. ప్రతి డివిజన్ కూ ఒక ముఖ్య పట్టణం వుంటుంది. దేశమంతటా కలిపి మొత్తం అరవై ఏడు డివిజన్లు ఉన్నాయి.
ప్రయాణీకుల సౌకర్యాలుసవరించు
భారతీయ రైల్వేలు మొత్తం 8,702 ప్రయాణీకుల రైళ్ళను నడుపుతున్నాయి. ఇవి దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి, ఛండీగడ్)సుమారు ఒక కోటీ యాభై లక్షల మంది ప్రయాణీకులను వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాయి. సిక్కిం, మేఘాలయ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ వంటి రైలు రవాణా సౌకర్యం లేని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం రైలు సౌకర్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతోంది.
భారతదేశంలో ప్రజలు దూర ప్రయాణాలకు అత్యధికంగా రైలు మర్గాలనే ఆశ్రయిస్తారు. ప్రతి సాధారణ ప్రయాణీకుల రైలులో సుమారుగా పద్దెనిమిది బోగీలు ఉండగా ప్రజాదరణ పొందిన రైళ్ళలో ఇరవై నాలుగు బోగీల వరకూ ఉంటాయి. ఈ బోగీలు పద్దెనిమిది నుండి డెబ్బైరెండు మంది ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయబడ్డాయి, అయితే రద్దీ సమయాలలో ఈ భోగీలలో అంతకంటే చాలా ఎక్కువ మంది కూడా ప్రయాణం సాగించవచ్చు. ఈ బోగీలలో ఎక్కువ భాగం ఒక దానికి మరొకటి అనుసంధానించబడి ఒక దాని నుండి మరొక దానికి మారేందుకు వీలుగా ఉంటాయి. అయితే కొన్ని రైళ్ళలో అవసరార్దం ఈ మార్గం మూసివేయబడవచ్చు. సరకు రవాణా చేసే బోగీలలో చాలా రకాలు ఉన్నాయి.
ప్రయాణీకులకు కల్పించబడిన సదుపాయాల దృష్ట్యా ఈ బోగీలు వివిధ తరగతులుగా విభజించబడ్డాయి. వీటిలో సాధారణ రెండవ తరగతి రిజర్వేషన్ తరగతి అత్యంత ప్రజాదరణ పొందింది. సాధారణంగా ప్రయాణీకుల రైలు సుమారు తొమ్మిది వరకూ ఈ రకం బోగీలు కలిగి ఉండటం గమనించవచ్చు. ఇవి కాక మొదటి తరగతి, ఎయిర్ కండిషన్డ్ (రెండు, మూడు పడకలతో) బోగీలు, జనరల్ బోగీలను కూడా గమనించవచ్చు.
భారత రైల్వేలు మరి కొన్ని విశేషాలుసవరించు
- భారతదేశంలో మొదటి సారిగా రైలు ప్రయాణం చేసిన తేది 22.12.1851.
- భారతదేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన రైలు స్టేషన్లు వరుసగా భవానీ మాండీ ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. నవాపూర్ ఇది మహారాష్ట్రా, గుజరాత్ సరిహద్దులలో ఉంది. జరాయ్‌కేలా ఇది ఒడిషా, జార్ఖండ్ సరి హద్దులలో ఉంది. ఒడిషా, జార్ఖండ్ సరి హద్దులలో ఉన్న మరో రైల్వే స్టేషన్ బార్బిల్.
- భారతదేశంలో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషను ఇబ్. ఇది ఒడిషా లోని ఝూర్స్ గూడా సమీపంలో ఉంది.
- భారతదేశంలో పెద్ద పేరున్న రైల్వే స్టేషను వెంకటనరసింహరాజు వారి పేట. ఇది అరక్కోణం, రేణిగుంట రైలు మార్గంలో ఉంది.
- భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణిచే రైలు మహారాష్ట్రలోని నాగపూర్ నుండి అజ్ని వరకు ప్రయాణం చేస్తుంది. ఈ రైలు ప్రయాణం చేసే దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.
- భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి నుండి న్యూ టిన్సుకియా వరకు ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది 83.15గంటల సమయంలో 4283 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.
- భారతదేశంలో అత్యంత తక్కుగా మధ్య దూరం ఉన్న రైలు స్టేషన్లు సఫిల్ గూడ దయానంద సాగర్. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 170 మీటర్లు మాత్రమే.
- భారతదేశంలో ఉన్న అత్యంత పొట్టి రైలు కొసాంబ్ ఉమర్‌పడ వరకు ప్రయాణిస్తుంది. దీనికి కేవలం రెండు బోగీలు మాత్రమే ఉన్నాయి.
- భారతదేశంలో అత్యంత ఆలస్యంగా వచ్చే రైలు సిల్చార్ - తిరువనంతపురం ఎక్స్ ప్రెస్. ఇది సిల్చార్ నుండి తిరువనంతపురం వరకు సరాసరి 10 నుండి 12 గంటల ఆలస్యంగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణ సమయం 74:45 గంటలు
- భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన రైలు స్టేషను ఉత్తరప్రదేశ్లోని హుబ్లీ కర్ణాటక. దీని పొడవు 1505 మీటర్లు.
- భారతదేశంలో మూడు గేజుల పట్టాలు ఉన్న స్టేషను పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్పైగురి.
- భారతదేశంలో అత్యధిక మార్గాలు ఉన్న రైలు జంక్షన్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మథుర.
భారతీయ రైల్వే మండలాలుసవరించు
భారతీయ రైల్వే లు 18 రైల్వే జోన్స్ (రైల్వే మండలాలు) గా విభజించబడింది. ప్రతి రైల్వే జోన్ కొన్ని రైల్వే డివిజన్లు (రైల్వేవిభాగములుగా ) విభజించబడింది. అన్ని రైల్వే జోన్|మండలములలో దాదాపుగా 67 విభాగాలు ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వేసవరించు
ప్రధాన వ్యాసం దక్షిణ మధ్య రైల్వే చూడండి.
- భారతదేశం లోని 18 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966, అక్టోబరు 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే డివిజన్‌లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ డివిజన్‌లు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.
పేరొందిన రైళ్ళుసవరించు
- బంగారు రథం (The Golden Chariot)
- మహారాజ ఎక్స్‌ప్రెస్
- రాజధాని ఎక్స్‌ప్రెస్
- ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్
- తమిళనాడు ఎక్స్‌ప్రెస్
- గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్
- గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్
- దురంతో ఎక్స్‌ప్రెస్
- ప్యాలెస్ ఆన్ వీల్స్
- దక్కన్ ఒడస్సి
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 1". www.irfca.org.
- ↑ 2.0 2.1 "Indian Railways Budget Documents 2018-19" (PDF). Ministry of Railway. Retrieved 22 February 2018.
- ↑ 3.0 3.1 3.2 3.3 "Indian Railways Statistical Publications 2016-17: Statistical summary - Indian Railways" (PDF). Ministry of Railway. Retrieved 22 February 2018.
- ↑ "Indian Railways Statistical Publications 2016-17: Statistics for Track and Bridges - Indian Railways" (PDF). Ministry of Railway. Retrieved 22 February 2018.
- ↑ 5.0 5.1 5.2 Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2011. p. 13.
- ↑ Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2007. p. 53.
- ↑ "Indian Railways Statistical Publications 2016-17: Passenger Business" (PDF). Ministry of Railway. p. 23. Retrieved 2 March 2018.
బయటి లింకులుసవరించు
- Indian Railways: Trains at a glance along with availability and PNR status by rediff.com.
- India Rail Info: Quick lookup of Train Time Tables, Fares, Availability & Arrival/Departure Status.
- Survey of India, (2004) భారత రైల్వే మ్యాపు
- రైల్వేలు అధికారక వెబ్ పేజీ
- ఆంగ్లం , హిందీ లో భారత రైల్వే స్టేషను కోడ్స్
- భారతీయ రైల్వేలు - ఆన్లైన్ రిజర్వేషన్
- రైల్వేలు - ప్రయాణీకుల రిజర్వేషన్ విచారణ
- IRCTC పిఎన్ఆర్ స్థితి
- భారతీయ రైల్వేలు - నడుస్తున్న రైలు సమాచారం
- బహుళ IRCTC Login స్థితి Archived 2015-03-29 at the Wayback Machine
- బహుళ PNR Status స్థితి