ఆండ్రూ సైమండ్స్


ఆండ్రూ సైమండ్స్ (ఆగ్లం: Andrew Symonds) (1975 జూన్ 9 – 2022 మే 14) ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ దిగ్గజ ఆటగాడు. మాజీ ఆల్ రౌండర్.

ఆండ్రూ సైమండ్స్
Andrew symonds (cropped).jpg
2008లో ఆండ్రూ సైమండ్స్
వ్యక్తిగత సమాచారం
జననం (1975-06-09)1975 జూన్ 9
బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్
మరణం 2022 మే 14(2022-05-14) (వయసు 46)
హెర్వీ రేంజ్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
ఇతర పేర్లు రాయ్, సైమో
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం
కుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్ర ఆల్ రౌండర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు ఆస్ట్రేలియా
టెస్టు అరంగ్రేటం(cap 388) 8 మార్చి 2004 v శ్రీలంక
చివరి టెస్టు 26 డిసెంబర్ 2008 v దక్షిణ ఆఫ్రికా
వన్డే లలో ప్రవేశం(cap 139) 10 నవంబర్ 1998 v పాకిస్తాన్
చివరి వన్డే 3 మే 2009 v పాకిస్తాన్
ఒ.డి.ఐ. షర్టు నెం. 39/63
టి20ఐ లో ప్రవేశం(cap 11) 17 ఫిబ్రవరి 2005 v న్యూజిలాండ్
చివరి టి20ఐ 7 మే 2009 v పాకిస్తాన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1993/94–2009/10 క్వీన్స్‌ల్యాండ్ బుల్స్
1995–1996 గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్
1999–2004 కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్
2005 లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్
2008–2010 డెక్కన్ ఛార్జర్స్
2010 సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్
2011 ముంబై ఇండియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ [వన్ డే ఇంటర్నేషనల్ FC LA
మ్యాచ్‌లు 26 198 227 424
సాధించిన పరుగులు 1,462 5,088 14,477 11,099
బ్యాటింగ్ సగటు 40.61 39.75 42.20 34.04
100s/50s 2/10 6/30 40/65 9/64
ఉత్తమ స్కోరు 162* 156 254* 156
బాల్స్ వేసినవి 2,094 5,935 17,633 11,713
వికెట్లు 24 133 242 282
బౌలింగ్ సగటు 37.33 37.25 36.00 33.25
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 1 2 4
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 3/50 5/18 6/105 6/14
క్యాచులు/స్టంపింగులు 22/– 82/– 159/– 187/–
Source: ESPNcricinfo, 21 August 2017

కెరీర్సవరించు

1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో ఆండ్రూ సైమండ్స్ అరంగేట్రం చేసాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. మొత్తం 198 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో మొత్తం 5088 రన్స్ చేసాడు. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఆండ్రూ సైమండ్స్ 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు తీసాడు. తన కెరీర్‌లో టీ20 మ్యాచ్‌లు 14 ఆడి, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేసాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు తీసాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు.

భారతదేశంతో అనుబంధంసవరించు

బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఆండ్రూ సైమండ్స్ ఆలరించాడు. సలీల్ అంకోలా, వినోద్ కాంబ్లీ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఆండ్రూ సైమండ్స్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఆంగ్లంలో మాట్లాడటం పూర్తిగా నిషేధించబడినందున, బిగ్ బాస్ అత్యంత వివాదాస్పద భారతీయ పోటీదారులలో ఒకరైన పూజా మిశ్రా ఆయనకు అనువాదకురాలిగా వ్యవహరించారు.[1]

2011లో వచ్చిన బాలీవుడ్ చిత్రం పాటియాలా హౌస్‌లో ఆండ్రూ సైమండ్స్ నటించాడు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు.[2]

మరణంసవరించు

46 ఏళ్ళ ఆండ్రూ సైమండ్స్ 2022 మే 14న క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.[3]

మూలాలుసవరించు

  1. "Big Boss 5 | Cricketer Andrew Symonds | Landed Mumbai Airport | New Wildcard Entrant - Filmibeat". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Patiala House (2011) - Full Cast & Crew - IMDb". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్‌ మృతి". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)