ఆంథోని ఈస్ట్‌మన్
ఆంథోని ఈస్ట్‌మన్ మలయాళ సినిమా దర్శకుడు & నిర్మాత. ఆయన దర్శకత్వం వహించిన అంబాడే న్జానే సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆంథోని ఇనాయే తేడి సినిమా ద్వారా నటి సిల్క్ స్మితను సినీ రంగానికి పరిచయం చేశాడు.[1]
ఆంటోనీ ఈస్టమన్ | |
---|---|
జననం | ఆంటోనీ 1946 ఆగస్టు 26 చోవన్నూర్, కింగ్డమ్ అఫ్ కొచ్చిన్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు త్రిసూర్ జిల్లా, కేరళ, భారతదేశం) |
మరణం | 2021 జూలై 3 | (వయసు 74)
జాతీయత | భారతదేశం |
జననం, విద్యాభాస్యం
మార్చుఆంథోని మురిగితీరి కురియాకోస్, మార్తా దంపతులకు 26 ఆగస్టు 1946లో చోవన్నూర్ గ్రామం, కింగ్డమ్ అఫ్ కొచ్చిన్, బ్రిటిష్ ఇండియాలో జన్మించాడు. ఆయన చోవన్నూర్ లోని సెయింట్ థామస్ స్కూల్ & కున్నంకుళం ప్రభుత్వ పాఠశాల నుండి పాఠశాల విద్యాభాస్యం పూర్తి చేశాడు.[2] ఆంథోనీ 1960వ దశకంలో ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, ఈస్టమన్ స్టూడియో ప్రారంభించాడు.[3]
వివాహ జీవితం
మార్చుఆంథోని మేరీ ని వివాహమాడాడు. ఆయనకు కుమారుడు గంజి, కుమార్తె మినీ ఉన్నారు.[4]
దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చుఆంథోని 1979లో ‘ఇనాయే తేడి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు.
- ఇనాయే తేడి(1981)
- వయల్ (1981)
- అంబాడే న్జానే (1985)
- వర్ణతేరు (1999)
- ఐస్‌క్రీమ్
- మ్రిదుల
- కథ రచయిత
- రచన (1983),
- ఈ లోకం ఇవిడే కురే మనుష్యర్ (1985)
- ఇవిడే ఈ తీరతు (1985)
- మాణిక్యన్ (2005)
- క్లైమాక్స్ (2013)
- నిర్మాత
- పార్వతి పరిణయం (1995)
మరణం
మార్చుఆంథోనీ 3 జూలై 2021న త్రిస్పూర్‌లో గుండెపోటుతో మరణించాడు. [5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (5 July 2021). "సిల్క్ స్మిత డైరెక్టర్ ఆంథోని ఇకలేరు". Sakshi. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
- ↑ "ചലച്ചിത്ര സംവിധായകൻ ആന്റണി ഈസ്റ്റ്മാൻ അന്തരിച്ചു". ManoramaOnline (in మలయాళం). Retrieved 2021-07-04.
- ↑ The Hindu (3 July 2021). "Filmmaker Antony Eastman dies". The Hindu (in Indian English). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
- ↑ The New Indian Express (4 July 2021). "Filmmaker Antony Eastman passes away". The New Indian Express. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
- ↑ ఆంధ్రజ్యోతి (5 July 2021). "మలయాళ దర్శకుడు ఆంథోని కన్నుమూత". andhrajyothy. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.