సిల్క్ స్మిత
సిల్క్ స్మిత (డిసెంబరు 2, 1960 - సెప్టెంబరు 23, 1996) (ఆంగ్లం: Silk Smitha) గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
సిల్క్ స్మిత | |
జన్మ నామం | విజయ లక్ష్మి |
జననం | ఏలూరు, ఆంధ్రప్రదేశ్ | 1960 డిసెంబరు 2
మరణం | 1996 సెప్టెంబరు 23 మద్రాసు | (వయసు 35)
పూర్వ రంగం
మార్చువిజయలక్ష్మి 1960, డిసెంబరు 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో కొవ్వలి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది.[1], "స్మిత" అని తెరపేరు ధరించింది.[2] సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది.[3]
సినీ రంగం
మార్చుక్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200లకు పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు.[4] ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "సీతాకోక చిలుక" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది.[5] "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని హిందీలో తీశారు.[6] "వసంత కోకిల" చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది.[7]
సిల్క్ స్మిత గురించి అనేక విశేషాలను ఇమండి రామారావు యు ట్యూబ్ వీడియోలొ చెప్పారు
మరణం
మార్చుసిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. 1996, సెప్టెంబరు 23 న మద్రాసులోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.[1][8]
సిల్క్ స్మిత నటించిన కొన్ని సినిమాలు
మార్చు- శాస్త్రి (1995)
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- కుంతీ పుత్రుడు (1993)
- అమర్ (1992)
- ఆదిత్య 369 (1991) - రాజనర్తకి నందినిగా
- గీతాంజలి (1989)
- ఖైదీ నెం. 786 (1988)
- స్త్రీ సాహసం (1987)
- పాతాళ భైరవి (1985)
- శ్రీదత్త దర్శనం (1985)
- మెరుపు దాడి (1984)
- రౌడీలకు సవాల్ (1984)
- ఖైదీ (1983)
- వసంత కోకిల (1982)
- యమకింకరుడు (1982)
- సీతాకోక చిలుక (1981)
- బావ బావమరిది
- బామ్మమాట బంగారుబాట
ఇవి కూడా చూడండి
మార్చు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Kuldip, Singh (1996-09-26). "నివాళి". The Independent cited in BNET. Archived from the original on 2015-09-24. Retrieved 2006-11-09.
- ↑ KP, Sunil (1997-04-04). "Chronicle of a death foretold". Rediff India Abroad. Retrieved 2009-01-02.
- ↑ Staff Correspondent, Pradeep (2006-10-26). "కొన్ని వెండి తెర జీవితాలు". Deccan Herald. Retrieved 2006-11-09.
- ↑ Sebastian, Pradeep (2005-03-06). "Magic workers". The Hindu. Archived from the original on 2011-06-29. Retrieved 2006-11-09.
- ↑ SiitakOkachiluka Archived 2009-04-15 at the Wayback Machine, Project Ghantsala, Retrieved: 2009-01-24
- ↑ Bhattacharya, Roshmila (2002-11-08). "శృంగారం అమ్మబడును". Screen Weekly. Archived from the original on 2007-09-30. Retrieved 2006-11-09.
- ↑ Ashok Kumar, SR (2006-09-06). "ఒక విజయ గాధ". The Hindu. Archived from the original on 2007-10-21. Retrieved 2006-11-09.
- ↑ Vasudev, Shefalee (2002-12-23). "Young Affluent and Depressed". India Today. Archived from the original on 2008-12-26. Retrieved 2009-01-02.