ఆంథోని ఈస్ట్‌మన్

(ఆంథోని ఈస్ట్‌మన్‌‌ నుండి దారిమార్పు చెందింది)

ఆంథోని ఈస్ట్‌మన్‌‌ మలయాళ సినిమా దర్శకుడు & నిర్మాత. ఆయన దర్శకత్వం వహించిన అంబాడే న్జానే సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆంథోని ఇనాయే తేడి సినిమా ద్వారా నటి సిల్క్ స్మితను సినీ రంగానికి పరిచయం చేశాడు.[1]

ఆంటోనీ ఈస్టమన్
జననం
ఆంటోనీ

(1946-08-26)1946 ఆగస్టు 26
చోవన్నూర్, కింగ్డమ్ అఫ్ కొచ్చిన్, బ్రిటిష్ ఇండియా
(ఇప్పుడు త్రిసూర్ జిల్లా, కేరళ, భారతదేశం)
మరణం2021 జూలై 3(2021-07-03) (వయసు 74)
జాతీయత భారతదేశం

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆంథోని మురిగితీరి కురియాకోస్, మార్తా దంపతులకు 26 ఆగస్టు 1946లో చోవన్నూర్ గ్రామం, కింగ్డమ్ అఫ్ కొచ్చిన్, బ్రిటిష్ ఇండియాలో జన్మించాడు. ఆయన చోవన్నూర్ లోని సెయింట్ థామస్ స్కూల్ & కున్నంకుళం ప్రభుత్వ పాఠశాల నుండి పాఠశాల విద్యాభాస్యం పూర్తి చేశాడు.[2] ఆంథోనీ 1960వ దశకంలో ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించి, ఈస్టమన్‌ స్టూడియో ప్రారంభించాడు.[3]

వివాహ జీవితం

మార్చు

ఆంథోని మేరీ ని వివాహమాడాడు. ఆయనకు కుమారుడు గంజి, కుమార్తె మినీ ఉన్నారు.[4]

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు

ఆంథోని 1979లో ‘ఇనాయే తేడి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు.

  1. ఇనాయే తేడి(1981)
  2. వయల్‌ (1981)
  3. అంబాడే న్జానే (1985)
  4. వర్ణతేరు (1999)
  5. ఐస్‌క్రీమ్‌
  6. మ్రిదుల
కథ రచయిత
  1. రచన (1983),
  2. ఈ లోకం ఇవిడే కురే మనుష్యర్ (1985)
  3. ఇవిడే ఈ తీరతు (1985)
  4. మాణిక్యన్ (2005)
  5. క్లైమాక్స్ (2013)
నిర్మాత
  1. పార్వతి పరిణయం (1995)

ఆంథోనీ 3 జూలై 2021న త్రిస్పూర్‌లో గుండెపోటుతో మరణించాడు. [5]

మూలాలు

మార్చు
  1. Sakshi (5 July 2021). "సిల్క్‌ స్మిత డైరెక్టర్‌ ఆంథోని ఇకలేరు". Sakshi. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  2. "ചലച്ചിത്ര സംവിധായകൻ ആന്റണി ഈസ്റ്റ്മാൻ അന്തരിച്ചു". ManoramaOnline (in మలయాళం). Retrieved 2021-07-04.
  3. The Hindu (3 July 2021). "Filmmaker Antony Eastman dies". The Hindu (in Indian English). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  4. The New Indian Express (4 July 2021). "Filmmaker Antony Eastman passes away". The New Indian Express. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  5. ఆంధ్రజ్యోతి (5 July 2021). "మలయాళ దర్శకుడు ఆంథోని కన్నుమూత". andhrajyothy. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.