ఆంథోనీ ఫిరింగీ
సునీల్ బెనర్జీ దర్శకత్వంలో 1967లో విడుదలైన బెంగాలీ బయోగ్రాఫికల్ మ్యూజికల్ సినిమా
ఆంథోనీ ఫిరింగీ, 1967 అక్టోబరు 6న విడుదలైన బెంగాలీ బయోగ్రాఫికల్ మ్యూజికల్ సినిమా. బి.ఎన్. రే ప్రొడక్షన్స్ బ్యానరులో బి.ఎన్. రాయ్ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ బెనర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఉత్తమ్ కుమార్, తనుజ తదితరులు నటించారు. ఆంథోనీ ఫిరింగీ అనే బెంగాలీ జానపద కవి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.[1]
ఆంథోనీ ఫిరింగీ | |
---|---|
దర్శకత్వం | సునీల్ బెనర్జీ |
రచన | సునీల్ బెనర్జీ |
నిర్మాత | బి.ఎన్. రాయ్ |
తారాగణం | ఉత్తమ్ కుమార్ తనుజ |
ఛాయాగ్రహణం | బిజోయ్ ఘోష్ |
కూర్పు | అర్ధెందు ఛటర్జీ |
సంగీతం | అనిల్ బాగ్చి |
నిర్మాణ సంస్థ | బి.ఎన్. రే ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 6 అక్టోబరు 1967 |
సినిమా నిడివి | 157 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
సినిమా విడుదలైన తర్వాత, ఆ కవి పేరు ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది.[2] 1968లో జరిగిన 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో నటుడు ఉత్తమ్ కుమార్ జాతీయ ఉత్తమ నటుడిగా (ఆంథోనీ ఫిరింగీ, చిరియాఖానా సినిమాలో నటనకు) అవార్డును అందుకున్నాడు.[3][4]
కథా సారాంశం
మార్చు19 వ శతాబ్దపు బెంగాలీ కవి ఆంథోనీ ఫిరింగీ (హెన్స్‌మన్ ఆంథోనీ), వేశ్య షకీలాల ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అతను వివాహం చేసుకుని సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటాడు.[5]
నటవర్గం
మార్చు- ఉత్తమ్ కుమార్ (ఆంథోనీ ఫిరింగీ)
- తనుజ (నిరుపోమ)
- లోలిత ఛటర్జీ (లలితా ఛటోపాధ్యాయ)
- భాను బందోపాధ్యాయ (హరిపాద)
- జహోర్ రాయ్ (ఆనంద బాబు)
- అసిత్ బరన్ (భోలా మొయిరా)
- హరిధన్ ముఖర్జీ (హరిధన్ ముఖోపాధ్యాయ)
- హరధన్ బెనర్జీ (హరధన్ బంద్యోపాధ్యాయ)
- కమల్ మజుందార్ (రామ్ బసు)
- మణి శ్రీమణి (గోరక్షనాథ్)
- ఛాయా దేవి (ఆంథోనీ తల్లి)
- రుమా గుహ ఠాకుర్తా (జోగేశ్వరి)
- సోమ చౌదరి (అమీనా)
- జిబెన్ బోస్
అవార్డులు
మార్చు- జాతీయ ఉత్తమ నటుడు - ఉత్తమ్ కుమార్[4]
మూలాలు
మార్చు- ↑ "Antony Firingee (1967)". Indiancine.ma. Retrieved 2021-08-08.
- ↑ "Mr & Mrs Antony Firingee". The Telegraph. 4 August 2013. Retrieved 2021-08-08.
made famous by Uttam Kumar in the film Antony Firingee
- ↑ "National Awards for Films: Uttam Kumar (1967)" (PDF). Dff.nic.in. Directorate of Film Festivals. 25 November 1968. p. 29. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 2021-08-08.
- ↑ 4.0 4.1 The Times of India, Entertainment. "National Awards Winners 1967: Complete list of winners of National Awards 1967". timesofindia.indiatimes.com. Archived from the original on 24 March 2020. Retrieved 11 August 2021.
- ↑ Russell Campbell (2006). Marked Women: Prostitutes and Prostitution in the Cinema. Univ of Wisconsin Press. p. 182. ISBN 978-0-299-21253-7.