ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర

ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర. ఇది వృత్తాకారం రూపంతో మధ్యలో పూర్ణఘటం(అక్షయపాత్ర) కలిగివుంది. పూర్ణఘటం కింద మూడు సింహాల చిహ్నం ఉంటుంది. బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని తెలుగులో వుండగా, అంతర్ వలయాలలో పైన "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం" , కింద ఎడమ వైపున ANDHRA PRADESH (ఆంగ్ల లిపి), కుడి వైపున आन्ध्र प्रदेश (దేవనాగరి లిపి) అని వుంది. ఆంధ్రప్రదేశ్ తెలుగులో ఒకే పదంగా వుండగా, ఇతర లిపులలో అంధ్ర, ప్రదేశ్ అని రెండు పదాలుగా ఉన్నాయి.[1]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర

చరిత్ర మార్చు

 
పూర్ణకుంభం కూర్పుతో వాడబడిన పాత చిహ్నం

2500 సంవత్సరాల నాటి అమరావతి బౌద్ధస్థూపంలోని పూర్ణఘటం బొమ్మ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం తయారు చేశారు. ఈ చిహ్నం మధ్యలో వున్న పూర్ణఘటం 1956 లో ప్రథమంగా వాడుకలోకి వచ్చినా తరువాత అనూహ్యంగా పూర్ణకుంభంగా మారిపోయి వాడబడింది. 2018 ఆగష్టు 15న తిరిగి పూర్ణఘటం గా వాడుట ప్రారంభమైంది. పూర్ణఘటం అంటే అక్షయపాత్ర. దీనిచుట్టూ తామరపూలు మొగ్గలు వున్నాయి. దీనిని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్రలో వుంది.[2]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh State Emblem G.O 14-11-18". 2018-11-14. Archived from the original (PDF) on 2021-02-19.
  2. "కుంభం.. కాదు ఘటం". ఆంధ్రజ్యోతి. 2018-08-16. Archived from the original on 2018-08-16.