ఆంధ్రప్రదేశ్ తుఫాను -1977

1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను లేదా దివిసీమ ఉప్పెన (JTWC designation 06B) ఆంధ్ర ప్రదేశ్ లోని దివిసీమలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను. 1977, నవంబరు 19న ఈ తుఫాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని వలన సుమారు US$498.5 మిలియన్లు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.[1]

1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను
Super cyclonic storm (IMD scale)
Category 3 tropical cyclone (SSHWS)
తీరం దాటే ముందు తుపాను దృశ్యం
చలనంతుపాను స్థితి
ఏర్పడిన తేదీనవంబరు 14, 1977 (1977-11-14)
సమసిపోయిన తేదీనవంబరు 20, 1977 (1977-11-20)
అత్యధిక గాలులు3-minute sustained: 250 km/h (155 mph)
1-minute sustained: 205 km/h (125 mph)
అత్యల్ప పీడనం919 hPa (mbar); 27.14 inHg
మరణాలు14,204
(అంచనా: దాదాపు 50,000)
నష్టం$498.5 million (1977 USD)
ప్రభావిత ప్రాంతాలుఆంధ్రప్రదేశ్, భారతదేశం
Part of the 1977 ఉత్తర హిందూ మాహాసముద్ర తుఫాను ఋతువు

ప్రభావం

మార్చు
 
Map plotting the track and intensity of the storm, according to the Saffir–Simpson scale
Map key
  Tropical depression (≤38 mph, ≤62 km/h)
  Tropical storm (39–73 mph, 63–118 km/h)
  Category 1 (74–95 mph, 119–153 km/h)
  Category 2 (96–110 mph, 154–177 km/h)
  Category 3 (111–129 mph, 178–208 km/h)
  Category 4 (130–156 mph, 209–251 km/h)
  Category 5 (≥157 mph, ≥252 km/h)
  Unknown
Storm type
  Extratropical cyclone / Remnant low / Tropical disturbance / Monsoon depression

ఈ తుపాను కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది. కృష్ణా జిల్లా లోని దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది. వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండ రాళ్ళు జారి పడి, పట్టాలను పెళ్ళగించాయి. బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు అది కూలడంతో మరణించారు. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుపానులో చిక్కుకుని గల్లంతయ్యాయి. కేవలం కృష్ణాజిల్లా పై మాత్రమే కాక గుంటూరు ప్రకాశం జిల్లా పై గూడా ఈ తుఫాను చాలా ప్రతాపం చూపింది. దాదాపు వంద గ్రామాలు తుపానులో కొట్టుకుపోయాయి. 14,204 మంది మరణించారు. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ లెక్కల కంటే ఎంతో ఎక్కువగా, 50,000 మందికి పైగా మరణించి ఉంటారని జనతా పార్టీ ప్రకటించింది.[2]

పర్యవసానాలు

మార్చు

తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేసారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు.

తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా తక్కువ చేసి చూపించారని రాష్ట్రంలో ప్రతిపక్షమైన జనతా పార్టీ ఆరోపించింది.[2] ఈ ఆరోపణల కారణంగా ఐదుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు.[3]

మూలాలు

మార్చు
  1. "International Disaster Database". Centre for Research on the Epidemiology of Disasters. 2010. Archived from the original on 2013-12-03. Retrieved 2010-11-14.
  2. 2.0 2.1 The Associated Press (November 28, 1977). "Coverup alleged in India's cyclone disaster". Bangor Daily News. Retrieved 2010-11-14.
  3. Staff Writer (December 2, 1977). "5 in India Resign Over Cyclone Aid". Los Angeles Times.