ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి జయంతి
(ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవము నుండి దారిమార్పు చెందింది)

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి.[1] ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు. తెలుగు భాషలోనే విద్యా బోధన, ప్రజా పరిపాలన కొనసాగాలని తెలుగు నాడు సమితి గత 20 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నది.[2]

తెలుగు భాషా దినోత్సవం
తెలుగు భాషా దినోత్సవం
గిడుగు రామమూర్తి
జరుపుకొనేవారుఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రాముఖ్యతగిడుగు వెంకటరామమూర్తి జన్మదినం
జరుపుకొనే రోజు29 ఆగస్టు
వేడుకలుతెలుగులో ప్రెసెంటేషన్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్; ప్రభుత్వ కార్యక్రమాలు
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతీ సంవత్సరం ఇదే రోజు

ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు.[1]

ఇవీచూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం (29 August 2019). "తెలుగు.. భవితకు వెలుగు!". www.andhrajyothy.com. Archived from the original on 19 September 2019. Retrieved 19 September 2019.
  2.   Wikipedia. వికీసోర్స్.