తెలంగాణ భాషా దినోత్సవం

కాళోజీ నారాయణరావు జన్మదినం

తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.[1][2][3] తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

తెలంగాణ భాషా దినోత్సవం
తెలంగాణ భాషా దినోత్సవం
జరుపుకొనేవారుతెలంగాణ ప్రభుత్వం
ప్రారంభం2014
జరుపుకొనే రోజు9 సెప్టెంబరు
ఉత్సవాలుభాషా చైతన్య కార్యక్రమాలు
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

అధికారిక ప్రకటన, ప్రభుత్వ ఉత్తర్వులు

మార్చు

కాళోజీ జన్మదినమైన సెప్టెంబరు 9వ తేదీని ప్రతి ఏడాది తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు 2014 సెప్టెంబరు 9న వరంగల్లులోని కాజీపేట నిట్‌ కళాశాలలో జరిగిన కాళోజీ నారాయణరావు 100వ జయంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు.[4][5]

ఈమేరకు ప్రజాకవి కాళోజి నారాయణరావు జన్మదినం సెప్టెంబరు 9వ తేదీని ప్రతి ఏడాది “తెలంగాణా భాషా దినోత్సవం"గా జరుపుటకు తెలంగాణ రాష్ట్ర గవర్నరు ఉత్తర్వుల మేరకు గవర్నర్ పేరు మీదుగా 2014 సెప్టెంబరు 10న యువజనాభ్యుదయ, పర్యాటక & సాంస్కృతిక శాఖ నుండి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి. ఆచార్య ఉత్తర్వులు (జీ.ఒ. ఆర్టి సంఖ్య 67) జారీ చేశాడు. 2015లో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. రవీంద్రభారతిలో కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.[6]

కార్యక్రమాలు

మార్చు

కాళోజీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు తోపాటు జిల్లా కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహిస్తారు.

కాళోజీ సాహిత్య పురస్కారం

మార్చు
  1. 2015: అమ్మంగి వేణుగోపాల్, రచయిత, సాహితీ విమర్శకుడు.[7][8] రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
  2. 2016: గోరటి వెంకన్న, ప్రజాకవి, రచయిత, గాయకుడు.[9]
  3. 2017: డా. సీతారం.
  4. 2018: అంపశయ్య నవీన్[10]
  5. 2019: కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కవి, రచయితకు రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, హోంశాఖ మంత్రి మెహమూద్ అలీ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి పాల్గొన్నారు.[11][12]
  6. 2020: రామా చంద్రమౌళి, కవి, రచయిత. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పురస్కారం అందజేశాడు. సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[13][14]
  7. 2021: పెన్నా శివరామకృష్ణ, కవి, రచయిత. రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న చేతుల మీదుగా అందుకున్నాడు.[15]
  8. 2022: శ్రీరామోజు హరగోపాల్, కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు. రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూర గౌరిశంకర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మెన్ దీపికారెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మెన్ మంత్రి శ్రీదేవి, జాతీయ అవార్డు పురస్కార గ్రహిత సుద్దాల అశోక్ తేజ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమారు సుల్తానియా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[16][17]
  9. 2023: జయరాజు, కవి, రచయిత. రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అందించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, శాసనమండలి మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరిశంకర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మెన్ దీపికారెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మెన్ మంత్రి శ్రీదేవి, పర్యాటకం ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయం సంస్థ ఛైర్మన్ శ్రీధర్ అయాచితం, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[18]
  10. 2024: నలిమెల భాస్కర్‌, సాహితీవేత్త, కవి, రచయిత.[19]

చిత్రమాలిక

మార్చు

ఇతర లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి". Retrieved 19 December 2016.[permanent dead link]
  2. జనం సాక్షి. "అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవం". Retrieved 19 December 2016.
  3. నవ తెలంగాణ. "కాళోజీ నారాయణరావు జయంతి రోజే తెలంగాణ భాషా దినోత్సవం". Retrieved 19 December 2016.
  4. "కాళోజి జయంతి ఇక నుంచి తెలంగాణ భాషా దినోత్సవం". ap7am.com (in ఇంగ్లీష్). 2014-09-10. Archived from the original on 2022-05-21. Retrieved 2022-09-09.
  5. "తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి". m.andhrajyothy.com. 2015-09-07. Archived from the original on 2022-09-09. Retrieved 2022-09-09.
  6. "Telangana State Portal తెలంగాణా భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి". www.telangana.gov.in. 2015-09-06. Archived from the original on 2022-09-09. Retrieved 2022-09-09.
  7. telangananewspaper. "Ammangi Venugopal Honour Kaloji Puraskar Award 2015". Retrieved 19 December 2016.
  8. Pratap (2015-09-08). "అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం". www.telugu.oneindia.com. Archived from the original on 2015-09-24. Retrieved 2022-09-09.
  9. నమస్తే తెలంగాణ. "తెలంగాణ ముద్దు బిడ్డ గోరటి వెంకన్న కాళోజీ పురస్కారం". Retrieved 19 December 2016.[permanent dead link]
  10. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (8 September 2018). "అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం". Archived from the original on 21 May 2019. Retrieved 21 May 2019.
  11. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (10 September 2019). "కలంయోధుడు.. కాళోజీ". www.ntnews.com. Archived from the original on 10 September 2019. Retrieved 10 September 2019.
  12. వి6 వెలుగు, హమారా హైదరాబాద్ (10 September 2019). "బతుకును ఆరాధించిన కవి కాళోజీ". Archived from the original on 10 September 2019. Retrieved 10 September 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. ఈనాడు, తెలంగాణ (10 September 2020). "రామా చంద్రమౌళికి కాళోజీ పురస్కారం ప్రదానం". www.eenadu.net. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.
  14. నమస్తే తెలంగాణ, తెలంగాణ (9 September 2020). "సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య అవార్డు". ntnews. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.
  15. Sakshi (10 September 2021). "ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  16. telugu, NT News (2022-09-09). "kaloji award 2022 | ప్ర‌ముఖ క‌వి, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు శ్రీ రామోజు హ‌ర‌గోపాల్‌కు కాళోజీ పుర‌స్కారం అంద‌జేత‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-09. Retrieved 2022-09-09.
  17. "శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం". EENADU. 2022-09-08. Archived from the original on 2022-09-08. Retrieved 2022-09-08.
  18. telugu, NT News (2023-09-09). "Kaloji Award | క‌వి జ‌య‌రాజ్‌కు కాళోజీ పుర‌స్కారం ప్ర‌దానం". www.ntnews.com. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.
  19. "Kaloji Award: ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం". EENADU. Retrieved 2024-09-07.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.