ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టం నవంబర్ 1 , 1983 నుంచి అమల్లోకి వచ్చింది.[1] ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్తతోపాటు, ఉప లోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
లోకాయుక్త నియామకం, పదవీకాలం
మార్చు
- హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని 'లోకాయుక్త గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని 'ఉప లోకాయుక్త గా గవర్నర్ నియమిస్తారు.
- లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.
- లోకాయుక్త పాలనాధిపతి 'రిజిస్టార్ . ప్రత్యేక ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
- లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
- లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్ కు సమర్పించాలి .[2]
- ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
- ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
- బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు .
- లోకాయుక్తకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
- ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. #లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్ని లోకాయుక్తకు తెలియజేయాలి.
- లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
- లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి.
నెం |
పేరు |
పదవి చేపట్టిన తేదీ |
పదవి ముగిసిన తేదీ
|
1
|
జస్టిస్ ఆవుల సాంబశివ రావు
|
14.11.1983
|
13.11.1988
|
2
|
జస్టిస్ .ఏ. సీతారామ్ రెడ్డి
|
12.03.1990
|
11.03.1995
|
3
|
జస్టిస్ డి.జె. జగన్నాధ రాజు
|
11.05.1995
|
10.05.2000
|
4
|
జస్టిస్ ఆర్. రామానుజం
|
12.07.2002
|
11.07.2007
|
5
|
జస్టిస్ ఎస్. ఆనంద రెడ్డి
|
12.10.2007
|
11.10.2012
|
6
|
జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి
|
12.10.2012
|
11.10.2017
|
7
|
జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి [3]
|
15.09.2019
|
ప్రస్తుతం
|