పి.లక్ష్మణ రెడ్డి
పి.లక్ష్మణ రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఉన్నాడు.[1]
గౌరవ జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త | |
In office 15 సెప్టెంబర్ 2019 – ప్రస్తుతం | |
Nominated by | చాగరి ప్రవీణ్ కుమార్ |
Appointed by | బిశ్వభూషణ్ హరిచందన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పి.లక్ష్మణ రెడ్డి 8 ఏప్రిల్ 1945 పైడిపల్లి గ్రామం, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కళాశాల | బి.ఎం.ఎస్. కాలేజీ, బెంగుళూరు |
జననం, విద్యాభాస్యం
మార్చుపి.లక్ష్మణ రెడ్డి 1945 ఏప్రిల్ 8లో ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, పైడిపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన కొండాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసి కడపలో బి.ఎస్సీ, బెంగుళూరు లోని బి.ఎం.ఎస్. కాలేజీలో లా పూర్తి చేసి 1972 డిసెంబరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చుపి.లక్ష్మణ రెడ్డి లా పూర్తి చేసిన తరువాత కడప జిల్లా కోర్టులో ఊటుకూరు రామిరెడ్డి దగ్గర జూనియర్ గా చేరాడు. ఆయన జిల్లా మున్సిఫ్ గా 1976 ఆగస్టులో నియమితుడై తాడేపల్లిగూడెం, ధర్మవరం, తాడిపత్రిలో పనిచేశాడు. పి.లక్ష్మణ రెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కమ్ సబార్డినేట్ జడ్జిగా మదనపల్లె, గుత్తి, అనంతపురం లో పనిచేసి పదోన్నతి పై జిల్లా సెషన్స్ జడ్జిగా 1990లో నియమితుడయ్యాడు. ఆయన అదనపు జిల్లా జడ్జిగా కరీంనగర్, తిరుపతి, రాజముండ్రి, కర్నూలు లో, ప్రిన్సిపాల్ జిల్లా జడ్జిగా సంగారెడ్డి, విశాఖపట్నం, ఖమ్మం, ఒంగోలు, ఆదిలాబాద్లో పనిచేసి 1997లో గ్రేడ్ 1 జడ్జిగా పదోన్నతి అందుకున్నాడు.
పి.లక్ష్మణ రెడ్డి 2005 మే 26న అదనపు జడ్జిగా పదోన్నతి అందుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2006 ఫిబ్రవరి 20న నియమితుడయ్యాడు. అయన 2007 ఫిబ్రవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. పి.లక్ష్మణ రెడ్డి 2007 ఏప్రిల్ 18న వైస్ -చైర్మన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నియమితుడయ్యాడు.[2]జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా 2019 సెప్టెంబరు 7న నియమితుడై[3] 15 September 2019న బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నాడు.[4]
మూలాలు
మార్చు- ↑ 10TV (15 September 2019). "ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం" (in telugu). Archived from the original on 29 August 2021. Retrieved 29 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Telangana High Court. "THE HON'BLE SRI JUSTICE P. LAKSHMANA REDDY". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
- ↑ Sakshi (9 September 2019). "ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నియామకం". Archived from the original on 10 September 2019. Retrieved 22 October 2021.
- ↑ Sakshi (15 September 2019). "లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.