ఆంధ్రుల చరిత్రము
చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రుల చరిత్రము ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో ఆంధ్ర క్షత్రియులు పాలించిన సామ్రాజ్యాలు, వారి అనంతరం వచ్చిన రెడ్డి రాజులు, కమ్మ, నిజాము నవాబులు గురించి, బ్రిటిషు వారి గురించి విపులంగా ఇవ్వబడింది.
ఆంధ్రుల చరిత్రము -ప్రథమ భాగము | |
కృతికర్త: | చిలుకూరి వీరభద్రరావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | చరిత్ర |
ప్రచురణ: | విజ్ఞాన చంద్రికా జ్ఞాన మండలి |
విడుదల: | 1910 |
పేజీలు: | 435 |
భాగాలు
మార్చుప్రథమ భాగము
మార్చుఈ భాగము 1910 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఈ భాగమును వ్రాయుటకు సంవత్సర కాలము పట్టెను. ఒక అజ్ఞాత దాత మరి ఇంకొంతమంది సహాయమువలన ఈ భాగము ముద్రితమయ్యెను. రచయిత చెప్పినట్లు ఈ భాగములో కల వివరములు.
"ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, ఆంధ్రవంశము, పల్లవవంశము, చాళుక్యవంశము, చాళుక్యచోడవంశము, కళింగగాంగవంశము, ఆంధ్రచోడవంశము, బాణవంశము, వైదుంబవంశము, హైహయవంశము, బేటవిజయాదిత్యవంశము, కళింగగాంగవంశము, విష్ణుకుండిన వంశము మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి."
-
అమరావతి, సమీపస్థలములు
-
సా.శ.7 వశతాబ్దములోని హిందూదేశము. హుయెన్సాంగుత్రోవ
ద్వితీయ భాగము
మార్చుఈ భాగము 1912 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఇది మధ్యయుగమునకు సంబంధించిన చరిత్ర.సా.శ.1100 నుండి 1350 వరకు ప్రధానంగా కాకతీయ సామ్రాజ్య పతనము వరకు వ్రాయబడింది.
మూడవ భాగము
మార్చుఈ భాగము 1916 లో ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ద్వారా ప్రచురించబడింది. ఈ భాగములోని విషయం గురించి రచయిత మాటల్లో "ఈ మూడవభాగములో సా.శ. 1323 మొదలుకొని సా.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకులచరిత్రము వేఱుగను, రెడ్లచరిత్రము వేఱుగను జెప్పవలసివచ్చినది. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమునుగూర్చి ఫెరిస్తామొదలగు మహమ్మదీయచరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగువారును వ్రాసిన చరిత్రములు సరియైనవికావని తేటపడగలదు. ఈమూడవభాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును రెడ్లును పరస్పరద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యమువలన కర్ణాటసామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగరసామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకుబోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది."
విమర్శలు
మార్చువెల్లాల సదాశివశాస్త్రి 1913 లో చిలుకూరి రచనకు ఖండనగా ఆంధ్రచరిత్రవిమర్శము: వీరభద్రీయఖండనము అనే పుస్తకాన్ని రచించాడు.[1]
ఇవీచూడండి
మార్చువెలుపలి లింకులు
మార్చు
వనరులు
మార్చు- ↑ "వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు, సుజనరంజని జులై 2012". Archived from the original on 2016-03-15. Retrieved 2013-03-14.