ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక

ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక తెలుగు భాషలో ప్రచురించబడిన పుస్తకం. దీనిలో ప్రత్యేకంగా క్రియలు నిఘంటువు మాదిరిగా ఆకారక్రమంలో చేర్చబడ్డాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు 1962లో ముద్రించింది. దీనికి సంపాదకులు విశ్వనాథ సత్యనారాయణ.

ప్రణాళిక మార్చు

బెజవాడ గోపాలరెడ్డి అకాడమీ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రణాళిక ఆధారంగా వాడుకలోనున్న తెలుగు భాషలో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా నిఘంటువు తయారుచేయాలని తీర్మానించారు.

దీనికోసం వివిధ నిఘంటువులలోని క్రియలను తీసికొని వివిధ జిల్లాలలోని తెలుగు పండితులను సంప్రదించి వాడుకలోనున్న క్రియా రూపాలను ఒక దగ్గర చేర్చారు. దాని అర్ధాన్ని కూడా వివరించారు. దీనిలో విశ్వనాథ వారికి నెల్లురు జిల్లాలోని క్రియాస్వరూపాల కోసం శ్రీ మరుపూరి కోదండరామ రెడ్డి గారిని, తెలంగాణములోని క్రియారూపాల కోసం శ్రీమతి పి.యశోదారెడ్డి గారిని నియమించారు.

ఒక్కొక్క క్రియను శ్రీ నిడుదవోలు వేంకటరావు వినిపించగా ఏయే గ్రంథాలలో ఏ పద్యంలో ఆ క్రియ ఉపయోగించబడినదో తెలియజేసేవారు. దాని ఆధారంగా ఆయా క్రియల అర్ధాన్ని పొందుపరచేవారు.

దీనికి క్రియాస్వరూప మణిదీపిక అని పేరుపెట్టింది శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు. దీనిలోని పదాలు ధాతువులు కావు కావున ధాతునిఘంటువు అనడానికి ఆస్కారం లేదు.

బయటి లింకులు మార్చు