ఆంధ్ర వీరకుమార శతకము

ఆంధ్ర వీరకుమార శతకము[1]ను బి.సూర్యనారాయణమూర్తి 1940లో ప్రకటించాడు. బెజవాడ గోపాలరెడ్డి ఈ పుస్తకానికి తొలిపలుకులు వ్రాశాడు. రచయిత తనకున్న ఆంధ్రాభిమానం ఆంధ్రుల అందరి హృదయాలలో ప్రతిఫలించేటట్టు ఆంధ్రుల చరిత్రలోనూ, ఆంధ్రుల జీవితాలలోనూ ఆంధ్రులు గర్వించి చెప్పుకోదగిన విషయాలు యథోచితంగా పేర్కొని వర్ణించాడు. తన ఆంధ్రాభిమానము సంకుచితమైందని కాదని సూచించడానికి యావద్భారత దేశభక్తిని చాటే పద్యంతో ఈ శతకాన్ని ప్రారంభించాడు.

ఆంధ్ర వీరకుమార శతకము
కవి పేరుబి.సూర్యనారాయణమూర్తి
మొదటి ప్రచురణ తేదీ1940
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంఆంధ్రవీరకుమారా!
విషయము(లు)దేశభక్తి, ఆంధ్రాభిమానము
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకంద పద్యాలు
ప్రచురణ కర్తబి.సూర్యనారాయణమూర్తి, మద్రాసు
ప్రచురణ తేదీ1940
మొత్తం పద్యముల సంఖ్య119

శీర్షికలు మార్చు

  1. ఆంధ్రభాష
  2. ఆంధ్రమహాకవులు
  3. ఆంధ్రక్షాత్రము
  4. ఆంధ్రమహాపురుషులు
  5. ఆంధ్రుల దేశభక్తి
  6. ఆంధ్రనారీమణులు
  7. ఆంధ్రహరిజనులు
  8. ఆంధ్రపూర్వోన్నతి
  9. ఆంధ్రుల దైన్యము
  10. ఆంధ్రప్రతాపము
  11. ఆంధ్రరాష్ట్రము

మచ్చుతునక మార్చు

గానాంబృతంబు భక్తి
ధ్యానాంబృత మొకటిగాఁ బ్రజావళిఁ దేల్పం
బూనిన త్యాగబ్రహ్మకు
వే నతులర్పింపు మాంధ్రవీరకుమారా!

మూలాలు మార్చు

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రిక అక్టోబరు1940 సంచిక పుట128