ఆకాశవాణి కేంద్రం, హైదరాబాద్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారాలు మొదట ఒక ప్రవేటు రేడియో కేంద్రం ద్వారా హైదరాబాదు నుండి 1933లో ప్రారంభమయ్యాయి. 1935లో నిజాం ప్రభువు తన అధీనం లో తీసుకొని ప్రసారాలు చేయసాగారు. ఆయన దీనికి 'డెక్కన్' రేడియో' అని నామమకరణం చేసాడు, ఇందులో తెలుగు, ఉర్దూ భాషలలో ప్రసారాలు జరిగేవి. హైదరాబాదు సంస్థానం 1950 ఏప్రిల్ భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రాన్ని తెలుగుభాషా ప్రసారాలతోబాటు హైదరాబాదు కేంద్రం నుండి ఇతర భాషా ప్రసారాలు కూడా జరుగుతున్నాయి.1988 నుండి అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్స్ కు ఎదురుగా సైఫాబాద్, ఖైరతాబాద్, హైదరాబాద్ లో ప్రస్తుత నూతన భవనాలలోకి ఆఫీసు బ్లాకు కు మార్చబడినది. 1995లో నూతవ స్టూడియో కాంప్లెక్సును ప్రారంభించారు.[1] హైదరాబాదు 'ఏ' కేంద్రంపై ప్రధాన ప్రసారాలు 738 MW,kHz , 747 MW,kHz మీడియం వేవ్ 4800, 7420 SW,kHz షార్ట్ వేవ్ లో ప్రసారమవుతాయి. 1972 నవంబరు 13న హైదరాబాద్ బి సర్వీస్ ప్రారంభించబడింది.49 సంవత్సరాల బ్రాడ్ కాస్టింగ్ తరువాత ఆకాశవాణి హైదరాబాద్ బి 1377 kHz ని జనవరి 2022 లో నిలిపివేయబడింది.[2] 'సి' 'కేంద్రం నుండి కేవలం వాణిజ్య ప్రసారాలకు పరిమితమైంది.ఈ కేంద్రాన్ని 1971 న ప్రారంభించారు, ప్రస్తుతం దీనిని ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) హైదరాబాద్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భారత ప్రభుత్వ సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము దీని ఆధ్వర్యంలో రెండు ఎఎమ్ బ్రాడ్ కాస్టింగ్ ఎఎమ్ ఇంకా రెండు ఎఫ్ఎమ్ బ్రాడ్ కాస్టింగ్ ఎఫ్ఎమ్ స్టేషన్లు 101.9 FM,MHz ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో , 102.8 FM,MHz ఆకాశవాణి ఎఫ్ఎం వివిధభారతి ఉన్నాయి.[3]
ఇందులో త్రిపురనేని గోపీచంద్ (గ్రామీణ కార్యక్రమాలు) స్థానం నరసింహారావు (నాటకు, విభాగం)దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, రావూరి భరద్వాజ (ప్రసంగశాఖ) వింజమూరి వరదరాజయ్య , మంచాళ జగన్నాధరావు, పాలగుమ్మి విశ్వనాథం, N. Sa శ్రీనివాసన్ (సంగీత విభాగం) , వింజమూరి సీతాదేవి (జానపద విభాగం) రామమూర్తి రేఖ , వేలూరి సహజానంద, తురగా జానకీరాణి, కేశవపంతుల నరసింహారావు, గొల్లపూడి మారుతీరావు, నండూరి విఠల్, జనమంచి రామకృష్ణ, అజర్ అఫ్సర్ (ఉర్దూ), ఎల్లా వెంకటేశ్వరరావు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఛాన్కరభట్ల కృష్ణారావు, N.VS. ప్రసాదరావు వంటి ప్రముఖులు పనిచేశారు.[2]
మూలాలు
మార్చు- ↑ "All India Radio | PDF | Entertainment (General) | Languages". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2022-01-31.
- ↑ 2.0 2.1 "AIR Hyderabad B 1377 kHz discontinued after 49 years of broadcasting". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-15. Retrieved 2022-01-31.
- ↑ https://worldradiomap.com/in/hyderabad